not interest
-
Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పారీ్టలన్నీ హోరాహోరీగా తలపడుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్రా కారణాలు ఎన్నున్నా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఓటింగ్ తగ్గుముఖం పట్టడం పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడు విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఏప్రిల్ 19 నుంచి మే 25 దాకా ఆరు విడతలు పూర్తయ్యాయి. తొలి ఐదు విడతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కచి్చతమైన ఓటింగ్ గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో ఓటింగ్ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి...ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి తొలి ఐదు విడతల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 428 లోక్‌సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్‌లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటే మొత్తం ఓటింగ్ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. (ప్రాథమిక డేటా ప్రకారం ఆరో విడతలో 63.36 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇది 64.73 శాతం). 20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్... ఐదు విడతల పోలింగ్‌ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది. నాగాలాండ్‌లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్‌సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది! కశీ్మర్లో పోటెత్తారు... దేశవ్యాప్తంగా ట్రెండ్‌కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్నాటకల్లో ఓటింగ్ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో 8.31 శాతం పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్యాంక్ లాకర్లపై అనాసక్తి
ముంబై: బ్యాంక్ లాకర్లు.. ఒకప్పుడు వీటిని పొందడం కష్టంగా ఉండేది. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా అన్నట్టు గతంలో పరిస్థితి. కానీ, ఇప్పుడు బ్యాంక్ లాకర్లు అంటే చాలా మందిలో అనాసక్తి నెలకొంది. లాకర్ చార్జీలు గణనీయంగా పెరిగిపోవడం, క్లిష్టమైన కేవైసీ ప్రక్రియ తదితర ఎన్నో అంశాలు లాకర్లు అంటే మొహం మొత్తిపోయేలా చేస్తున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు లాకర్లను ఇటీవలి కాలంలో మూసివేయడం, లేదంటే మూసివేయాలనే యోచనతో ఉన్నారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. 11,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని లోకల్ సర్కిల్స్ ఈ వివరాలను విడుదల చేసింది. లాకర్లను మూసివేసినట్టు 36 శాతం మంది చెప్పగా.. అధిక చార్జీల కారణంగా లాకర్లను మూసివేయాలని అనుకుంటున్నట్టు 4 శాతం మంది పేర్కొన్నారు. 16 శాతం మంది లాకర్ సైజును తగ్గించుకున్నట్టు చెప్పారు. నూతన చార్జీలు తమకు సమ్మతమేనని, లాకర్లను కొనసాగిస్తామని 36 శాతం మంది వెల్లడించారు. ‘‘బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో శాఖకు వచ్చి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కస్టమర్లను బ్యాంక్‌లు కోరుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి లీజ్ డాక్యుమెంట్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో లాకర్ చార్జీలు కూడా పెరిగాయి’’అని లోకల్ సర్కిల్స్ తెలిపింది. చార్జీలు గణనీయంగా పెరగడం వల్లే తాము లాకర్లను రద్దు చేసుకున్నామని, లేదంటే మూసివేయాలని అనుకుంటున్నామని, లేదంటే సైజును తగ్గించుకుంటామని 56 శాతం మంది చెప్పినట్టు ఈ సంస్థ వెల్లడించింది. -
సీఎం బాటలోనే తెలంగాణ మంత్రులు!
-
వడ్డీ కాదు..రాయితీయేసున్నా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా అంతటా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వడ్డీలేని రుణాల రాయితీలు అందుతున్నా పట్టణ మహిళలకు మాత్రం ఆ ఆశ అడియాసే అయింది. పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీ రాయితీ అందించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 9,193 గ్రూపుల పరిధిలో లక్ష మందికి పైగా మహిళలు వడ్డీ రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తం గ్రూపుల్లో కేవలం 772 గ్రూపులకు మాత్రమే వడ్డీ రాయితీ అందినట్టు అధికారవర్గాలే చెపుతున్నాయి. రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆయా గ్రూపుల రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ముందుగా మహిళలు చెల్లించిన వడ్డ్డీని ప్రభుత ్వం తిరిగి రాయితీగా బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపుల ఖాతాలకు జమచేస్తుంది. ఫలితంగా మహిళలు పొందిన రుణాలను వడ్డీలేని రుణాలుగా పరిగణిస్తారు. 2012లో ఈ పథకం అమలులోకి వచ్చాక జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని 9,193 గ్రూపులను ఈ పథకానికి అర్హమైనవిగా గుర్తించారు. ఈ గ్రూపులకు మొత్తం రూ.6.20 కోట్ల వడ్డీరాయితీ సొమ్ము మంజూరైంది. అయితే సంఘాలకు ఇచ్చింది రూ.37.24 లక్షలు మాత్రమే. అధికారుల అలసత్వం కారణంగా రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో పట్టణ మహిళలకు వడ్డీ రాయితీ అందడం లేదు. విడుదలైందీ అరకొరగానే.. ప్రభుత్వం నుంచి పట్టణప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ( మెప్మా)కు, మెప్మా నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, అక్కడి నుంచి బ్యాంకులకు, బ్యాంకుల నుంచి మహిళా సంఘాల ఖాతాలకు ఈ వడ్డీ రాయితీ జమ చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంకుల నుంచి అందే నివేదికలు(సకాలంలో రుణాలు చెల్లించిన గ్రూపులు) ఆధారంగా మున్సిపాలిటీలు రాయితీ సొమ్మును బ్యాంకులకు విడుదల చేస్తుంటాయి. కానీ జిల్లాలో కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఉన్న మహిళా గ్రూపులకు వడ్డీ రాయితీ అరకొరగానే విడుదల చేశారు. 2012 జనవరిలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు (జీరో పర్సంట్ వడ్డీతో) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా ఇంత వరకు కేవలం 772 గ్రూపులకు మాత్రమే రాయితీ అందించగా మిగిలిన గ్రూపుల్లోని మహిళలకు వడ్డీ రాయితీ అందని ద్రాక్షగానే మిగిలింది. ‘మున్సిపాలిటీలను అడుగుతుంటే ఎప్పుడో విడుదల చేశామంటున్నారు. తీరా బ్యాంకులను అడుగుతుంటే ఖాతాలకు సర్దుబాటు చేసేశామని చెపుతున్నారు’ అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెప్మా నుంచి నిధులు పూర్తిగా విడుదల చేయకపోవడంతో మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ సొమ్ము జమ కాలేదని విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి తెలిసింది. అనేక అవస్థలు ఎదుర్కొని రుణాలను వడ్డీలతో సహా సకాలంలో చెల్లించి, తమకు వడ్డీ సొమ్ములు తిరిగి వస్తాయని ఆశించిన మహిళలకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి తప్ప ఒక్క రూపాయి కూడా వడ్డీరాయితీ రాలేదని పట్టణ మహిళలు మండిపడుతున్నారు.