numbness
-
Health Tips: అరచేయి, మణికట్టులో, వేళ్లలో నొప్పి ఉందా.. అయితే!
కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే రుగ్మతతో బాధపడేవారిలో అరచేతి నొప్పి, మణికట్టులో, వేళ్లలో చాలా నొప్పిగా ఉంటుంది. చేయి తిమ్మిర్లుగా కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో చేత్తో ఏదీ ఎత్తలేకపోవచ్చు. మణికట్టుపై ఒత్తిడి పడే వృత్తుల్లో ఈ సమస్య ఎక్కువ. అలాగే ఆటగాళ్లు, కంప్యూటర్‌పై పనిచేసే వారిలోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువే. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఈ నొప్పి ఎందుకు వస్తుంది, దాని నుంచి ఉపశమనం కోసం మార్గాలేమిటో చూద్దాం. మణికట్టులో ఎముకల అమరిక విలక్షణంగా ఉంటుంది. మణికట్టు లోంచి అరచేతిలో ఒక సన్నటి ద్వారం (టన్నెల్)ను ఏర్పరిచేలా అక్కడ ఎముకలు అమరుతాయి. దాంట్లో నుంచి మీడియన్ నర్వ్ అరచేతిలోకి వేళ్లలోకి ప్రవేశిస్తుంది. వేళ్లను వంచడానికి ఉపయోగపడే టెండన్స్కు కూడా ఇదే ద్వారం నుంచి వెళ్తాయి. ఈ టన్నెల్ మన బొటనవేలి అంత విశాలంగా ఉంటుంది. దీని చుట్టూ కార్పల్ అనే ఎముకలూ, ఫెక్సార్ రెటినాకులమ్ అనే లిగమెంట్లు ఉంటాయి. మణికట్టులోని ఈ మీడియన్ నర్వ్ మీద ఏదైనా ఒత్తిడి పడినప్పుడు... చెయ్యి బలహీనంగా అనిపించవచ్చు. ఇదే నరం నొక్కుకుపోవడం వల్ల తిమ్మిరిగా కూడా అనిపిస్తుంది. మీడియన్ నర్వ్ స్పర్శజ్ఞానంతో పాటు కదలిలకూ ఉపయోగపడుతుంది. అది బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలితోపాటు కొంతవరకు ఉంగరపు వేలికీ వెళ్తుంది. దీని తోడ్పాటు వల్లనే ఆయా వేళ్లలో కదలికలు జరుగుతుంటాయి. అందుకే మణికట్టు భాగంలోని దీని మీద ఒత్తిడి పడితే... ఆ ప్రభావం వేళ్ల కదలికల మీదా పడుతుంది. ఈ టన్నెల్లాంటి ద్వారంలోని మణికట్టు ఎముకల పైపొరతో పాటు... ఇందులోని సైనోవియమ్ పొరల్లోనూ వాపు రావచ్చు. ఈ వాపు కారణంగా... అక్కడి స్థలం సరిపోక అది మీడియన్ నరంపై ఒత్తిడి పడేలా చేయవచ్చు. ఎలక్ట్రోఫిజియాలజీ పరీక్షల ద్వారా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. సమస్య ఒకింత తక్కువే ఉంటే... చేస్తున్న పని మధ్యన అప్పుడప్పుడూ మణికట్టుకు విశ్రాంతి కల్పిస్తుండటం ద్వారా ఈ సమస్యకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చు. నొప్పి వస్తున్నప్పుడు మణికట్టు ఎముకల్లో కదలికలు ఏర్పడకుండా పట్టీలు వేయడం ద్వారా కూడా కొంతవరకు ఉపశమనం ఉంటుంది. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ల నిర్ణయం మేరకు కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా? -
Numbness and Tingling: కాళ్లు, పాదాలు తరచూ మొద్దుబారుతున్నాయా? ఇలా చేయండి..
