– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు
హిందూపురం టౌన్ : వెనుకబడిన ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయంపై అక్టోబర్ 3న అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపడుతున్నట్టు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కాకికి అన్నం మెతుకులు పడేసినట్టు రాష్ట్రానికి ప్యాకేజీ ఇస్తే ఊరుకునేది లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తర కోస్తాలోని 3 జిల్లాలకు ఏడాదికి కేటాయించిన రూ.50 కోట్ల విద్యుత్ బిల్లులకు కూడా సరిపోదని విమర్శించారు.
అనంతపురంలో పరిశ్రమలు, సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు దాని ఊసే లేదన్నారు. హంద్రీనీవాను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జెడ్పీ శ్రీనివాసులు, సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్, నారాయణస్వామి, రాము, లక్ష్మీనారాయణ, నరసింహులు పాల్గొన్నారు.
3న కలెక్టరేట్ ఎదుట సామూహిక దీక్షలు
Published Sun, Sep 25 2016 10:39 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement
Advertisement