NSC rate cut
-
బ్యాడ్‌న్యూస్ : ఆ పథకాల వడ్డీరేట్లు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్ చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై అందించే వడ్డీరేట్లను ప్రభుత్వం నేడు తగ్గించింది. జనవరి-మార్చి కాలంలో వడ్డీరేట్లను, ప్రస్తుతమున్న వడ్డీరేట్లకు 0.2 శాతం తగ్గించినట్టు పేర్కొంది. ఈ తగ్గించిన రేట్ల పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ), సుకన్య సమృద్ధి అకౌంట్, కిసాన్ వికాస్ పాత్ర(కేవీపీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఉన్నాయి. అయితే ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీరేటును 8.3 శాతంగానే ఉంచింది. సీనియర్ సిటిజన్స్ స్కీమ్ వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా చెల్లిస్తారు. గతేడాది ఏప్రిల్ నుంచి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా మారుస్తూ వస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పీపీఎఫ్, ఎన్ఎస్సీ వార్షిక రేటు 7.6 శాతంగా కాగ, కేవీపీ వడ్డీరేటు 7.3 శాతంగా పేర్కొంది. అదేవిధంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రస్తుతమున్న రేటును 8.3 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. 1-5 ఏళ్ల టర్మ్ డిపాజిట్ల వడ్డీరేట్లను 6.6 శాతం నుంచి 7.4 శాతంగా ఉంచింది. క్వార్టర్లీ ఈ వడ్డీరేట్లను చెల్లిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా నోటిఫై చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రభుత్వ బాండ్ దిగుబడులను లింక్ చేస్తూ చెల్లిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేయనున్నది. త్వరలో బ్యాంకుల్లో వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గటం ఖాయమని తెలుస్తోంది. -
పీపీఎఫ్ వడ్డీరేట్లకూ ప్రభుత్వం షాక్?
న్యూఢిల్లీ : గత ఎనిమిదేళ్లలో మొదటిసారి ఈపీఎఫ్ వడ్డీరేటు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రప్రభుత్వం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వడ్డీరేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పీపీఎఫ్, చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారు మరో రేటు కోతకు సిద్ధంగా ఉండాలని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవేళ గోపినాథ్ ప్యానెల్ ఫార్ములా అమలుచేస్తే ప్రభుత్వ బాండ్ల ఆదాయాలతో సంబంధమున్న చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్లకు భారీగా కోత పడనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీపీఎఫ్ రేట్ దాదాపు 100 బేసిస్ పాయింట్లు తగ్గి 7 శాతానికి దిగొస్తుందని సమాచారం. గోపినాథ్ ప్యానెల్ ఫార్ములా ప్రకారం కనీస ప్రభుత్వ బాండ్ల ఆదాయాలు కంటే చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్లే ఎక్కువగా ఉన్నాయి. పీపీఎఫ్నే తీసుకుంటే సగటు 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఆదాయం కంటే పీపీఎఫ్ వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది. 10 ఏళ్ల పరిమితులోని ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీరేట్లు 6.5 శాతానికి దిగిరావడంతో, జనవరి-మార్చి త్రైమాసికంలో పీపీఎఫ్ రేటు కూడా 7 శాతానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే గోపినాథ్ ప్యానెల్ ఫార్ములాను రద్దు చేసి కేవలం పీపీఎఫ్ రేట్లను 20-25 బేసిస్ పాయింట్లు మాత్రమే ప్రభుత్వం తగ్గించే అవకాశాలున్నాయని ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ చెబుతున్నారు. ఏ మేరకు తీసుకున్నా పీపీఎఫ్ రేటు కిందకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఆ రేటు తగ్గించినా.. బ్యాంకు డిపాజిట్లు, కార్పొరేట్ ఎఫ్డీలపై ఆర్జించే ఆదాయాల కంటే పీపీఎఫ్పైనే పొందే వడ్డీ రేటే ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్యాక్స్-ఫ్రీ పీపీఎఫ్ పెట్టుబడిదారులకు ఉత్తమమైన పొదుపు మార్గమమని విశ్లేషకులు చెప్పారు.