Office bearers of BJP
-
అభివృద్ధి ఎజెండాకు విపక్షాల అడ్డంకులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆరోపించారు. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమీక్షా సమావేశం, పార్టీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీలో పాల్గొన్నారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశం కోసం పనిచేశారని నడ్డా అభినందించారు. బీజేపీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీ వివరాలను చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీడియాకు తెలియజేశారు. ఈ సమావేశంలో కోవిడ్–19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి ఎజెండా, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలను నడ్డా ప్రస్తావించారు. వీటిని పార్టీకి చెందిన వివిధ మోర్చాల ద్వారా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాలి్సన ప్రణాళికలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇన్‌చార్‌్జలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు నియమించిన ఇన్‌చార్‌్జలు ఇచ్చిన నివేదికలపై చర్చ సాగింది. వ్యాక్సినేషన్లో ఉచితంగా ఇస్తున్న టీకా డోసులు వంద కోట్లకు చేరువవుతున్నాయని, ఈ ఘట్టాన్ని జాతీయ పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
మోదీ మిషన్.. బీజేపీ కార్యాలయంలో ఫెయిల్!
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. నిత్యం అప్డేట్గా ఉంటారు. ముఖ్యంగా తన కలల పథకం 'డిజిటల్ ఇండియా' మిషన్‌ను ప్రవచిస్తుంటారు. కానీ, ఆయన సహచరుడు అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాత్రం 'డిజిటల్ ఇండియా' స్ఫూర్తి కనిపించడం లేదు. అప్డేట్ అన్న ముచ్చటే బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌కు తెలియనట్టు కనిపిస్తున్నది. ఉదాహరణకు బీజేపీ ప్రధాన వెబ్సైట్లో ఆఫీస్ బేరర్ల గురించి ఆరాతీస్తే.. (http://www.bjp.org/hi/organisation/office-bearers)ను చాలాకాలంగా ఆ సమాచారాన్నే అప్డేట్ చేయడం లేదని తాజా పరిశీలనలో తేలింది. బీజేవైఎం అధ్యక్షుడు ఇప్పటికీ అనురాగ్ ఠాకూరేనట! బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ఇప్పటికీ అనురాగ్ ఠాకూరేనట. ఇది బీజేపీ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ దర్శనమిస్తున్న విషయం. బీజేపీవైఎం అధ్యక్షురాలిగా దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ విషయాన్ని ఇప్పటికీ బీజేపీ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. ఇక పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వినోద్ సోనకర్ను ఇటీవల నియమించగా.. ఆ విషయాన్ని కూడా వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. ఇప్పటికీ పాత అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతం పేరే కనిపిస్తుండటం గమనార్హం. బీజేపీ ఎస్టీ మోర్చా కొత్త అధ్యక్షుడిగా రాంవిచార్ నేతామ్ను నియమించగా.. వెబ్సైట్లో మాజీ అధ్యక్షుడు ఫగన్‌సింగ్ కులస్తే పేరును ఇంకా కొనసాగిస్తున్నారు. ఇతర నియామకాల విషయంలోనూ ఇదేవిధంగా బీజేపీ వెబ్‌సైట్‌ను ఏమాత్రం అప్డేట్ చేయకపోవడంతో సమాచారం కోసం ఈ అధికారిక సైట్‌ను ఆశ్రయిస్తున్న నెటిజన్లు విస్తుపోతున్నారు. ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. డిజిటల్ ఇండియాను ప్రవచిస్తున్న ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఇలా సొంత వెబ్సైట్ అప్డేట్ విషయంలో అలసత్వం వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.