not recognised
-
Dua Lipa: ప్చ్... ఒక్కరూ గుర్తుపట్టలేదు!
సినిమా లేదా టీవీలో నటించే చిన్న ఆర్టిస్ట్ కనిపించినా జనాలు చుట్టుముట్టి ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారు. అలాంటిది ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్ కనిపిస్తే? ‘జనాలను అదుపు చేయడం కష్టం’ అనుకుంటాం గానీ పాప్ సెన్సేషన్ దువా లిపా విషయంలో మాత్రం అలా జరగలేదు. సాధారణ పర్యాటకురాలిగా దువా ఇటీవల రాజస్థాన్‌కు వచ్చింది. సాదాసీదాగా రోడ్లమీద నడుచుకుంటూ వెళుతున్న దువా లిపాను ఒక్కరు కూడా గుర్తు పట్టలేదు. తాను రాజస్థాన్‌లో ఉన్నప్పటి ఫొటోలను ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. ‘ఎంత మిస్ అయ్యాను. విషయం ముందే తెలిస్తే రెక్కలు కట్టుకొని అక్కడ వాలేవాళ్లం’ అంటూ అభిమానులు భారీగా స్పందించారు. గ్రామీ అవార్డ్–విన్నింగ్ ఆర్టిస్ట్, గ్లోబల్ స్టార్ స్టేటస్ ఉన్న దువా లిపా మాత్రం తనను ఎవరూ గుర్తించకపోవడాన్ని పెద్ద విషయం అనుకోవడం లేదు. -
అంత పెద్ద పేరా.. కుదరదు
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ఓ రాచకుటుంబానికి చెందిన రాకుమారుడు తన కుమార్తెకు ఏకంగా 157 అక్షరాలతో సుదీర్ఘంగా ఉండే వెరైటీ పేరు పెట్టారు. స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్ డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్–జేమ్స్ స్టువర్ట్, సోఫియా దంపతులకు ఇటీవల కూతురు జన్మించింది. ఫెర్నాండో ఆమెకు ప్రత్యేకంగా ఉండే ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో కూడిన.. పొడవాటి పేరు పెట్టారు. అదేమిటంటే.. సోఫియా ఫెర్నాండా డొలొరెస్ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్ మికేలా డెల్ శాంటిసిమో సక్రామెంటో డెల్ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్ వై డీ టొడొస్ లాస్ సాంటోస్’. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ పేరును అధికారికంగా రిజిస్టర్ చేసేందుకు స్పెయిన్ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి అధికారులు సూచించారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది. -
టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదు
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఆ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించే నంది అవార్డు వేడుక ఆయన వ్యక్తిగతంతో పాటు ఓ ప్రైవేట్ వేడుక. ఈ నంది అవార్డు వేడుకకు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేడుకకి మేం భాగస్వామ్యం వహించం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన సంస్థలు. 24–09–2023న దుబాయ్‌లో నిర్వహించనున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి మా రెండు ఛాంబర్లకు సంబంధం లేదు. ‘నంది’ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్. నంది పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని ఖండిస్తున్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద కూడా టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
'గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకొండి'
సాక్షి, హైదరాబాద్ : గుర్తింపులేని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలపై విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలపై ఇంటర్ బోర్డు హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ పొందని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చినట్లు తెలిపింది. అయితే మార్చి 4నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఇంటర్ బోర్డు హైకోర్టుకు స్పష్టం చేసింది. కాగా తాము షోకాజ్ నోటీస్‌లు జారీ చేసిన కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని, అలాగే ఎన్ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. పరీక్షలు ముగిశాక కాలేజీలు మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. ఇంటర్ బోర్డు వాదనలు విన్న హైకోర్టు ఎన్ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
ఇంకా లభ్యంకాని విద్యార్థుల ఆచూకీ
కర్ణాటక: బళ్లారి హెచ్ సీఎల్ కాలువలో బుధవారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. నిన్న కాలువలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మృతదేహాల కోసం రోజంతా గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వీలైంనంత త్వరగా విద్యార్థుల ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని విఙ్ణప్తి చేశారు.