యాక్సిస్ బ్యాంక్ గుడ్న్యూస్
ముంబై: దేశంలో అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు కూడా రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల కోతను ప్రకటించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ తగ్గింపు రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.
కాగా ఆర్బీఐ సూచనల మేరకు గత ఆగస్టులో 8.95 శాతం తగ్గింపు రేట్లను యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరోసారి రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఫెస్టివ్ సీజన్ లో ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్ బీఐ, మరో ప్రయివేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ ఇటీవల వడ్డీరేట్ల కోత పెట్టాయి. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.