Odisha man
-
వినూత్న వేషం.. 150 కిమీ నడక
భువనేశ్వర్ : ప్రపంచాన్ని కరోనా కాటేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటికి తోడు మహమ్మారి దరిచేరకుండా ఉండేందుకు మాస్కులు, శానిటైజర్ల వాడకం కూడా అంతే ముఖ్యం. అయితే కొంత మంది వీటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని విధాలుగా చెప్పినా నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఈక్రమంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి.. కరోనా ముందు జాగ్రత్తలను వివరిస్తున్నాడు. ఇందుకు వినూత్న వేషం ధరించి మాస్కులు, శానిటైజర్లను ప్రజలకు అందజేస్తున్నాడు. (కరోనా.. కొడుకు గురించి విజయ్ ఆందోళన! ) అతని పేరు సాయిరామ్. అచ్చం మహాత్మా గాంధీలా.. సిల్వర్ రంగు పెయింట్ వేసుకుని భువనేశ్వర్‌లోని మురికి వాడల్లో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నాడు. దీనికి తోడు గత వారం రోజులుగా చేతిలో జాతీయ జెండా పట్టుకుని కాలినడకన నడుస్తూ, ప్రతి ఇంటింటికి వెళ్లి కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు 150 కిలోమీటర్ల మేర నడిచాడు. (లాక్డౌన్.. విమాన, రైల్వే సర్వీసులపై క్లారిటీ) ఈ విషయంపై సాయిరామ్ మాట్లాడుతూ.. ‘ప్రజలు నన్ను సిల్వర్ గాంధీ అని పిలుస్తారు. కరోనా గురించి అవగాహన కల్పించడానికి కాలినడకన నడవడం ప్రారంభించాను. ఈ ప్రయాణం కోసం నా దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని మాస్కులు, శానిటైజర్లను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. ప్రస్తుతం మురికివాడ ప్రాంతాలకు వెళ్లి కూడా కరోనా వైరస్‌ను అరికట్టడానికి, కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో విజయం సాధించాలని వివరిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’. అంటూ సాయి రామ్ తన ఆలోచన వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు. (లాక్డౌన్: ఒడిశా కీలక నిర్ణయం) -
ఊరు కాని ఊరిలో... దుర్మణం
టెక్కలి రూరల్: రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష... ఎందుకు మనస్తాపం చెందాడో... ఎందుకు చనిపోవాలనుకున్నాడో... ఊరు కాని ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తేలినీలాపురం సమీపంలో శుక్రవారం 70 అడుగుల ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌పై ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించిన వ్యక్తిని ఒడిశావాసిగా గుర్తించారు. శుక్రవారం చీకటి పడటంతో మృతదేహాన్ని దించలేకపోయారు. శనివారంఉదయం టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ బి. గణేష్, విద్యుత్ శాఖ ఏఈ దయాళ్ నేతృత్వంలో 8మంది సభ్యులు టవర్‌పైకి ఎక్కి మృతదేహాన్ని కిందకు దించారు. మృతుని జేబులో ఉన్న ఆధా ర్ కార్డు, ఇన్సూరెన్స్ కార్డు ఆధారంగా మృతుడి ది ఒడిశా రాష్ట్రం కళహండి జిల్లా బగడ మండ లం ఇచ్చాపూర్ గ్రామమని, అతని పేరు కళియమణి బెహర (40) అని గుర్తించారు. అయితే ఒడిశాకు చెందిన అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలేమిటి? 70 అడుగుల ఎత్తులో ఉన్న టవర్ ఎక్కి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తదితర విషయాలు పోలీసులు దర్యాప్తు లో తేలాల్సివుంది. మృతుడి వద్ద బరంపురం నుంచి విజయనగరం వైపు ఈ నెల 14వ తేదీన తీసిన రైలు టిక్కెట్ ఉంది. అతని జేబులో దొరికిన వివరాలను బట్టి బంధువులకు ఫోన్ చేయగా మృతుడు కొద్ది రోజులుగా కేరళలో పనిచేస్తున్నాడని తెలిసింది. కేరళ నుంచి బరంపురం వెళ్లి.. అక్కడి నుంచి విజయనగరం వెళ్లేందుకు రైల్వే టికెట్ తీసుకొని ఉంటాడని, మధ్యలో నౌపడ స్టేషన్లో దిగి తేలినీలాపురం సమీపంలో బలవన్మరణానికి పాల్పడి వుంటాడని భావిస్తున్నారు. బరంపురం ఎందుకు వెళ్లాడు.. ఇక్కడికి ఎందుకు వచ్చాడు.. తెలియాలంటే అతని కుటుంబసభ్యులు రావాలని, అతని వద్ద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడి మేనమామకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి..!
