Nuerologist
-
గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్‌తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్‌కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్‌మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్‌కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్‌కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్‌డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్‌జెక్ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్‌మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్‌గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్‌కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్‌గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్‌కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్‌మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్‌లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్‌కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్‌విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్‌కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్‌గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్‌విల్లే గేమ్స్‌ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్‌కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్‌మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్‌తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్‌విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్‌గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్‌తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో న్యూరాలజీ రికార్డు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి దక్కని రికార్డు గుంటూరు జీజీహెచ్‌కు సొంతమైంది. న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు కల్గిన ఏకైక ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందింది. ఈ విభాగంలో ఉన్న సౌకర్యాలు, పేదలకు అందుతున్న వైద్యసేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. డీఎం న్యూరాలజీ పీజీ సీట్లను రెండు నుంచి నాలుగుకు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అరుదైన అవకాశం వరించింది. సాక్షి, గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో న్యూరాలజీ రోగులకు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలను అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగంలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న ఉచిత కార్పొరేట్ వైద్యసేవలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలలో లేని విధంగా డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు రెండు నుంచి నాలుగుకు పెంచుతూ గురువారం ఎంసీఐ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు కల్గిన ఏకైక, మొదటి వైద్య విభాగంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది. 2019 డిసెంబర్ 2న గుంటూరు జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యూరాలజీ రోగి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న ఆ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి (ఫైల్) పేదరోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను అందించేందుకు దాతల సాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని వైద్యసౌకర్యాలను గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఏర్పాటు చేయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల కోసం 20 పడకలతో స్ట్రోక్ యూనిట్‌ను, దాతల సాయంతో కోటి రూపాయలతో 2015 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి అందిస్తున్న వైద్యసేవలకు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్‌కు 2017 జూలైలో జాతీయస్థాయిలో ఇండియన్ స్ట్రోక్ క్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్‌లో చోటు లభించింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 23 ఉండగా అందులో జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగం ఒకటి. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా నాట్కో ట్రస్ట్ సాయంతో 2017 జూలైలో న్యూరాలజీ వైద్య విభాగంలో స్లీప్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగంలో కార్పొరేట్‌కు మించి వైద్యసౌకర్యాలు ఉండటంతోపాటుగా నాణ్యమైన వైద్యసేవలను అందిస్తున్నందుకు 2018 జూన్‌లో ఐఎస్ఓ 9001–2015 గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యసేవలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ గల ఏకైక ప్రభు త్వాస్పత్రిగా న్యూరాలజీ విభాగం గుర్తింపు పొందింది. ఎలాంటి మొండి రోగమై, అరుదైన వ్యాధైనా న్యూరాలజీ వైద్యులు ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేసి నయం చేస్తున్నారనే నమ్మకం రోగుల్లో కలిగించేలా ఇక్కడి వైద్యసేవలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. వైద్యుల అభినందనలు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో పీజీ సీట్లు కల్గిన విభాగంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి గుర్తింపు రావటంతో శుక్రవారం పలువురు వైద్యులు, వైద్యాధికారులు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావుకు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్కర్ బాబాలాల్‌కు, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సుందరాచారికి అభినందలు తెలిపారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో నాలుగు డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు రావటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చొరవ చూపించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గుంటూరు జీజీహెచ్‌లో సమస్యలపై దృష్టిసారించి నివేదిక అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డిని పంపించారు. జవహర్‌రెడ్డికి పీజీ సీట్లు పెంచాలని వినతి పత్రం అందజేశాం. ఆయన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెలరోజుల వ్యవధిలోనే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇవ్వటంతో పీజీ సీట్లు పెంపుకోసం దరఖాస్తు చేశాం. దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే పీజీ సీట్లు పెంచుతూ ఉత్తర్వులు రావటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దీని వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో కోటి రూపాయలకు పైగా ఖరీదుచేసే డీఎం న్యూరాలజీ పీజీ కోర్సులో ఏడాదికి ఇద్దరు ప్రతిభ ఉన్న పేద వైద్యులు ఉచితంగా పీజీ చదివే అవకాశం లభించటంతోపాటుగా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుంది. ప్రస్తుతం న్యూరాలజీ వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో వారంలో మూడు రోజులు న్యూరాలజీ ఓపీ వైద్యసేవలను అందిస్తున్నాం. ప్రభుత్వం పెద్దమనస్సు చేసుకుని ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా మంజూరు చేస్తే న్యూరాలజీ వైద్య విభాగంలో రోజూ వైద్యసేవలను అందించేం అవకాశం కలుగుతుంది. – డాక్టర్ నాగార్జున కొండవెంకటసుందరాచారి, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ -
అంతుచిక్కని వ్యాధిని కనుగొన్నాడు!
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్ ‘క్రిస్టినా వరల్డ్’ను ఆండ్రూవేత్ చిత్రించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో ఉన్న మహిళ మాత్రం అంతుపట్టని వ్యాధితో మరణించింది. ఆ మరణం ఎందుకు సంభవించిందో ఇప్పుడు అమెరికా న్యూరాలజిస్టు కనుగొన్నారు. క్రిస్టినా బతికిన 74 ఏళ్లలో ఎక్కువ శాతం ఆమె కుర్చీలో నుంచి లేవనే లేదు. ఏదో అంతుచిక్కని వ్యాధితో ఆమె బాధపడుతూ ఉండేది. కాలక్రమంలో ఆమెకు కాళ్లు, చేతులు పనిచేయడం మానేశాయి. ఎంతమంది వైద్యులు పరీక్షించినా.. ఆమెకు ఆ వ్యాధి తగ్గలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆమె పుట్టుకతో వచ్చిన చార్కొట్ మారీ టూత్ వ్యాధితో మరణించినట్లు ప్రముఖ న్యూరాలజిస్ట్ మార్క్ పాటర్సన్ తెలిపారు. పాటర్సన్ పరిశోధనల ప్రకారం.. చార్కొట్ వ్యాధి సహజంగా వచ్చిందని ఈ వ్యాధి వచ్చినవారు క్రమంగా శరీర అవయవాల మీద పట్టు కోల్పోతారని ఆయన తెలిపారు. మొదట క్రిస్టిన్ పెయింటింగ్ లను పరిశీలించిన మీదట ఆ వ్యాధిని కనిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం న్యూయార్క్ లోని మోడరన్ ఆర్ట్ మ్యూజియంలో ‘క్రిస్టిన్ వరల్డ్’ పెయింటింగ్ ను ఉంచారు.