Nulipurugula Nivarana
-
బాల్యాన్ని 'నులి'పేస్తోంది..!
ఎందుకీ పరిస్థితి: మహబూబ్‌నగర్: చిన్నారుల అనారోగ్య సమస్యలకు మూల కారణం పేగుల్లో ఏలిక పాములు, నులి, కొంకి పురుగులు సంక్రమించడమేనని వైద్యులు అంచనా వేశారు. పిల్లలు తినే ఆహారాన్ని ఈ నులిపురుగులు పొట్టలోని పేగుల నుంచి తీసుకొని అవి వృద్ధి చెందుతాయి. వీటి మూలంగా పిల్లలకు పౌషకాహార అందకుండా పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందలేకపోతారు. -
20న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
వరంగల్: జిల్లాలో ఈ నెల 20న నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా 1,91,380 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 1–19 ఏళ్లలోపు వారందరికీ వారి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మాత్రలు వేస్తారని తెలిపా రు. 20న తప్పినవారికి 27వ తేదీన వేయనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడానికి ముందుకు రారని, అలాంటి సంస్థలను గుర్తించి వారి యాజమాన్యాలను వైద్యాధికారులు, సిబ్బంది హెచ్చరించాలని సూచించారు. నులిపురుగులతో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని తెలిపారు. రక్తహీనత, చదువుపై శ్రద్ధ తగ్గటం, చిరాకు, మతిమరుపు లక్షణాలు ఉంటాయని తెలిపారు. పిల్లలు భోజనం చేసిన తర్వాత మాత్రలు వేసుకోవాలని, 1–2 సంవత్సరాల బాలబాలికలకు సగం ట్యాబ్లెట్‌ను నీటిలో కలిపి అందించాలన్నారు. ఆ పై వయస్సు ఉన్న వారికి పూర్తి ట్యాబ్లెట్ వేయాలని చెప్పారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని, ఒక వేళ వస్తే తమ సిబ్బంది వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్ఈఓ విద్యాసాగర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. -
నట్టల నివారణ మందుల పంపిణీ
ఆత్మకూర్ : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద చేపట్టారు. క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, హెల్త్ ఎడుకేటర్ శ్రీరామ్‌సుధాకర్ మాటాడుతూ క్లస్టర్ పరిధిలో 72వేలమంది విద్యార్థులకు, ఆత్మకూర్ మండలంలో 32వేలమంది విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలు 1నుంచి 19సంవత్సరాల వయస్సు ఉన్నవారికి పంపిణీ చేశామని అన్నారు. రక్తహీనత, పోషకాహార లోపం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం వ్యాధి లక్షణాలుగా తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంఓ హన్మంత్‌రావు, వైద్య సిబ్బంది రామునాయక్, సామ్రాజ్యలక్ష్మి, శైలజదేవి, సురేందర్‌గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– వాసునగర్ ఘాట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే చిట్టెం మాగనూర్ (గుడెబల్లూర్) : కృష్ణా పుష్కరాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పుష్కరాల్లో భాగంగా శుక్రవారం వాసునగర్ ఘాట్‌ను ఆయన సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతిని పరిశీలించారు. వికలాంగులు, చిన్నపిల్లలకు, వృద్ధులకు నది ఒడ్డున ప్రత్యేకంగా స్నానాల కోసం నీటివసతిని ఏర్పాటు చేయాలని ప్రత్యేక అధికారి వెంకటయ్యగౌడ్‌ను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉందని, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్నానాల ఘట్లో ఏర్పాటు చేసిన ఇనుపజాలిపై కర్రలతో కట్టాలని, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాగనూర్ జెడ్పీటీసీ సరితా మధుసూదన్‌రెడ్డి, ఊట్కూర్ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ గోవిందప్ప, విజయ్‌గౌడ్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ నాయకులు పాల్గొన్నారు.