మిస్త్రీకి మరో భారీ షాక్!
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉద్వాసన గురయ్యి, న్యాయపోరాటం చేస్తున్న సైరస్మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. టాటాసన్స్కు వ్యతిరేకంగా మిస్త్రీ దాఖలు చేసిన పిటీషన్‌ను తోసిపుచ్చిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిర్వహించగలిగింది కాదని (నాన్ మెయింటన్బుల్) చెప్పింది. టాటా సన్స్‌పై సైరస్ మిస్త్రీ కుటుంబ సంస్థలు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) తిరస్కరించింది. టాటా గ్రూప్ మైనారిటీ వాటాదారుల హక్కులను కాలరాస్తోదంటూ మిస్త్రీ సంస్థలు - సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన పిటిషన్ లో చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. కంపెనీల చట్టం ప్రకారం ఈ కంపెనీలు పిటిషన దాఖలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
చట్ట ప్రకారం ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కనీసం 10శాతం వాటాను కలిగి ఉండాలని చెప్పింది. కాగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు టాటా సన్స్‌లో 2.17శాతం (ఈక్విటీ + ప్రాధాన్య వాటాలను) శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే దీనిపై మిస్త్రీ తరపు న్యాయవాది సుందరం స్పందించారు. కంపెనీలో వాటాను కలిగి వుండకపోవడం అనేది తమ కేసుకు బలహీనత కాబోదని వాదించారు. దీనిపై మంగళవారం వాదనలు జరగనున్నాయని చెప్పారు.
కాగా టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి గత ఏడాది అక్టోబర్ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికింది. అనంతరం మిస్త్రీకి టాటాకుచెందిన ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీసీఎస్ ఛైర్మన్ గా ఉన్న చంద్రశేఖరన్ కు టాటా సన్స్ గా నియమించిన సంగతి తెలిసిందే.