notes ban effect
-
నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా..
దేశంలో పెద్దనోట్లు రద్దయ్యి ఏడేళ్లు అవుతోంది. యూపీఐతోపాటు అనేక ఇతర డిజిటల్ పేమెంట్ పద్దతులూ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగి ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ... పెరక్కపోవడం మాట అటుంచండి.. ఆర్థిక వ్యవస్థలో నగదు చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే రెట్టింపు అయినట్లు తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి చెబుతోంది. ఎందుకిలా? పెద్దనోట్ల రద్దు తరువాత నగదు లావాదేవీలు యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా జరుగుతూండటం వాస్తవమే. ఏటీఎంలలోనూ చాలా పరిమిత స్థాయిలోనే నగదు లభ్యమవుతోంది. సామాన్యులకు క్యాష్ దొరకడమే కష్టమవుతోంది. కానీ.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు మాత్రం పెద్దరోట్ల రద్దుకు ముందుకంటే డబుల్ అయింది. పైగా ఈ ఏడేళ్లలో ఆస్తుల కొనుగోళ్లలో నగదు లావాదేవీలు 76 శాతం వరకూ ఉన్నట్లు ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సర్వే ఒకటి తెలిపింది. దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 78 శాతం యూపీఐ ద్వారానే చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలు నగదు లావాదేవీలను తగ్గించగా, భారత ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు నవంబర్ 2016లో రూ.17 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ 2023 నాటికి రూ.33 లక్షల కోట్లకు పెరిగిందని సర్వే తెలిపింది. చిన్నచిన్న లావాదేవీలకు డబ్బు వినియోగించడం తక్కువైంది. కానీ ఆస్తుల కొనుగోలు వంటి భారీ లావాదేవీలకు మాత్రం నగదును ఎక్కువగా వాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆస్తుల లావాదేవీల్లో నగదు అవసరం లేదని 30 శాతం మంది తెలిపారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య 24 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తేలింది. అయితే కొంతమంది మాత్రం వాహనమైనా లేదా గాడ్జెట్ అయినా అధిక విలువ కలిగిన గృహోపకరణాల కొనుగోళ్లు డిజిటల్‌గా చేస్తున్నారని చెప్పింది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ కిరాణా సామగ్రి, ఫుడ్ డెలివరీ, ఇంటి మరమ్మతులు, వ్యక్తిగత ఖర్చులు..వంటివి చెల్లించడానికి నగదును ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిపారు. ఇదీ చదవండి: అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా.. నవంబర్ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు నల్లధనాన్ని వెలికితీయడానికి, నగదు చెల్లింపునకు బదులు ప్రజలను డిజిటల్ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించడానికి చేపట్టారు. -
నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? మళ్లీ తెరపైకి
న్యూఢిల్లీ: దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో తీసుకున్న సంచలన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్ పెట్టేందుకంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ వివాదాస్పద అంశం వార్తల్లో నిలిచింది. నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రేపు (బుధవారం) సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. దీనికి ఏకంగా నాలుగు రాజ్యాంగ ధర్మాసనాలు అధ్యక్షత వహించనున్నాయి. వివరణాత్మక విచారణ తేదీని బెంచ్ నిర్ణయించే అవకాశం ఉంది. డిసెంబరు 16, 2016న ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించినప్పటికీ ఇంకా బెంచ్‌ను ఏర్పాటు చేయలేదు. కాగా నవంబర్ 8, 2016న ఆకస్మికంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అనూహ్యంగాఅదే రోజు అర్ధరాత్రినుండి, అప్పటికి చెలామణిలోఉన్న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తీసుకున్న బాధ్యతా రాహిత్యమైన ఈ చర్య దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అంతేకాదు ఉన్న నోట్లను మార్చకునేందుకు క్యూలైన్లలో సామాన్య ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగదు కొరత కారణంగా బ్యాంకుల వద్ద పొడవైన లైన్లు వేచి ఉండలేక కొంతమంది క్యూ లైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. -
నోట్ల రద్దు సరిగ్గా అమలు కాలేదు
ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కూడా దీనిపై గళమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేయలేదని.. దీన్ని మెరుగైన ప్రణాళికతో చేసిఉంటే ఫలితాలు విభిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘డీమో’పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కూడా తన పుస్తకంలో డీమోను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, నోట్ల రద్దువల్ల చిన్న వ్యాపారాలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అయితే, వీటి పునరుత్తేజానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ‘డీమో విషయంలో చిన్న విషయాలను పట్టించుకొని, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉండాల్సింది. దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు.. దీనికంటే అధిక విలువగల రూ.2,000 నోట్లను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా అమలు చేయడంలో వ్యూహం కూడా సరిగ్గా లేదు. భారీ స్థాయిలో నోట్లను రద్దు చేయాలని అనుకున్నప్పుడు, అందుకు తగ్గట్లుగా సరైన విలువ(డినామినేషన్) గల నోట్లను అంతే స్థాయిలో ఎందుకు అందుబాటులో ఉంచలేదు. ఇలాంటి అంశాలన్నింటినీ పట్టించుకుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. అయితే, డీమోతో ఫైనాన్షియల్ రంగానికి మాత్రం చాలా మేలు జరిగింది, నమ్మశక్యం కానంతగా పొదుపు పెరిగింది’ అని కోటక్ అభిప్రాయపడ్డారు. -
స్పష్టంగా నోట్ల రద్దు గాయాలు
న్యూఢిల్లీ: సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దుష్ప్రభావాలు కాలం గడిచేకొద్దీ స్పష్టంగా కనిపిస్తున్నాయని మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్సింగ్ తెలిపారు. పెద్దనోట్ల రద్దును అనాలోచిత నిర్ణయంగా అభివర్ణించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్ మాట్లాడుతూ.. ‘కాలం అన్నిరకాల గాయాలను మాన్పుతుంది. కానీ దురదృష్టవశాత్తూ పెద్దనోట్ల రద్దు చేసిన గాయాలు, మచ్చలు కాలం గడిచేకొద్దీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) పడిపోయి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చిన్నాభిన్నమయ్యాయి. వయసు, కులం, మతం, ప్రాంతం, వృత్తి అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఉద్యోగాలు పడిపోయాయి. నోట్ల రద్దు దుష్ప్రభావాలను ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదల, రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో స్వల్పకాలిక ప్రయోజనాల కోసం అశాస్త్రీయ, తాత్కాలిక లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినందుకు మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని పేర్కొన్నారు. 2016, నవంబర్ 8న మోదీ పెద్దనోట్లను రద్దుచేశారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా నేడు జాతీయ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సూటుబూటు స్నేహితుల కోసమే: రాహుల్ తన సూటుబూటు స్నేహితుల నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకునేందుకు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు అనే తీవ్రమైన కుట్ర పన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా సమర్థిస్తే దేశప్రజల విజ్ఞత, జ్ఞానానికే అవమానమని వ్యాఖ్యానించారు. నోట్లరద్దు లక్షలాది మంది ప్రజల జీవితాన్ని నాశనం చేసిందన్నారు. నోట్లరద్దును పక్కా ప్రణాళికతో చేసిన నేరపూరిత ఆర్థిక కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. కాగా ఇది పక్కా దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధికారిక మనీలాండరింగ్ పథకమని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు. దేశచరిత్రలోనే చీకటిరోజు: మమతా పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత చరిత్రలోనే చీకటి రోజని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నోట్ల రద్దు వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా వ్యవసాయంతో పాటు చిరు వ్యాపారులు, కార్మికులు, రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిచేత్తో నాశనం చేశారు: ఏచూరి మోదీ, ఆయన అనుచరులు పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని నిర్మూలిస్తుందని, అవినీతి, ఉగ్రవాదాన్ని రూపుమాపుతుందని నమ్మారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఇకపై డిజిటల్ ఆర్థిక లావాదేవీలు మాత్రమే జరుగుతాయని వారు భావించారన్నారు. కానీ నిజమేంటంటే.. మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒంటిచేత్తో నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే!
