జిల్లాలో వేరుశనగ, ఇతర పంటలను కాపాడడంలోనూ, కరువు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబరు 3న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో వేరుశనగ, ఇతర పంటలను కాపాడడంలోనూ, కరువు సహాయక చర్యల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబరు 3న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ధర్నాకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 27న ధర్నా నిర్వహించాలని తొలుత భావించామని, అయితే.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరదలు సంభవించిన నేపథ్యంలో జగన్ అక్కడ పర్యటించబోతున్నారని తెలిపారు. దీంతో ధర్నాను వాయిదా వేశామని పేర్కొన్నారు. ప్రభుత్వతీరుతో మోసపోయిన రైతులు మహాధర్నాకు భారీఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.