కాళ్లు, పాదాలు మొద్దుబారడం అనేది ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఇది చాలా వరకు తాత్కాలిక నంబ్నెస్ అయి ఉంటుంది. చిన్నపాటి చికిత్సలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. తాత్కాలిక తిమ్మిర్లు... కూర్చున్న భంగిమ ప్రధాన కారణమై ఉంటుంది. కాళ్లు మడత పెట్టి ఎక్కువ సేపు అదే భంగిమలో కూర్చున్నప్పుడు నరాలు, రక్తనాళాల మీద ఒత్తిడి కలిగి రక్తప్రసరణ వేగం మందగిస్తుంది. ఒత్తిడికి లోనైన ప్రదేశం నుంచి కింద భాగం తిమ్మిరి పట్టేస్తుంది. ఎక్కువ సేపు మోకాళ్ల మీద కూర్చోవడం, పాదాల మీద కూర్చోవడం వల్ల కూడా తాత్కాలిక తిమ్మిరి వస్తుంది. అలాగే సాక్స్, షూస్ మరీ బిగుతుగా ఉన్నప్పుడు కాళ్లు, పాదాలు తిమ్మిర్లకు లోనవుతాయి. కొన్నిసార్లు డ్రస్ కూడా కారణం కావచ్చు. స్కిన్‌టైట్ డ్రస్ వేసుకున్నప్పుడు తిమ్మిరి వస్తుంటే ఆ దుస్తులను మానేయడమే అసలైన ఔషధం. చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే.. ఇంట్లోనే సాంత్వన... ►కాళ్లను చాచి విశ్రాంతి తీసుకుంటే రక్తప్రసరణ క్రమబద్ధమై కొద్ది నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది. ►మొద్దుబారిన చోట చల్లటి నీటిని ధారగా పోయడం వల్ల ఫలితం ఉంటుంది. తిమ్మిరితోపాటు కండరాలు పట్టేసినట్లనిపిస్తే గోరువెచ్చటి నీటిని ధారగా పోయాలి లేదా వేడి నీటిలో ముంచిన టవల్‌తో కాపడం పెట్టాలి. ►బయట ఉన్నప్పుడు పైవేవీ సాధ్యం కాదు. కాబట్టి కాలికి, పాదానికి మృదువుగా వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ ఐదు నిమిషాల సేపు మసాజ్ చేయాలి. ►ఓ గ్లాసు నీళ్లు తాగి పది నిమిషాల సేపు నడవాలి. అలాగే కుర్చీలో కూర్చుని కాళ్లను సౌకర్యవంతంగా జారవేసి మడమ దగ్గర కీలు కదిలేటట్లు పాదాన్ని క్లాక్‌వైజ్‌గా పదిసార్లు, యాంటీ క్లాక్‌వైజ్‌గా పదిసార్లు తిప్పాలి. ఇలాగైతే... డాక్టర్‌ను కలవాల్సిందే! ►వెన్ను, హిప్, కాళ్లు, మడమలకు గాయాలైనప్పుడు, డయాబెటిక్ న్యూరోపతి కండిషన్లో కాళ్లు మొద్దుబారడం, తిమ్మిర్లు పట్టడం జరుగుతుంటుంది ►సయాటిక్ నర్వ్ ఇరిటేషన్‌కు లోనయితే నడుము కింది నుంచి పాదం వరకు తిమ్మిరి, మొద్దుబారుతుంటుంది ►పీరియడ్స్ నిడివి పెరిగి రక్తహీనతకు లోనయినప్పుడు తరచు తిమ్మిర్లు రావచ్చు ►యాంటీడిప్రెసెంట్స్, కార్టికోస్టిరాయిడ్స్ వంటి మందులు రక్తప్రసరణ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆ మందుల వాడకం తర్వాత తిమ్మిర్లకు లోనవుతుంటే మందుల మార్పు కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
అప్పుడే నూరేళ్లు నిండాయా కన్నా
కోల్‌సిటీ : తమ కుటుంబంలో లేక లేక కలిగిన చిన్నారికి అప్పుడు నూరేళ్లు నిండుతాయని వారు అనుకోలేదు. కానీ జరగరాని ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములుండగా.. ఇద్దరికి ఆడపిల్లలు క లిగారు. కానీ చిన్న కుమారుడికి కొడుకు పుట్టడంతో వారంతా ఆ పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. సోమవారం ఆ చిన్నారి నీటితొట్టిలో పడగా మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధించారు. ఈ సంఘటన గోదావరిఖనిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖనిలోని గాంధీనగర్‌కు చెందిన మూడెత్తుల సంపత్, మల్లేశ్వరి దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. సంపత్ కరీంనగర్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు తొమ్మిది నెలల రిత్విక్ ఉన్నాడు. మల్లేశ్వరి తన కుమారుడితో పరశురాంనగర్లోని పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఆమె ఇంట్లో నిద్రపోతుండగా, రిత్విక్ అంబాడుతూ వెళ్లి ఇంటి ఆవరణలోని నీటితొట్టిలో పడిపోయాడు. బాలుడు ఎక్కడా కనిపించడం లేదని కుటుంబసభ్యులు వెతకగా నీటితొట్టిలో తేలుతూ కనిపించాడు. వెంటనే కరీంనగర్‌కు తరలిస్తుండగా పెద్దపెల్లి సమీపంలోకి రాగానే మృతి చెందాడు. గంట ముందే.. రిత్విక్ చనిపోవడానికి గంట ముందే సంపత్ భార్యతో ఫోన్లో మాట్లాడాడు. హైదరాబాద్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిందని.. రిత్విక్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా గమనించాలని సూచించాడు. కానీ అంతలోనే ఆయనకు రిత్విక్ మరణవార్త తెలియడంతో షాక్‌కు గురయ్యాడు. సంపత్‌కు ఇద్దరు సోదరులుండగా.. వారికి ఆడపిల్లలు కలిగారు. రిత్విక్ పుట్టినప్పటి నుంచి ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగి ఉంది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో ప్రస్తుతం శోకసంద్రంలో ముగినిపోయారు.