NWDA Meeting
-
పోలవరం నుంచి కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరి నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షిస్తూ పోలవరం నుంచి గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం నుంచి గోదావరి జలాలను బొల్లాపల్లి వద్ద 300 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి కావేరికి తరలించాలని సూచించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని, దీని ద్వారా తరలించే నీటిలో 50 శాతం తమకు కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించింది. తెలంగాణ ప్రతిపాదనను ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకించింది. సమ్మక్క, ఇచ్చంపల్లి బ్యారేజ్‌ల వల్ల తమ రాష్ట్రాంలో ముంపు ఉత్పన్నమవుతుందని, దీనికి తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని, ఇందుకు త్వరలోనే ఆ రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు. వాడీవేడిగా ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశందేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి 73వ సమావేశం సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, ఏపీ ప్రభుత్వం తరఫున హైడ్రాలజీ విభాగం సీఈ కుమార్, తెలంగాణ తరఫున ఈఎన్సీ అనిల్‌కుమార్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి, అక్కడి నుంచి జలాలను కావేరికి తరలించాలన్న ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్సీ అనిల్ వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రానికి 158 టీఎంసీల (దేవాదులకు 38, సీతారామకు 70, తుపాకులగూడెంకు 50 టీఎంసీ) నీటి అవసరాలున్నాయని, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే తెలంగాణ, ఏపీ అవసరాలతోపాటు గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టు అవసరాలను ఏకకాలంలో ఎలా తీరుస్తారని ప్రశి్నంచారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి అనుసంధానం చేపట్టాలని కోరారు.దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్‌ల వల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందని, అందువల్ల ఆ బ్యారేజ్‌ల నిర్మాణానికి అంగీకరించబోమని తేలి్చచెప్పింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్‌లను ఎగువ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ సీఈ కుమార్ ప్రతిపాదించారు. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలలోకి, అక్కడి నుంచి కావేరికి తరలించాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని తేలి్చచెప్పారు.గోదావరికి జూలై ఆఖరు నుంచి ఆగస్టు వరకు భారీ వరద ఉంటుందని, ఆగస్టులో కృష్ణాకు కూడా వరద వచ్చి నాగార్జునసాగర్ కూడా నిండుగా ఉంటుందని వివరించారు. గోదావరి–కావేరి అనుసంధానంలో నాగార్జున సాగర్‌ను భాగం చేస్తే దాని ఆయకట్టుకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి గోదావరి జలాలను కొత్తగా బొల్లాపల్లి వద్ద నిరి్మంచే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి సోమశిల.. అటు నుంచి కావేరికి తరలించాలని సూచించారు.ఇదే ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు గతంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడు అందజేశామని, దాన్ని పరిశీలించాలని కోరారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న 80 టీఎంసీలకుగానూ.. ఆ మేరకు సాగర్ ఎగువన కృష్ణా బేసిన్లో వాడుకునేలా రాష్ట్రాలకు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని ఏపీ, తెలంగాణ అధికారులు గుర్తు చేశారు.మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలు అదనంగా వాడుకుని, గోదావరి–కావేరి అనుసంధానం వల్ల కృష్ణా జలాలను ఆ రాష్ట్రాలకు అదనంగా వాడుకోవడానికి అవకాశం కలి్పస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడ్డాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ స్పష్టం చేశారు. -
సమ్మక్క నుంచే అనుసంధానం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలకు బదులుగా ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే నీళ్లను తరలించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై సోమవారం జరగనున్న నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని సైతం చేర్చినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ రాష్ట్రానికి సమాచారం ఇచి్చంది. అలాగైతే అన్నీ సమస్యలే: తెలంగాణ ఆరు నెలల కిందట గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణకు అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ దానిపై అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బరాజ్ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తమ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదంటూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సమ్మక్క సాగర్ బరాజ్‌కి బ్యాక్‌వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు సైతం నష్టం కలుగుతుందని పేర్కొంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ పేర్కొంటుండగా, ఈ నీటి వినియోగం లెక్కలను సమరి్పంచాలని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ కోరింది.దీంతో సమ్మక్కసాగర్ బరాజ్‌కి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బరాజ్ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలను తెలంగాణ అందించింది.ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ తెలియజేసింది. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి తెలంగాణ అంగీకారం లభించే పరిస్థితి లేకపోవడంతో సమక్కసాగర్ నుంచే నీటిని తరలించే అంశాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ సోమవారం నిర్వహించే సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది. సిమ్యులేషన్ స్టడీకి కేంద్రం ఓకే గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచి్చంది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు.అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బరాజ్ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బరాజ్ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించడంతో సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగయ్యాయి. -
లెక్క తేలాకే కావేరికి గోదారి
