NTR sujala flow scheme
-
‘నీరు’గార్చారు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఎన్టీఆర్ సుజల పథకం అమలుకు చంద్రబాబు సంతకం చేశారు. 2014 అక్టోబరు 4నకపిలేశ్వరపురం మండలం అంగర నుంచి తొలి విడత జన్మభూమి ప్రారంభించిన అనంతరం, మొట్టమొదటి ఎన్టీఆర్ సుజల ప్లాంటును ఈ గ్రామంలోనే ప్రారంభించారు. ఇంకేముంది గ్రామ గ్రామానా ఈ ప్లాంట్లు ఏర్పాటై ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందుతుందని అందరూ ఆశించారు. అయితే దీనికి భిన్నంగా పథకం అమలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. స్వయాన చంద్రబాబు ప్రారంభించిన తొలి ప్లాంటే నిర్వహణ లేమితో మూతపడిపోగా మిగిలినచోట్ల ఈ పథకం నీరుగారిపోయింది. రక్షిత నీటి హామీని గాలికొదిలేసిన సర్కారు రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంట్ల ఏర్పాటు కోసం విచ్చలవిడిగా అనుమతులిస్తోంది. వీటి ద్వారా జిల్లాలో రోజుకు సుమారు రూ.1.10 కోట్ల మేర నీటి వ్యాపారం జరుగుతోంది. తూర్పుగోదావరి , మండపేట: జిల్లాలోని 1,069 పంచాయతీలకుగాను దాదాపు 265 పంచాయతీల్లో మాత్రమే దాతల సహకారంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాలను ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంది చంద్రబాబు సర్కారు. మరో రెండు నెలల్లో సర్కారు పదవీకాలం ముగుస్తుండగా మిగిలినచోట్ల వీటి ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే కొట్టుమిట్టాడుతోంది. తాగునీటి సమస్య అధికంగా ఉన్న సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 20 లీటర్ల నీటికి రెండు రూపాయలు తీసుకోవాల్సి ఉండగా, అధికశాతం రూ. ఐదు నుంచి రూ. 10 వరకూ తీసుకుంటున్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సుజల ప్లాంటు నిర్వహణ భారంతో మూతపడి ఆరు నెలలు కావస్తోంది. ప్రారంభించిన కొన్నాళ్లకే ఈ ప్లాంటు మూతపడగాపార్టీకి చెడ్డపేరు వస్తుందని కొంతకాలంపాటు స్థానిక అధికార పార్టీ నేతలు చందాలు వేసుకుని నిర్వహించారు. ఆరు నెలల క్రితం మూతపడగా మళ్లీ ఎవరూ ముందుకు రాలేదని గ్రామస్తులు అంటున్నారు. నిర్వహణ భారంతోపాటు మరమ్మతులు వస్తే చేయించే వారు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ప్లాంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని మూసివేత దిశగా పయనిస్తున్నాయి. కరప మండలం పెద్దాపురప్పాడు, తుని మండలం వి. కొత్తూరు, కోటనందూరు మండలం కొట్టాం, కేఏ మల్లవరం, రంగంపేట మండలం ఈలకొలను, తదితర గ్రామాల్లో ఇప్పటికే ‘ఎన్టీఆర్ సుజల’ కేంద్రాలు మూతపడ్డాయి. పుట్టగొడుగుల్లా ప్రైవేటు ప్లాంటులు... ప్రైవేటు ఆర్ఓ ప్లాంట్లు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐఎస్ఐ రివర్స్ అస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంటు పెట్టాలంటే దాదాపు రూ.30 లక్షలు వరకూ వ్యయమవుతుంది. స్థానిక సంస్థల్లో అనుమతులు పొంది ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఐఎస్ఐ సర్టిఫికెట్ ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. సాధారణ ప్లాంట్లు జిల్లాలో సుమారు 1,410 వరకూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 లీటర్ల క్యాన్ రూ.5 నుంచి రూ.10 వరకూ విక్రయిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. ఇళ్లకు చేరవేస్తే రవాణ చార్జీలు అదనం. ఈ మేరకు జిల్లాలో రోజుకు సుమారు రూ. 