NSSO
-
తగ్గిన నిరుద్యోగ రేటు - గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగిత రేటు 6.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఇది 7.2 శాతం నమోదైంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉండగా, ఏప్రిల్–జూన్‌లో 6.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగం రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 8.6 శాతానికి వచ్చి చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 9.4 శాతంగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 9.1 శాతం, జనవరి–మార్చిలో 9.2 శాతం, అక్టోబర్–డిసెంబర్ 9.6 శాతం నమోదైంది. పట్టణ ప్రాంత పురుషులలో నిరుద్యోగిత రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 6.6 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 5.9 శాతం ఉంది. 2022–23 జనవరి–మార్చిలో 6 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 6.5 శాతంగా నమోదైంది. క్రియాశీల శ్రామిక శక్తి.. 2023 జూలై–సెప్టెంబర్‌లో పట్టణ ప్రాంతాలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల్లో క్రియాశీల శ్రామిక శక్తి 49.3 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.9 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్–జూన్‌లో 48.8 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చిలో 48.5 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 48.2 శాతం నమోదైంది. -
ట్విట్టర్ వేదికగా ప్రధానిపై రాహుల్ ఫైర్
-
లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్‌కు షాక్
-
షాకింగ్ : 45 ఏళ్ల గరిష్ట స్ధాయిలో నిరుద్యోగ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైన ఎన్ఎస్ఎస్ఓ సర్వే కలకలం రేపుతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు చెందిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో నాలుగున్నర దశాబ్ధాల గరిష్టస్ధాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. 2017-18లో నిరుద్యోగ రేటు ఎన్నడూ లేని విధంగా 6.1 శాతానికి ఎగబాకిందని నివేదిక వెల్లడించింది. అధికారికంగా విడుదల కాని ఈ సర్వే నివేదిక తమకు అందుబాటులో ఉందని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక అంశాలను ప్రస్తావిస్తూ తెలిపింది. మధ్యంతర బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు వెలుగులోకి వచ్చిన ఈ నివేదిక ఆధారంగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడికి పదునుపెట్టాయి. మరోవైపు నివేదిక వెల్లడించడంలో జాప్యాన్ని నిరసిస్తూ జాతీయ గణాంక కమిషన్ తాత్కాలిక చైర్మన్ పీసీ మోహనన్ సమా ఇద్దరు సభ్యులు కమిషన్ నుంచి తప్పుకున్నారు. కాగా, నిరుద్యోగిత రేటు పెరగడంపై నోట్ల రద్దు ప్రభావం ఉన్నట్టు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అత్యధికంగా 7.8 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతంగా నమోదైంది. ఆర్ధిక కార్యకలాపాల్లో గత సంవత్సరాల కంటే కార్మిక ఉద్యోగుల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఉద్యోగుల సమూహం నుంచి బయటకువస్తున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. -
ఉద్యోగాల్లోనూ ఎస్సీలది వెనక‘బాటే’
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఎస్సీల ఉద్యోగ, ఉపాధి కోసం వివిధ పథకాల కింద వేల కోట్లు వెచ్చిస్తోంది. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలు గమనిస్తే ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ఎస్సీలు వెనుకబడి ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక వివక్ష, సామాజిక–ఆర్థిక స్థాయి ఈ వెనకబాటుకు కారణాలని తెలుస్తోంది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం(ఎన్ఎస్ఎస్వో)2011–12 తర్వాత దేశంలో ఉద్యోగాల పరిస్థితిపై ఎలాంటి సర్వే చేయలేదు.అయితే అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మిగతా కులాల వారితో పోలిస్తే ఎస్సీలు ఉద్యోగాల విషయంలో వివక్షకు గురవుతున్నారని స్పష్టమవుతోంది. వేతన కూలీలు 63% ఎన్ఎస్ఎస్ఓ 2011–12 సర్వే ప్రకారం ఎస్సీలలో 63% వేతన కూలీలు (ఉద్యోగ భద్రతలేని చిన్నాచితకా పని చేసే వాళ్లు –అంటే ఇళ్లలో పని చేసేవారు, హమాలీలు మొదలైన వారు) గా పని చేస్తున్నారు. ఇది ఓబీసీల్లో 44%, ఉన్నత కులాల్లో 42%, ఇతర కులాల్లో46%గా ఉంది. ఈ వేతన కూలీల్లో కూడా దినసరి కూలీలుగా పని చేస్తున్న వారిలోనూ ఎస్సీలే అధికంగా ఉన్నారు. దేశ జనాభాలో ఎస్సీలు 16శాతం ఉంటే, దినసరి కూలీల్లో ఎస్సీలు 32 శాతం ఉన్నారు. ఇతర కులాల్లో ఇది 20–30 శాతానికి మించలేదు. కులం కారణంగా వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రైవేటు రంగం ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఎన్ఎస్ఎస్ఓ తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎస్సీల్లో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే 1.7 శాతం ఎక్కువ ఉంది. 1990ల నుంచి ఎస్సీల్లో నిరుద్యోగ రేటు శాతం మిగతా వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటోంది. మన సమాజంలో తరతరాలుగా కొన్ని ఉద్యోగాలు ఉన్నత కులస్థులకని, మరి కొన్ని ఉద్యోగాలు నిమ్న జాతులకని నిర్దేశించడం జరిగింది. ఉన్నత కులస్థుల ఉద్యోగాల్లోకి ఎస్సీలను తీసుకోవడానికి యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. ఇక విద్య, నైపుణ్యం వంటివి కూడా ఉద్యోగాల్లో ఎస్సీల వెనకబాటుకు కారణమవుతున్నా సామాజిక వివక్షే కీలక పాత్ర వహిస్తోంది. ఉన్నత కులస్తుల ఇళ్లలో వంటవాళ్లుగా, పనివాళ్లుగా, హోటళ్లలో సర్వర్లుగా, ప్రార్థనా స్థలాల నిర్మాణంలో కూలీలుగా ఎస్సీలను తీసుకోవడానికి విముఖత చూపుతున్నట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ సర్వేలో తేలింది. ఉన్నత కులాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగాలకు ఉన్నత కులస్తులనే ఎంపిక చేస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఒక ఉద్యోగానికి సమాన అర్హతలున్న ఎస్సీ, ఇతర అభ్యర్ధులు దరఖాస్తు చేస్తే వారిలో ఉన్నత కులస్థులకే ఇంటర్వ్యూ పిలుపు వస్తోందని థోరట్ అండ్ అటెవెల్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఉన్నత చదువులు చదివిన ఎస్సీల కంటే తక్కువ చదువున్న ఇతర కులస్థులకే ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఆ సంస్థ వెల్లడించింది. ఈ వివక్ష కారణంగా ఉద్యోగాలు లభించక చాలా మంది ఎస్సీలు పేదలుగానే ఉండిపోతున్నారు. ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం 2011–12లో ఎస్సీల్లో మూడింట ఒక వంతు మంది పేదలు కాగా ఓబీసీల్లో 20శాతం, ఇతర కులాల్లో 9 శాతం పేదలు ఉన్నారు.