హైదరాబాద్ : తెలంగాణలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రూ.48 కోట్లతో 4,533 చెరువుల్లో చేపలు పెంచనున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి చేపల పెంపకం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆయన సూచించారు. కాగా మత్స్యసందప పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రస్తుతం 781.30 హెక్టార్లలోనే చేపల పెంపకం జరుగుతున్నది.
తెలంగాణలో భారీగా చేపల పెంపకం: కేసీఆర్
Published Fri, Sep 30 2016 7:55 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement
Advertisement