1.10 కోట్లు నీటి వ్యాపారం జరుగుతోంది. ప్లాంట్లలో కేవలం ఆర్ఓ టెక్నాలజీ ద్వారా నీటిలోని మలినాలను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. నిల్వ చేసిన నీటిలో వైరస్ చేరకుండా వినియోగించే ఓజేనేషన్ సిస్టమ్, బ్యాక్టీరియాను శుద్ధిచేసే యూవీ సిస్టమ్‌లు అధికశాతం ప్లాంట్లలో ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. కొన్నిచోట్ల కుళాయి నీటిని ప్యాకింగ్ చేసి మినరల్ వాటర్‌గా అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోర్లు, బావుల్లోని నీటిని తాగలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ప్లాంట్లను జనం ఆశ్రయించి జేబులను గుల్ల చేసుకుంటున్నారు. ఈ నీటిలో నాణ్యత ఎంతన్నది పరీక్షించే నా«థుడు లేక ఆనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మరమ్మతు రావడంతోనిలిచిపోయింది అంగరలోని ఎన్టీఆర్ సుజల ప్లాంట్‌లో యంత్రానికి మరమ్మతు రావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ నిధులతో మరమ్మతు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశాం. పంచాయతీ అధికారుల సంయుక్త కృషితో త్వరితగతిన నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం.– రామకృష్ణారెడ్డి, జేఈ, ఆర్డబ్ల్యూఎస్,కపిలేశ్వరపురం -
సుజలం.. విఫలం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా జిల్లా వాసులకు ఇప్పట్లో తాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నా ఈ పథకం ఎప్పటికి అమలు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రతి ఇంటికి రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీరు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాలుగు సంవత్సరాల పాలన ముగుస్తున్నా ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల మొదటి విడతగా పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, కందుకూరు నియోజక వర్గాల్లో 18 మండల కేంద్రాల్లో రూ.30,18,16 కోట్ల చొప్పున రూ.64.01 కోట్లతో మూడు ప్యాకేజీలుగా శుద్ధ జల కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. సింగిల్ టెండర్ మాత్రమే దాఖలు కావడంతో అధికారులు టెండర్లను రద్దు చేశారు. తిరిగి టెండర్లు ఎప్పటికి నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. దీంతో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా జిల్లా వాసులకు సురక్షిత తాగు నీరు కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఫ్లోరైడ్ ప్రాంతాలకూ దిక్కులేదు.. ప్రకాశం జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల, కంభం, కొమరోలు, సీఎస్‌పురం, దొనకొండ, దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, తర్లుపాడు, యర్రగొండపాలెం, దర్శి, ముండ్లమూరు, పీసీపల్లి, పొదిలి, కందుకూరు తదితర 18 మండల కేంద్రాల్లో శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. వాస్తవానికి శుద్ధ జల కేంద్రాలకు పుష్కలంగా నీరు అవసరం. గంటకు 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న బోరుబావులుతవ్వాల్సి ఉంది. అలా అయితేనే 10 వేల లీటర్ల సురక్షిత నీరు వస్తుంది. అప్పుడే ప్రజలకు నీటిని అందించే అవకాశం ఉంటుంది. పశ్చిమ ప్రకాశంలో పుష్కలంగా నీరున్న ప్రాంతాలు అరుదు. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకట్రెండు చోట్ల నీరున్న ప్రాంతాలు దొరికినా.. బోరు బావుల తవ్వకం, శుద్ధజల కేంద్రాల ఏర్పాటు, మారుమూల గ్రామాలకు పైప్లైన్ల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ లెక్కన ఫ్లోరోసిస్ ప్రాంతాలకు ఎన్టీఆర్ సుజలం పేరుతో సురక్షిత నీరు అందిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరే పరిస్థితి లేదు. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కోసమే అనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పశ్చిమలో నీటి కష్టాలు అధికం.. జిల్లాలో 8,60,423 కుటుంబాల పరిధిలో 33,97,448 జనాభా ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలోని దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. వెయ్యి అడుగుల మేర బోరుబావులు తవ్వినా నీరు దొరికే పరిస్థితి లేదు. పైగా ఆ స్థాయిలో భూగర్భ జలం అరకొరగా పైకి వచ్చినా ప్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది. నీటిని తాగితే ప్లోరోసిస్‌తో పాటు కిడ్నీ వ్యాధికి గురికావాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే జిల్లాలో వందలాది మంది మృతి చెందగా వేలాది మంది వ్యాధికి గురై బాధ పడుతున్నారు. పథకం ద్వారా తాగు నీరందుతుందని అందరూ ఎదురు చూశారు. పథకాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని చంద్రబాబు సర్కారు ఆదిలోనే గాలి కొదిలేసింది. దీనిపై విమర్శలు రావడంతో దాతలను వెతికి పథకాన్ని నడిపించాలని ప్రభుత్వం గ్రామీణ తాగునీటి పథకం అధికారులను ఆదేశించింది. ఈ ప్రయత్నం వికటించడంతో పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ప్రతిపక్ష వైఎస్సార్ సీపీతో పాటు అన్ని పక్షాలు విమర్శల దాడి పెంచడంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కానీ ఈ పథకం ఇప్పట్లో అమలుకు నోచుకొనేలా కనిపించడం లేదు. -
‘శుద్ధ’ అబద్ధం
దాతలు ముందుకు రాక నీరు గారిన ఎన్టీఆర్ సుజల పథకం పక్కనే ఉన్న కర్ణాటక పల్లెల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు బి.కొత్తకోట: ఎన్నికల్లో గెలిస్తే స్వచ్ఛమైన నీరందిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రకటించారు. ఇది ప్రభుత్వం అమలు చేసే పథకమనుకుంటే పొరపాటే. స్థానిక పంచాయతీలు నీరు, విద్యుత్, షెడ్డు, పైప్‌లైన్ వేసి సిద్ధం చేస్తే దాతలు యంత్రాలు ఏర్పాటుచేస్తే మినరల్ వాటర్ అందిస్తారు. ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయించదు. 12,619 పల్లెలున్న జిల్లాలో కేవలం 111 పల్లెల్లో దాతల సహకారంతో సుజల స్రవంతి ప్లాంట్లు ఏర్పాటుచేశారు. అయితే పర్యవేక్షణ లేక వాటిలో చాలా నిరుపయోగంగా ఉన్నాయి. దాతలు ముందుకు రాకపోవడంతో శుద్ధ జలం తాగే భాగ్యం జిల్లా ప్రజలకు ఇప్పట్లో లేదని స్పష్టమవుతోంది. అయితే పక్కనే ఉన్న కర్ణాటకకు చెందిన పల్లెల్లో మినరల్ వాటర్ తాగుతుంటే.. ‘మేమేం పాపం చేశాం’ అంటూ సరిహద్దులో ఉన్న జిల్లాకు చెందిన జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో పల్లె పల్లెకూ మినరల్ వాటర్ పొరుగునే ఉన్న కర్ణాటకలోని గ్రామీణులు ఫ్లోరైడ్ నీటినుంచి విముక్తి లభించింది. 2014–15లో తొలుత 107 నియోజకవర్గాల్లోని 1,000 పల్లెల్లో ఆ ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేపట్టి విస్తరించుకుంటూ వెళ్తోంది. ప్లాంట్లను ఏర్పాటుతో వదిలేయక వాటి నిర్వహణ కోసం ప్రణాళికలు అమలు చేస్తోంది. 