అంతుచిక్కని వ్యాధిని కనుగొన్నాడు!
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్ ‘క్రిస్టినా వరల్డ్’ను ఆండ్రూవేత్ చిత్రించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో ఉన్న మహిళ మాత్రం అంతుపట్టని వ్యాధితో మరణించింది. ఆ మరణం ఎందుకు సంభవించిందో ఇప్పుడు అమెరికా న్యూరాలజిస్టు కనుగొన్నారు.
క్రిస్టినా బతికిన 74 ఏళ్లలో ఎక్కువ శాతం ఆమె కుర్చీలో నుంచి లేవనే లేదు. ఏదో అంతుచిక్కని వ్యాధితో ఆమె బాధపడుతూ ఉండేది. కాలక్రమంలో ఆమెకు కాళ్లు, చేతులు పనిచేయడం మానేశాయి. ఎంతమంది వైద్యులు పరీక్షించినా.. ఆమెకు ఆ వ్యాధి తగ్గలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆమె పుట్టుకతో వచ్చిన చార్కొట్ మారీ టూత్ వ్యాధితో మరణించినట్లు ప్రముఖ న్యూరాలజిస్ట్ మార్క్ పాటర్సన్ తెలిపారు.
పాటర్సన్ పరిశోధనల ప్రకారం.. చార్కొట్ వ్యాధి సహజంగా వచ్చిందని ఈ వ్యాధి వచ్చినవారు క్రమంగా శరీర అవయవాల మీద పట్టు కోల్పోతారని ఆయన తెలిపారు. మొదట క్రిస్టిన్ పెయింటింగ్ లను పరిశీలించిన మీదట ఆ వ్యాధిని కనిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం న్యూయార్క్ లోని మోడరన్ ఆర్ట్ మ్యూజియంలో ‘క్రిస్టిన్ వరల్డ్’ పెయింటింగ్ ను ఉంచారు.