ntt
-
రెట్టింపు ఆదాయంపై ఎన్టీటీ ఇండియా దృష్టి
ముంబై: జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎన్టీటీ గ్రూప్ భారత్లో తమ స్టోరేజీ సామర్థ్యాన్ని, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ఎన్టీటీ డేటా ఇండియా ఎండీ అభిజిత్ దూబే తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో దేశీయంగా 2.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. మరిన్ని డేటా సెంటర్లు, హరిత శక్తి, సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సదుపాయాలు మొదలైన వాటిపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు దూబే తెలిపారు. 2018లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఆయన వివరించారు. జపాన్ వెలుపల తమకు ఇదే అతి పెద్ద మార్కెట్ అని దూబే తెలిపారు. వివిధ దేశాల్లో తమకు మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. భారత్లో ఏకంగా 37,000 మంది పైగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ గ్రూప్ ఆదాయం 20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత విభాగం వాటా 700 మిలియన్ డాలర్లుగా ఉందని దూబే చెప్పారు. రాబోయే రెండేళ్లలో దీన్ని రెట్టింపు చేసుకుని సుమారు 2 బిలియన్ డాలర్లకు పెంచుకోగలమని ఆయన ధీమా వ్య క్తం చేశారు. నెట్మ్యాజిక్ సంస్థ కొనుగోలు ద్వారా ఎన్టీటీ గ్రూప్.. భారత మార్కెట్లో ప్రవేశించింది. -
జాతీయ పన్ను ట్రిబ్యునల్ చట్టం రాజ్యాంగ విరుద్ధం
చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు న్యూఢిల్లీ: పన్నుల వ్యవహారాల కేసులను నిర్ణయించేందుకు జాతీయ పన్ను ట్రిబ్యునల్ (ఎన్టీటీ)ను ఏర్పాటు చేస్తూ 2005లో పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు గురువారం రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ తీర్పుచెప్పింది. ఎన్టీటీ ఏర్పాటు ఉన్నత న్యాయస్థానాల అధికార పరిధిలోకి చొరబడేలా ఉందని చీఫ్ జస్టిస్ ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ ట్రిబ్యునల్ రాజ్యాంగబద్ధతను సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ తీర్పు వెలువరించింది. చట్టానికి సంబంధించి తలెత్తే ప్రశ్నలను కేవలం హైకోర్టులు, సుప్రీంకోర్టే నిర్ణయించగలవని స్పష్టం చేసిన ధర్మాసనం ఆ అధికారాన్ని ట్రిబ్యునల్కు కట్టబెడుతూ పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంది. ఇటువంటి ట్రిబ్యునళ్లు న్యాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ప్రమాదం పొంచి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకవేళ హైకోర్టుల అధికార పరిధిని ఎన్టీటీకి బదిలీచేస్తే ట్రిబ్యునల్ చైర్పర్సన్, సభ్యుల హోదా కూడా హైకోర్టు జడ్జీలను పోలి ఉండాలని పేర్కొంది. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటును సవాల్చేస్తూ మద్రాస్ బార్ అసోసియేషన్ 2006లో తొలిసారి పిటిషన్ దాఖలు చేసింది.