50 కుటుంబాలున్న పల్లెలోనూ మినరల్ వాటర్ ప్లాంట్ కనిపిస్తోంది. గ్రామంలోని కుటుంబాల సంఖ్యను బట్టి ప్లాంటు స్థాయి పెంచుతోంది. కేవలం రూ.2తో శుద్ధిచేసిన 20లీటర్ల జలం గ్రామీణులకు అందిస్తోంది. నీటి పరీక్షలకు అధికార బృందం కర్ణాటకలోని వాటర్ ప్లాంట్ల నుంచి ప్రజలకు అందిస్తున్న నీటి విషయంలో నిత్యం పరీక్షలు, పరిశీలనల కోసం ప్రభుత్వం అధికారిక కమిటీని ఏర్పాటుచేసింది. జిల్లా పంచాయతీ అధికారి, గ్రామీణ తాగునీరు, శుద్ధనీరు విభాగం, ప్రభుత్వం నియమించిన ఒకరు, ఇంజినీరింగ్ శాఖ నుంచి ఒకరు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఒకరు, వాతావరణ కాలుష్యం, నియంత్రణ మండలికి చెందిన ఒకరు, ల్యాబొరేటరీ కెమిస్ట్, గణాంకశాఖ, భూగర్భగనుల శాఖలకు చెందిన అధికారులు మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ జారీ చేస్తారు. దీనికోసం ప్లాంటు నిర్వహణదారులు ఒక్కో పరీక్షకు రూ.500 చెల్లించాలి. వీటి నిర్వహణను ప్రయివేటు అప్పగించినా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. -
సుజలం విఫలం
అట్టహాసంగా ‘సుజల స్రవంతి’ ప్రారంభం రెండు నెలలైనా రెండోవిడతకు నోచని పథకం మొదటి విడతలోనే పూర్తిస్థాయిలో అందని శుద్ధ జలం అర్బన్‌లో నీరు.. అదే తీరు విశాఖపట్నం సిటీ: విశాఖ అర్బన్‌లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పడకేసింది. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ పథకం సగానికి సగం కేంద్రాల్లో పనిచేయడం లేదు. విశాఖ అర్బన్‌లో ఐదు చోట్లకు గాను నాలుగు చోట్ల మాత్రమే ప్రారంభించారు. హుద్‌హుద్ తుపానుకు నగరంలోని రెండు కేంద్రాలు మూతపడగా, మిగిలిన కేంద్రాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. 37వ వార్డులోని బాపూజీనగర్‌లో ప్రారంభం కాలేదు. ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. 30వ వార్డులోని అల్లిపురం నేరెళ్లకోనేరు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ పథకం నిర్వహణ సక్రమంగా లేదు. కొద్ది రోజులుగా ట్యాంకులో నీటిని శుభ్రం చేయకపోవడం వల్ల పురుగులు పట్టి అధ్వానంగా ఉండటంతో నీటి కోసం ఎవరూ రావడ ం లేదు.రెండో వార్డు పరిధిలోని ఆరిలోవ డిస్పెన్సరీ వద్ద ఏర్పాటు చేసిన సుజల స్రవంతి ద్వారా రోజుకు కేవలం 200 మందికి మాత్రమే నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మురికి వాడలుండండతో ఎక్కువ మంది ప్రజలు ఎగబడుతున్నారు. కాని రోజుకు వెయ్యి లీటర్లలోపే సరఫరా చేస్తున్నారు. 48వ వార్డు పరిధిలోని మల్కాపురం దరి ఇందిరా కాలనీలో తాగు నీటిని ఇతరులకు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి. స్థానికులకు 20 లీటర్ల తాగునీటిని రెండు రూపాయలకే అందించాల్సి ఉండగా మినరల్ వాటర్ అమ్ముకునే వారితో కుమ్మకై వారి ట్యాంకులను చౌకగా నింపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లోనే ఈ దందా జరుగుతున్నట్టు చెబుతున్నారు. 58వ వార్డులోని పెదగంట్యాడ సమీపంలోని ఫకీర్‌తక్యా కాలనీలో ఏర్పాటు చేసిన సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు కొద్ది మందికే నీటిని సరఫరా చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీళ్ల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాళ్లపాలెంలో.. కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో అక్టోబర్ 6న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. తాళ్లపాలెంతో పాటు అమీన్‌సాహెబ్‌పేట, సోమవరం, ఉగ్గినపాలెం, జి.భీమవరం, నరసింగబిల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి టిన్లతో నీటిని తీసుకెళ్తున్నారు. నీళ్ల ట్యాంకు సామర్థ్యం వెయ్యి లీటర్లే అయినందున పూర్తి స్థాయిలో శుద్ధ జలం అందించలేకపోతున్నారు. పథకం నీటి ట్యాంకు సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. తగరపువలస : ప్రజలందరికీ సురక్షిత తాగునీరందించడమే ధ్యేయమని ఎన్టీఆర్ సుజలస్రవంతి పేరుతో ఎన్నికల మేనిఫెస్టోతో ఊదరగొట్టిన టీడీ పీ నేతలు ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాతలు దొరకలేదంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు.గాం ధీ జయంతి రోజున భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావుచే అట్టహాసంగా ప్రారంభించినా, నియోజకవర్గంలో గంభీరం మినహా మిగతాచోట్ల ఈ పథకం ఇంకా పురుడుపోసుకోలేదు. భీమిలి మండలం చిప్పాడ దివీస్ ల్యాబరేటరీ స్పం దించి మండలంలో 11 చోట్ల ఆర్వోప్లాంట్ల నిర్మాణానికి రూ. 1.32 కోట్లు కేటాయించడమే కాకుండా డిసెంబర్ 20 నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది. ఏడాదిపాటు వీటిని నిర్వహించి అనంతరం పంచాయతీలకు అప్పగించాలని దివీస్ యాజమాన్యం భావిస్తోంది. 15 నియోజకవర్గాల్లో 19 ఆర్వో ప్లాంట్స్ విశాఖపట్నం : జిల్లాలో 944 పంచాయతీల పరిధిలో 3,285 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో కేవలం 981 గ్రామాల్లో మాత్రమే పీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. 2,149 గ్రామాల ప్రజలు బోర్వెల్స్పైన, మరో 2,755 గ్రామాల్లో బావులపైన ఆధార పడుతున్నారు. ఎన్టీఆర్ సుజలధారలో తొలుత 232 పంచాయతీలను ఎంపిక చేశా రు. ఈ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు కోసం దాతలుగా 12 పారిశ్రామిక, సేవా సంస్థలను ఎంపిక చేశారు. తొలిదశలో ఐదుకోట్ల 98 లక్షల 83 వేల అంచనాతో 133 ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాని చివరి నిమిషంలో దాతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించక పోవడంతో మండలానికొకటి కా దు కదా కనీసం నియోజకవర్గానికి ఒకటైనా ఏర్పాటు చేసి పరువు నిలబెట్టుకోవాలన్న తలంపుతో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అక్టోబర్2న 19 ఆర్వో ప్లాంట్స్‌ను ప్రారంభించగలిగారు. వీటిలో అత్యధిక ప్లాంట్స్ సామర్థ్యం వెయ్యిలీటర్లే కావడం గమనార్హం. ఇవి కూడా రోజుకు కేవలం 755 కేన్స్(20 లీటర్ల)ను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి. ఆనందపురం, కశింకోట మండలాల్లో ఏర్పాటు చేసిన మూడు ప్లాంట్స్‌ను దాతలు నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లోని ఆర్వో ప్లాంట్స్‌ను ఆయా గ్రామ పంచాయతీలే నిర్వహిస్తున్నాయి.అచ్యుతాపురం, రాంబిల్లి, చోడవరం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్స్ ప్రారంభించిన కొద్దిరోజులకే మూలన చేరాయి. మిగిలిన వాటి నిర్వహణ అధ్వానంగా ఉండడంతో మూడు రోజులు పని చేయడం..నాలుగురోజులు మూలనపడ్డం చందంగా తయారైం ది.దీంతో చివరకు రూ.2లకే 20 లీటర్ల మినరల్‌వాటర్ ఒక మిథ్యగా తయారైంది.