nurse died
-
Tamil Nadu: కరోనాతో నర్సు మృతి
వేలూరు: గుడియాత్తంప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో పనిచేస్తున్ననర్సు కరోనాతో మృతిచెందారు. వివరాలు.. వేలూరు జిల్లా పేర్నంబట్టు అంబేడ్కర్ నగర్‌కు చెందిన గోపాలక్రిష్ణన్ భార్య ఎయుళరసి (40) ప్రభుత్వ నర్సుగా పనిచేస్తున్నారు. గోపాలక్రిష్ణన్ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఇదిలా ఉండగా ఎయుళరసికి ఈనెల 15న పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె అదే వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఈ నెల 21న వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. కరోనా వార్డులో ఎంతో మంది రోగులకు చికిత్స అందజేసిన నర్సు అదే వ్యాధితో మృతి చెందడం పలువురిని కలచివేసింది. కాగా గుడియాత్తం ప్రభుత్వాస్పత్రిలోని కరోనా వార్డులో చికిత్స అందజేస్తున్న ఐదుగురు డాక్టర్లు, నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం గమనార్హం. చదవండి: డిసెంబర్‌కల్లా 216 కోట్ల టీకా డోసులు -
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి
లిస్బన్/పోర్టో/పోర్చుగీసు : సాధారణంగా 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే రెండుమూడేళ్ల సమయం పడుతుంది. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను పక్కకు పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. మన దేశంలో డీసీజీఐ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటి సామార్థ్యం పట్ల ఇప్పటికే జనాల్లో పలు అనుమానాలు తలెత్తుతుండగా.. వీటిని మరింత పెంచే సంఘటన ఒకటి పోర్చుగల్‌లో చోటు చేసుకుంది. ఓ నర్స్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత చనిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాక వ్యాక్సిన్ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతుంది. వివరాలు.. సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్ నర్స్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు. (చదవండి: వివాదంలో ‘అనుమతులు’) ఈ సందర్భంగా సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక సోనియాకు మద్యం అలవాటు లేదని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,27,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,118 మంది మరణించారు. -
ఎంఎంటీఎస్ రైలు ఢీకొని నర్సు మృతి
ఖైరతాబాద్: ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని ఓ నర్సు మృతిచెందింది. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో జరిగింది. నాంపల్లి జిఆర్పిఎఫ్ ఇన్వెస్టిగేషన ఆఫీసర్ మహ్మద్ బషీరుద్దీన్ తెలిపిన మేరకు.. ఢిల్లీకి చెందిన రేఖా మహల్(25) లక్డీకాపూల్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో పనిచేస్తూ టెలిఫోన్ భవన్ ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంటుంది. గురువారం ఉదయం జిమ్ చేసి తిరిగి ఉదయం 8.08 గంటలకు ఖైరతాబాద్ రైల్వేగేట్ వద్ద గేటు వేసి ఉన్న సమయంలో చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పట్టాలు దాటేందుకు ప్రయత్నించడంతో నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలును రైలు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఆమె తలకు తీవ్రగాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. -
'ముద్దు'ల నర్స్ ఇకలేరు!
రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో జపాన్ సేనలు అమెరికాకు లొంగిపోయాయన్న వార్తతో యుద్ధం ముగిసి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ శుభవార్తను అందరితో పంచుకునేందుకు చాలా మంది చిన్నాపెద్దా, ఆడా మగా అనే వ్యత్యాసం లేకుండా నగర వీదులలోకి వచ్చారు. సరిగ్గా ఆ సమయంలో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ దృశ్యం చోటుచేసుకుంది. 1945, ఆగస్టు 14న ఓ జంట (నర్స్ గ్రెటా ఫ్రైడ్మన్-నావికుడు జార్జ్ మెండాన్సా)అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకుంది. అప్పట్లో ఈ ఫొటో అప్పట్లో సంచలనమని చెప్పవచ్చు. ఆ ఫొటోలో కనిపిస్తున్న నర్స్ గ్రెటా జిమ్మర్ ఫ్రైడ్మన్(92) ఇటీవల మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె కుమారుడు జోషువా ఫ్రైడ్మన్ అధికారికంగా వెల్లడించారు. ఇంతకీ విషమం ఏంటంటే.. ఆ ఫొటోలు ముద్దుపెట్టుకున్నవాళ్లు ప్రేమికులు కాదు. కనీసం ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు కూడా. నావికుడు మెండాన్సా నిజానికి అక్కడే పనిచేసే నర్స్ రిటా పెట్రీని లవ్ చేసి.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలో రిటా కూడా ఉంది. యుద్ధం ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఫొటో అప్పటి మ్యాగజైన్లో ఫుల్పేజీలో ప్రచురించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత 1980లో ఈ ఫొటోలో ఉన్నది గ్రెటా ఫ్రైడ్మన్, జార్జ్ మెండాన్సాగా గుర్తించారు. గత గురువారం వర్జీనియా, రిచ్ మండ్ లోని ఆస్పత్రిలో ఫ్రైడ్మన్ కన్నుమూసిన సందర్భంగా మరోసారి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక మీడియాలో మరోసారి నర్స్ గ్రెటా ఫ్రైడ్మన్-నావికుడు జార్జ్ మెండాన్సా పేర్లు మార్మోగిపోయాయి.