19న సమర సమ్మేళనం
హైదరాబాద్: ఈనెల 19న నిజాంకాలేజీ గ్రౌండ్స్‌లో వికలాంగుల సమర సమ్మేళనం నిర్వహించనున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) ప్రకటించింది.
వికలాంగుల డిమాండ్ల సాధనలో భాగంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి వికలాంగుడికి పింఛన్ ఇవ్వాలని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను తిరిగి ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే డిమాండ్లను సాధించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నట్లు ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ పేర్కొన్నారు.