గాంధీనగర్/న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవగానే.. పలు మీడియా, ప్రైవేటు సంస్థలు మొదటివిడత సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఇండియాటుడే–యాక్సిస్, టైమ్స్‌నౌ–వీఎంఆర్ సంస్థలు సర్వేల ఫలితాలను బుధవారం వెల్లడించాయి. ఇండియాటుడే–యాక్సిస్ గ్రూపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో నిర్వహించిన సర్వేలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురనుందని తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనీసం 10 శాతం ఓట్లతో వెనకబడుతుందని తేలింది. 68 స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 43–47 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ 21–25 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియాటుడే–యాక్సిస్ సర్వే తెలిపింది. రాజకీయ వేడి రాజుకున్న గుజరాత్లో బీజేపీ గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 182 స్థానాల అసెంబ్లీలో 48 శాతం ఓట్లతో 115–125 స్థానాలు బీజేపీ ఖాతాలోకే వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ 38 శాతం ఓట్లు సాధించి 57–65 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ ఎన్నికల్లో పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ సంస్థ ప్రభావం పెద్దగా ఉండబోదని కూడా ఇండియాటుడే–యాక్సిస్ సర్వే వెల్లడించింది. కేవలం గుజరాత్‌లోనే సర్వే నిర్వహించిన టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వే కూడా ఇక్కడ బీజేపీకి 118–134 సీట్లు వస్తాయంది. రాష్ట్రవ్యాప్తంగా 6వేల మందిని ప్రశ్నించిన టైమ్స్‌నౌ సర్వే.. కాంగ్రెస్ 49–61 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇతరులు మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఈ సర్వే పేర్కొంది. 2012లో (మోదీ గుజరాత్ సీఎంగా) బీజేపీ 115 స్థానాలను కైవసం చేసుకుంది. సర్వేలో అభిప్రాయాలు ఇండియాటుడే–యాక్సిస్ సర్వేలో 66% మంది ప్రధానిగా మోదీ ఉండటం వల్ల గుజరాత్‌కు మేలు జరిగిందని చెప్పగా, 74% మంది మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అయితే జీఎస్టీపై 51 శాతం మంది, నోట్ల రద్దుపై 53 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో ఇబ్బందులకు గురైనట్లు పేర్కొన్నారు. టైమ్స్‌నౌ సర్వేలో 46 శాతం మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు ‘గుజరాత్ అస్మిత’ (గర్వకారణం) అని అభిప్రాయపడగా.. 21 శాతం మంది ఎన్నికల స్టంట్ అని పేర్కొన్నారు. 81% మంది మోదీ ‘గుజరాత్ బిడ్డ’ అని.. ఆయన నేతృత్వంలోని బీజేపీకి ఓటేస్తామని తెలిపారు. 2012లో ఇదే అభిప్రాయం 60% మందిలో వ్యక్తమైంది. ఇరుపార్టీల ఓట్ల శాతంలో 2012తో పోలిస్తే పెద్దగా తేడా ఉండదని ఈ సర్వే పేర్కొంది. అయితే బీజేపీ ప్రభుత్వంపై గతంలో (2012లో 60 శాతం సానుకూలత) కంటే సదభిప్రాయం తగ్గింది. 54% మంది బీజేపీ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2014తో పోలిస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ కాస్త పెరగొచ్చని టైమ్స్‌నౌ పేర్కొంది. గుజరాత్‌పై సర్వే ఫలితాలు ఇండియాటుడే టైమ్స్‌నౌ –యాక్సిస్ వీఎంఆర్ బీజేపీ 115–125 118–134 కాంగ్రెస్ 57–65 49–61 ఇతరులు 0–2 0–3 -
సాగు ఆగుతోంది