సాక్షి, భువనేశ్వర్: ఏడాది కాలం నుంచి వేధిస్తున్నా తనకు లొంగడం లేదని ఓ ఉన్మాది అమాయకురాలిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర కాలిన గాయాలైన యువతి ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పరశురామ్ మఝీ (35) కలహండి జిల్లాలోని కలాంపూర్ బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. గతేడాది నుంచి ఓ యువతి(22) ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎప్పటిలాగే యువతిపై బెదిరింపులకు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో నీ సంగతి తర్వాత చెప్తానంటూ పరశురామ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సోమవారం కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న యువతిని బంకపల్లా సర్కిల్ వద్ద ఆ ఉన్మాది అడ్డగించాడు. తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఆవేశానికి లోనైన నిందితుడు తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాధితురాలి ముఖంపై పోసి దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి కేకలు వేయడంతో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ముఖం, చేతిపై తీవ్ర కాలిన గాయాలైన యువతిని భవానిపట్నా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి అందర్నీ నమ్మించి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన పరశురామ్ మఝీ ఇంత దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలినట్లు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌లో ఏడాదికేడాది యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. 2011లో 80గా నమోదైన యాసిడ్ దాడులు, 2016లో 307కు పెరగడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తుంది. -
కూతురి శవంతో.. 6 కిలోమీటర్ల నడక!
-
కూతురి శవంతో.. 6 కిలోమీటర్ల నడక!
సుమారు వారం రోజుల క్రితం ఒడిషాలో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో పాటు పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాని వేడి చల్లారేలోపే మరో వివాదం అదే రాష్ట్రంలో చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లాలో ఓ వ్యక్తి తన ఏడేళ్ల కూతురి శవాన్ని భుజాన వేసుకుని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆ చిన్నారిని అంబులెన్సులో మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. దారి మధ్యలోనే ఆమె చనిపోయినట్లు తెలియడంతో అంబులెన్సు వాళ్లు దారిలోనే వాళ్లను దించేశారు. ఏడేళ్ల బర్షా ఖేముదు ఆరోగ్యం విషమించడంతో అప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్న మిథాలి ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. అంబులెన్సులో ఆమెను తీసుకెళ్తుండగా.. దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ విషయం తెలిసిన అంబులెన్సు డ్రైవర్ వెంటనే తమను దించేశాడని బాలిక తండ్రి దీనబంధు ఖేముదు చెప్పారు. భార్యాభర్తలిద్దరూ కూతురి శవాన్ని మోసుకుంటూ సమీపంలోని గ్రామానికి వెళ్లడంతో ఏమైందని అక్కడి గ్రామస్తులు అడిగారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరో వాహనంలో ఆ కుటుంబాన్ని వారి గ్రామంలో వదిలిపెట్టాలని వారు బీడీఓను, వైద్యాధికారులను కోరారు. ఆనోటా ఈనోటా విషయం జిల్లా కలెక్టర్ కె. సుదర్శన్ చక్రవర్తి దృష్టికి వెళ్లింది. వెంటనే దీనిపై విచారణ జరపాల్సిందిగా చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ మిశ్రాను ఆదేశించారు. అంబులెన్సు డ్రైవర్, ఫార్మాసిస్ట్, వాహనంలో ఉన్న మరో అటెండెంటుపై మల్కన్‌గిరి పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. డ్రైవర్ చేసినది పూర్తిగా చట్ట విరుద్ధమని, నేరపూరిత నిర్లక్ష్యమని కలెక్టర్ చక్రవర్తి అన్నారు. అతడితో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని జిల్లా యంత్రాంగం కల్పించిందని ఆయన చెప్పారు. -
నిర్దయ భారతం
కుజ గ్రహాన్ని పరిశోధించేందుకు రాకెట్‌ను ప్రయోగించిన ఖ్యాతి మనది. ప్రపంచ దిగ్గజ దేశాలతో పోటీపడుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. అయినా.. నిరుపేదలకు కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో కునారిల్లుతున్నాం. అమాయకత్వం.. కడుపేదరికంతో మన దేశ గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారనడానికి ఈ చిత్రం ప్రత్యక్ష నిదర్శనం. ఒడిశాలోని కలహండి జిల్లాలో భార్య శవాన్ని భుజంపై వేసుకుని పది కిలోమీటర్లు నడిచిన ఓ భర్త వార్తకు సంబంధించిన ఫొటోను చూసి నెటిజన్ల హృదయం ఆర్ద్రమైంది. ఆ భర్త నడిచిన తీరును భారతదేశ పటంలా చిత్రించి ఓ నెటిజన్ తన వేదనను ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఇపుడు ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతూ.. మన దేశ విధానాలను ప్రశ్నిస్తోంది.