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చకుండా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టడంలో అర్థం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. మొదట నీటి లభ్యతను తేల్చాలని, ఆ తర్వాతే కావేరికి గోదావరి జలాలను ఎలా తరలించాలో చర్చించాలని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 69వ సమావేశం బుధవారం వర్చువల్‌గా జరిగింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా కావేరికి తరలించడం ద్వారా నదులను అనుసంధానం చేయడానికి సంబంధించిన డీపీఆర్‌ను నదీ పరివాహక ప్రాంతాల్లోని 4 రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. ఆ డీపీఆర్‌లో హైడ్రాలజీ అంశంపై తమకు అభ్యంతరాలున్నాయని మురళీధర్ తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 247 టీఎంసీల నీటిని నదుల అనుసంధానంలో భాగంగా వినియోగించాలని ప్రతిపాదించారని, ఇక్కడ నదిలో 324 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు పేర్కొన్నారని, దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 247 టీఎంసీల్లో 70 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్ వాటా ఉందని గుర్తు చేశారు. ఇంద్రావతిపై తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు మిగులు జలాలే ఉండవని గత సమావేశంలో ఆ రాష్ట్రం తేల్చిచెప్పిందన్నారు. కాబట్టి ముందు గోదావరిలో నీటి లభ్యత తేల్చాలని కోరారు. ఏపీ అవసరాలు తీరాకే తరలింపు: ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా ముందు గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని కోరింది. రాష్ట్రంలో కడుతున్న, భవిష్యత్‌లో నిర్మించనున్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోకుండాడీపీఆర్ రూపొందించారని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఆక్షేపించారు. గోదావరి జలాలు ఆ ప్రాజెక్టులకే సరిపోతాయని.. నీటి లభ్యత ఎక్కడుందని ప్రశ్నించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఏపీకే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే వరద జలాల్లో మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించాలన్నారు. దీనిపై సానుకూలం గా స్పందించిన పంకజ్‌కుమార్.. గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. మా రాష్ట్రంలో కరువు ప్రాంతాలెక్కువ: కర్ణాటక తమిళనాడుతో పోల్చితే కావేరి బేసిన్లో తమ రాష్ట్రంలోనే కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువని కర్ణాటక చెప్పింది. దుర్భిక్షాన్ని నివారించడానికి గోదావరి జలాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీతో పోల్చితే తమ రాష్ట్రంలోనే కృష్ణా బేసిన్లో కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువంది. ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు గానూ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కోరింది. మిగతా రాష్ట్రాలేమన్నాయంటే..? కావేరి–గోదావరి అనుసంధానంలో కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర కోరింది. గోదావరి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని, తమ నీళ్లు తామే వాడుకుంటామని ఛత్తీస్‌గఢ్ స్పష్టం చేసింది. ఒడిశా మాత్రం అనుసంధానంపై తమకు అభ్యంతరం లేదంది. కావేరి జలాల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని, తాజా అనుసంధానం నేపథ్యంలోనైనా కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. వర్చువల్‌గా కాకుండా భౌతికంగా సమావేశాలు నిర్వహిస్తేనే రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి అవకాశం ఉంటుందని తమిళనాడు చెప్పింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని కోరింది. -
నదుల అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్‌డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగ–పింజాల్, పార్–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ (కేబీఎల్‌పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్‌డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది. ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి గో‘దారి’!
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానానికి మొదట చేసిన ప్రతిపాదనకే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) మొగ్గు చూపింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా)కు, అక్కడి నుంచి సోమశిల (పెన్నా), అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట (కావేరీ)కు తరలించడం ద్వారా నాలుగు నదులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఇచ్చంపల్లి వద్ద మిగులుగా 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు.. వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. మహానది–గోదావరిని అనుసంధానం చేశాక.. మహానది నుంచి గోదావరికి తరలించిన జలాలను రెండో దశలో కావేరికి తీసుకెళ్లాలని పేర్కొంది. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ నెల 25న ఢిల్లీలో భేటీ కానుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు ఎస్కే హల్దార్, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్, ఎనిమిది మంది సభ్యులు, పది మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు. ఇతర నదుల అనుసంధానంతో పాటు ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ భేటీలో వెల్లడైన అంశాల ఆధారంగా మార్చి 4న తిరుపతిలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సులో గోదావరి–కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, కె.పళనిస్వామి, యడియూరప్ప, పి.విజయన్‌లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంప్రదింపులు జరపనున్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే, ఆ రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోందని సీడబ్ల్యూసీ అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్లే గోదావరి నికర జలాల్లో మిగులు జలాలు కన్పిస్తున్నాయని, ఆ రాష్ట్రాలు వాటా జలాలను ఉపయోగించుకుంటే మిగులు జలాలు ఉండే అవకాశం లేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ సంపూర్ణ హక్కు కల్పించిన నేపథ్యంలో.. గోదావరి నుంచి మళ్లించే నీటిలో సింహభాగం ఏపీకే కేటాయించాలని సూచిస్తున్నారు. ఆ మూడు ప్రతిపాదనలు వెనక్కి గోదావరి–కావేరి నదుల అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ 2019లో మూడు ప్రతిపాదనలు చేసింది. జానంపల్లి, దమ్ముగూడెం, అకినేపల్లిల నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించడం ద్వారా అనుసంధానం చేయాలని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలపై భాగస్వామ్య రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాక ఈ అనుసంధానంపై చర్చించాలని సూచించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చేసిన మూడు ప్రతిపాదనలను ఎన్‌డబ్ల్యూడీఏ పక్కన పెట్టింది. 