బ్యాంకు ఖాతాల్లో నగదున్నా చేతికందని దుస్థితి నెలాఖరు నాటికి నాట్లు వేయాలని లక్ష్యం నేటికీ నారుమడులు కూడా వేయలేని పరిస్థితి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్న రైతు సంఘాలు పోడూరు, మొగల్తూరు మండలాల్లో సాగు విరామానికి సిద్ధమైన రైతులు పెనుగొండ : వరి నాట్లు పూర్తి చేయాల్సిన తరుణం తరుముకొస్తోంది. మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో కాలువలకు నీటి విడుదల నిలిపివేసే పరిస్థితి ఉన్న దృష్ట్యా డిసెంబర్ నెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పదేపదే చెబుతున్నారు. లేదంటే దాళ్వా సాగు గట్టెక్కడం కష్టమని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే డిసెంబర్ నెలాఖరు కాదు కదా.. కనీసం జనవరి నెలాఖరు నాటికైనా నాట్లు వేసే అవకాశం లేదు. ఎందుకంటే.. చాలామంది రైతులు నారుమడులే వేయలేదు. ఇప్పటికిప్పుడు నారుమడులు వేసినా.. నెల రోజులపాటు నారు పెంచాల్సి ఉంటుంది. ఏదోలా కష్టపడి నెలాఖరు నాటికి నారుపోస్తే.. జనవరి నెలాఖరు నాటికి గాని నాట్లు వేయలేని పరిస్థితి. రైతుల బ్యాంకు ఖాతాల్లో తగినంత నగదు నిల్వలు ఉన్నా.. చేతికందటం లేదు. పెట్టుబడులకు సొమ్ముల్లేక.. ఎక్కడా అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో పంట వేయాలో మానాలో నిర్ణయించుకోలేక అన్నదాతలు డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గడువు ముగిసిపోయాక నాట్లు వేసినా నీటి కొరత ఏర్పడి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో చాలాచోట్ల దాళ్వా వరిసాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాగు లక్ష్యం 4.50 లక్షల ఎకరాలు ప్రస్తుత దాళ్వాలో జిల్లాలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లో 4.50 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. మొత్తం విస్తీర్ణానికి సరిపోయేలా 8,300 ఎకరాల్లో రైతులు నారుమడులు వేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కనీసం సగం విస్తీర్ణంలో అయినా నారుమడులు పడలేదు. డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటి వారానికి పూర్తి విస్తీర్ణంలో నాట్లు పడతాయని, రైతులు ఈ లక్ష్యానికి అనుగుణంగా నాట్లు వేసేలా ఎక్కడికక్కడ చైతన్యపరుస్తున్నామని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. 90 శాతం విస్తీర్ణంలో నారుమడులు పడినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బ్యాంకుల్లో నగదు ఉన్నా.. సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు అల్లాడుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మాసూలు చేసిన పంటను అమ్మినా చేతికి మాత్రం నగదు అందడం లేదు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేసి రోజంతా వేచి చూస్తే 10 రోజులకు చేతికి కేవలం రూ.10వేలు మాత్రమే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారుమడులకు కనీస పెట్టుబడులు లేవని వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు, దమ్ములు చేయడానికి అప్పులు చేద్దామన్నా ఇచ్చేవాళ్లు కరువయ్యారని చెబుతున్నారు. నగదు కొరతతో అప్పులు సైతం పుట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు సాగడం కష్టసాధ్యమేనని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఽప్రత్యామ్నయ మార్గాలు చూపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. 25 ఎకరాల సాగుకు రూ.25 వేలు అందాయి నానాకష్టాలు పడి 25 ఎకరాలు సాగు చేశాను. ధాన్యం అమ్మితే చేతికి రూ.25 వేలు మాత్రమే వచ్చాయి. దాళ్వా పెట్టుబడులకు కనీసం లక్ష రూపాయలు కావాలి. సార్వా పెట్టుబడుల కోసం అప్పులు ఇంకా తీర్చలేదు. నగదు లేక నారుమడులు వేయలేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. చిన్నం చినవెంకటరెడ్డి, చిన్నంవారి పాలెం, రైతు ఆదుకోకపోతే కష్టమే రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే సాగు చేయడం కష్టమే. బ్యాంకుల్లో రూ.2 వేలు ఇచ్చి సరిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయడం దుర్లభం. పట్టాదారు పుస్తకాల ఆధారంగాను, కౌలు రైతుల గుర్తింపు కార్డుల ఆధారంగాను బ్యాంకుల్లో జమైన నగదు మొత్తం రైతులకు అందించే ఏర్పాట్లు చేయాలి. పి.సత్యనారాయణ, రైతు, జాంపేట -
చిన్న పరిశ్రమలపై నోట్ల రద్దు ఎఫెక్ట్