october 3rd
-
తెలంగాణలో భారీగా చేపల పెంపకం: కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రూ.48 కోట్లతో 4,533 చెరువుల్లో చేపలు పెంచనున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి చేపల పెంపకం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆయన సూచించారు. కాగా మత్స్యసందప పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రస్తుతం 781.30 హెక్టార్లలోనే చేపల పెంపకం జరుగుతున్నది. -
3న కలెక్టరేట్ ఎదుట సామూహిక దీక్షలు
– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు హిందూపురం టౌన్ : వెనుకబడిన ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయంపై అక్టోబర్ 3న అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపడుతున్నట్టు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కాకికి అన్నం మెతుకులు పడేసినట్టు రాష్ట్రానికి ప్యాకేజీ ఇస్తే ఊరుకునేది లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తర కోస్తాలోని 3 జిల్లాలకు ఏడాదికి కేటాయించిన రూ.50 కోట్ల విద్యుత్ బిల్లులకు కూడా సరిపోదని విమర్శించారు. అనంతపురంలో పరిశ్రమలు, సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు దాని ఊసే లేదన్నారు. హంద్రీనీవాను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జెడ్పీ శ్రీనివాసులు, సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్, నారాయణస్వామి, రాము, లక్ష్మీనారాయణ, నరసింహులు పాల్గొన్నారు. -
3న కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ మహాధర్నా
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో వేరుశనగ, ఇతర పంటలను కాపాడడంలోనూ, కరువు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబరు 3న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ధర్నాకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27న ధర్నా నిర్వహించాలని తొలుత భావించామని, అయితే.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరదలు సంభవించిన నేపథ్యంలో జగన్ అక్కడ పర్యటించబోతున్నారని తెలిపారు. దీంతో ధర్నాను వాయిదా వేశామని పేర్కొన్నారు. ప్రభుత్వతీరుతో మోసపోయిన రైతులు మహాధర్నాకు భారీఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.