2002లో మొదట చేసిన ప్రతిపాదననే మళ్లీ తెరపైకి తెచ్చింది. అయితే గోదావరి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే.. కృష్ణా, కావేరి జలాల్లో అదనపు వాటా కేటాయించాలని కర్ణాటక, కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ ప్రభుత్వాలు కోరుతున్నాయి. వీటిపై ఈనెల 25న టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిక ఇవ్వనుంది. మార్చి 4న తిరుపతిలో జరగనున్న సదస్సులో ఆయా రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీసుకోనున్నారు. నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాకే మిగులు జలాలను మళ్లించాలని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలు స్పష్టం చేసిన నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాలను కేంద్రం ఎలా ఒప్పిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. చదవండి: ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం -
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ తాగు, సాగు అవసరాల కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనితీరు భేష్ అని కితాబిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు, వేగవంతంగా పనులు కొనసాగించడం తదితరాలను ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో 14వ అంతర్రాష్ట్రీయ నదుల అనుసంధానంపై గడ్కరీ అధ్యక్షతన భేటీ జరిగింది. మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషీ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు, పనుల పురోగతిని గడ్కరీ ప్రశంసించారు. భేటీలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన నదుల అనుసంధానంపై చర్చించారు. గోదావరే శరణ్యం: హరీశ్ గోదావరి–కావేరి నదులను తొలి దశలో, మహానది–గోదావరిలను రెండో దశలో అనుసంధానిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రధానాంశాలను లేవనెత్తింది. నీటి లభ్యత, నీటి వనరులు–నీటి తరలింపు, ప్రత్యామ్నాయ మార్గాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటి ఉపయోగం–పర్యావరణ అనుకూలత తదితరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మహానది–గోదావరి అనుసంధానాన్నే తొలి దశలో చేపట్టి, ఆ తర్వాతే గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించాలని హరీశ్ సూచించారు. కేంద్రం చెబుతున్నట్టుగా ఏటా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నట్టయితే అనుసంధానానికి తెలంగాణ పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ‘‘రెండు నదుల మధ్య ఉన్న తెలంగాణను ప్రధానంగా నీటి కోసమే సాధించుకున్నాం. కాబట్టి మాకిది చాలా ప్రాధాన్యాంశం. కృష్ణాలో నీటి లభ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. అందులో 300 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీ మిగులు జలాలు తెలంగాణ హక్కు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు జరపాల్సి ఉంది. కానీ కృష్ణాలో అంత నీరు తెలంగాణకు దక్కడం లేదు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు ట్రిబ్యునల్ అనుమతించింది. దాంతో కృష్ణాలో నీటి లభ్యత ఇంకా తగ్గుతుంది. కాబట్టి తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతం కూడా గోదావరి నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో 954 టీఎంసీలు తెలంగాణ హక్కు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసి ఈ హక్కును పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలని మా ప్రభుత్వం కృషి చేస్తోంది. కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ తదితరాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తోంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం సస్యశ్యామలమవుతుంది. దీనితో రాష్ట్ర పరి«ధిలోనే నదుల అనుసంధానం చేపడుతున్నాం. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు కూడా సీతారామ ద్వారా నీరిస్తున్నాం. మొత్తంగా కృష్ణా, గోదావరుల నుంచి తెలంగాణకు 1,700 టీఎంసీలు కావాలి. ఇది పోను ఇంకా మిగులు జలాలుంటే ఇవ్వడానికి మేం సిద్ధం’’అని వివరించారు. అక్కనపల్లికి ఒప్పుకోం! అక్కనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలన్న కేంద్రం యోచనపై హరీశ్ అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అది సీతారామపై ప్రభా వం చూపుతుంది. పైగా అక్కనపల్లి వద్ద నీటి లభ్యత లేదని మా అధ్యయనంలో తేలింది. ‘అక్కనపల్లి వల్ల తెలంగాణలో 42 వేల ఎకరాలు, 45 గ్రామాలు ముంపు నకు గురవుతాయి. ఇందుకు మేం సిద్ధం గా లేం. మొదట మహానది–గోదావరిని కలిపి గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి కావేరికీ కలిపి నీరు తీసుకెళ్తే అభ్యంతరం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టు ఏటా 3,000 టీఎంసీలు సము ద్రంలో కలుస్తున్నాయా అన్నదానిపై లెక్కతేల్చాలి. తెలంగాణకు కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ముందు 40 ఏళ్ల సిరిస్ ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టిన కేంద్రం, అక్కనపల్లి విషయంలో మాత్రం 110 ఏళ్ల సిరిస్ ఆధారంగా లెక్కించి 170 టీఎంసీల లభ్యత ఉందనడం సరికాదు. గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణ నీటి అవసరాలను పక్కన పెట్టిన అనంతరం మిగులు జలాలను ఇవ్వడంలో అభ్యంతరం లేదు. నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, రాష్ట్ర అధికారుల అధ్వర్యంలో కమిటీ వేసి అధ్యయనం చేయించాలి’’అని భేటీలో కోరినట్టు హరీశ్ మీడియాకు తెలిపారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు రావాల్సిందిగా కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. -
NWDA సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు