officess
-
ఆఫీసుల నుంచే విధులు: విప్రో
ముంబై: మరింతమంది ఉద్యోగులు ఇళ్ల నుంచి కాకుండా కార్యాలయాల నుంచి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా పేర్కొన్నారు. కార్యాలయాలకు రావడం ద్వారా సిబ్బంది మధ్య దగ్గరతనం ఏర్పడుతుందని, సంబంధాలు మెరుగుపడతాయని తెలియజేశారు. మానవులకు ఇవి కీలకమని, ఇందుకు ఎలాంటి టెక్నాలజీ దోహదం చేయదని స్పష్టం చేశారు. 2023 ఎన్టీఎల్ఎఫ్ సదస్సులో ప్రసంగిస్తూ రిషద్ ఎంతటి ఆధునిక టెక్నాలజీ అయినా మానవ సంబంధాలను నిర్మించలేదని వ్యాఖ్యానించారు. తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్న సిద్ధాంతాన్ని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అటు ఆఫీసులు, ఇటు ఇళ్లవద్ద నుంచి పనిచేసే హైబ్రిడ్ వర్కింగే భవిష్యత్ విధానమని ఆయన తెలిపారు. టెక్నాలజీ రంగంలోనే ఇలాంటి విధానాలు వీలవుతాయని రిషద్ చెప్పారు. అయితే, ఉద్యోగులు ఇంటి నుంచే కాకుండా.. కార్యాలయాలకు సైతం వచ్చి పనిచేయడానికి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా సిబ్బంది ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసినప్పటికీ గత రెండేళ్లలో ఉద్యోగవలస భారీగా పెరిగిపోయిందని రిషద్ పేర్కొన్నారు. దీంతో 60 శాతం మంది ఉద్యోగులు కొత్తగా చేరినవారేనని వెల్లడించారు. వెరసి వీరంతా ఆర్గనైజేషన్ సంస్కృతిని తెలుసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
కొలిక్కిరాని.. విభజన
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై రోజులు గడిస్తే... ఉమ్మడి నల్ల గొండ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. జిల్లా పునర్విభజనతో అదనంగా ఏర్పాటైన సూర్యాపేట, యాదాద్రి భువనగిరి సహా నల్లగొండ జెడ్పీలకు కొత్త పాలక వర్గాల ఎన్నిక ఇప్పటికే పూర్తయ్యింది. జూలై 4వ తేదీన పాత పాలకవర్గం దిగిపోగానే.. కొత్త పాలవర్గం పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ... నల్లగొండ జెడ్పీకి మినహా మిగిలిన రెండు జెడ్పీలకు ఇప్పటి దాకా కొత్త భవనాలను సిద్ధం చేయలేదు. మరీ ముఖ్యంగా జెడ్పీ విభజన ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 59 మండలాలు ఉండగా.. మూడు జిల్లాలుగా పునర్విభజన జరిగాక.. మండలాల సంఖ్య ఏకంగా 71కి చేరింది. నల్లగొండ –31, సూర్యాపేట–23, యాదాద్రి భువనగిరి–17 మండలాలతో జిల్లాలుగా కొలువుదీరాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఇప్పటికీ వసతుల్లేవు. ఇప్పుడు కొత్త జిల్లాపరిషత్‌ల పరిస్థితీ అదే తరహాలో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీ విభజన కోసం తుది కసరత్తు మొదలు పెట్టారు. సిబ్బంది కేటాయింపులు, పోస్టింగులు.. తదితర అంశాలు చర్చించేందుకు పంచాయతీ కమిషనర్‌తో సీఈఓల సమావేశం ఈనెల 15వ తేదీన ఏర్పాటు చేశారు. వాస్తవానికి గురువారం జరగాల్సి ఉన్న ఆ సమావేశాన్ని 15వ తేదీకి వాయిదా వేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం ముగిస్తే కానీ.. జెడ్పీ విభజనపై ఒక స్పష్టత రాదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మూడు జిల్లాలకు 68మంది సిబ్బంది విభజన ఉమ్మడి జిల్లా పరిషత్‌కు మంజూరైన పోస్టులు కేవలం 68. ఇందులో 11 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇప్పటికే పాత జెడ్పీ 57 మందితో నడుస్తుండగా.. అందులో జూనియర్ అసిస్టెంట్లు(26), ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ (17)లదే సింహభాగం. రెండు కొత్త జెడ్పీలు కొలువు దీరనున్నా... పాత సిబ్బంది విభజన తప్ప కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్ మాత్రం లేదని అంటున్నారు. మరీ అంతకు సిబ్బంది సరిపోకపోతే ఆయా మండలాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సిబ్బంది విభజన తర్వాత ఎవరి సొంత జిల్లాలకు వారిని కేటాయించే వీలుందని పేర్కొంటున్నారు. దీనికోసం ఆయా సిబ్బంది సర్వీసు, సీనియారిటీ తదితర వివరాలతో జెడ్పీ అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. జెడ్పీ మొత్తం సిబ్బందిలో అత్యధికంగా 19 మంది ఉద్యోగులు నల్లగొండ మండలం నుంచే ఉన్నారు. అయితే, మండలాల సంఖ్యను బట్టి ఏ జిల్లాకు ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు, ఏ ప్రాతిపదికన చేపడతారు, ఏ రేషియో ప్రకారం కేటాయింపులు జరుపుతారు అన్న స్పష్టత ఇంకా రాలేదని, 15వ తేదీ నాటి సమావేశం తర్వాత నిర్ణయం జరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు కొత్త ఏర్పాటైన 12 మండలాల్లో సైతం ఇప్పటికీ సిబ్బంది లేరు. ప్రధానమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టులు భర్తీ కానేలేదు. మొన్నటి పరిషత్ ఎన్నిలను సైతం తహసీల్దార్లకు బాధ్యతలు అప్పజెప్పి పూర్తి చేశారు. సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీలకే ఇన్చార్జ్ ఎంపీడీఓలుగా బాధ్యతలు ఇచ్చారు. కొత్త సిబ్బందిని నియమించుకునే అవకాశం లేదని, పాతవారిని సర్దుబాటు చేయాల్సిందేనని, దీంతో మూడు జెడ్పీలకూ అరకొర సిబ్బందే దిక్కయ్యేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
‘పరిషత్’ ఆఫీసులెక్కడ?
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. మండలానికో జెడ్పీటీసీ, ఆయా మండలాల పరిధిలో ఉన్న స్థానాలను బట్టి ఎంపీటీసీ సభ్యులు కొత్తగా ఎన్నికయ్యారు. ఈనెల 7న మండల పరిషత్ అధ్యక్షుడితోపాటు వైస్‌ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇది వరకే షెడ్యూల్ జారీ చేసింది. ఇందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4 వరకు ఉంది. ఆ లగా నూతన మండల పరిషత్‌లను ఏర్పాటు చేస్తారా? లేక పాత మండలాల్లోనే కొనసాగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. కొత్త పాలకవర్గం కొలువుదీరి వారి వారి మండల పరిషత్ కార్యాలయాల్లో పాలన సాగించాలంటే నూతన పరిషత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎంపీటీసీలు జూలై 5న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఆయా మండలాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నూతన రెవెన్యూ మండలాలను పరిషత్ మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలకు ముందే జిల్లా అధికారులను ఆదేశించింది. దీనిపై అధికారులు అప్పట్లో ఎంపీపీ కార్యాలయాల కోసం అద్దె భవనాలు, సౌకర్యాలు ఉండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఉనికిలోకి నూతన మండల పరిషత్‌లు. జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. ఇందులో పాత మండలాలు 13 ఉండగా, పునర్విభజన సమయంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటయ్యాయి. జైనథ్, బేల, తలమడుగు, గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, తాంసి, ఆదిలాబాద్, ఇచ్చోడ, నార్నూర్ మండలాలు ఉండగా, తాంసి పరిధిలోని భీంపూర్ కొత్త మండలంగా ఏర్పాటైంది. ఇలాగే ఆదిలాబాద్ నుంచి మావల, ఇచ్చోడ నుంచి సిరికొండ, నార్నూర్ నుంచి గాదిగూడ మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. నూతన మండలాలు ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రెవెన్యూ మండలాలుగానే కొనసాగుతున్నాయి. కొత్త మండలాల్లో కొనసాగే పరిషత్ పాలన మాత్రం పాత మండలాల నుంచే కొనసాగుతోంది. దీనికి తోడు కొత్త మండలాలకు ఇప్పటికీ ఎంపీడీవోలను నియమించకపోవడంతోపాటు పాత మండలాల ఎంపీడీవోలను ఇన్చార్జిలుగా ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. దీంతో మండల పరిషత్‌లో ఏవైనా పనులుంటే పాత మండల కార్యాలయాలకే రావాల్సి వస్తోంది. ఇక నుంచి నూతన మండల పరిషత్‌లు ఉనికిలోకి రానుండడంతో ప్రజల బాధలు తీరనున్నాయి. కొత్త పరిషత్, పాలకవర్గం కొలువుదీరిన వెంటనే అధికారులను, సిబ్బందిని, సామగ్రిని కొత్త మండలాలకు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారుల సన్నాహాలు కొత్తగా ఏర్పడిన మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పాత మండలాలతో పాటే పూర్తయ్యాయి. దీంతో నూతన మండలాల ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఇతర పదవులకు ప్రత్యేకంగానే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా ఎంపీపీ కార్యాలయాల్లోనే ఎంపీపీ, ఇతర పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. అందుకు ఎంపీపీ కార్యాలయాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపీడీవో, సూపరింటెండెంట్, అకౌంట్స్ అధికారి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోపాటు స్వీపర్లను కూడా కొత్త మండలాలకు కేటాయించాల్సి ఉంది. మొదట కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసిన తర్వాత దశల వారీగా సిబ్బంది కేటాయింపు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కొరవడిన స్పష్టత కొత్త మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. కొత్తగా ఏర్పడిన భీంపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ మండలంలో తహసీల్దార్ కార్యాలయం పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ, అద్దె భవనాలు దొరకడం కొంత కష్టమే. దీంతో తహసీల్ కార్యాలయం పక్కనే ఒక రూంలో పంచాయతీ భవనం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బాద్‌రూరల్ మండలం నుంచి విడిపోయిన మావల మండలం పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. మావల మండల రెవెన్యూ తహసీల్ కార్యాలయం పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల్లో కొనసాగుతోంది. ఇక్కడ మండల పరిషత్ ఏర్పాటుకు నూతన భవనం వెతకాల్సి ఉంది. అలాగే గాదిగూడ, సిరికొండ మండలాల్లో కూడా ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాలు దొరకడం కష్టంగా మారిన నేపథ్యంలో పరిషత్ ఏర్పాటు అధికారులకు ఓ విధంగా సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, కొత్త మండలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ చేపట్టపోగా, ఉన్న ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. -
పకడ్బందీగా పంపకాలుండాలి
సమీక్షలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాల పునర్విభజనలో పంపకాలు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర శాఖాధిపతుల ఆమోదం పొందిన ఉద్యోగుల జాబితాకు అనుగుణంగానే కేటాయింపులు ఉండాలన్నారు. టీటీడీసీ భవన్లో ఆయా శాఖల జిల్లా బాధ్యులతో కేటాయింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వశాఖలలో కేడర్‌తో సంబంధం లేకుండా సిబ్బంది కేటాయింపులుండాలన్నారు. రాష్ట్ర శాఖ బాధ్యుల జాబితా, జిల్లా అధికారుల కేటాయింపుల జాబితా ఒకేలా ఉండాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు జాబితా అడిగినా పంపించేందుకు పర్యవేక్షక అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉద్యోగుల జాబితాతో పాటు నూతన జిల్లాలో కార్యాలయ వసతి, చిరునామా, కార్యాలయ మ్యాప్, ప్రస్తుతం జిల్లా కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫైళ్ల వివరాలు, వాహనాలను విడదీసి జాబితాను సంబంధిత పర్యవేక్షక అధికారులకు అందించాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలు, అద్దెవాహనాల వివరాలు కూడా పొందుపర్చాలన్నారు. సింగిల్ కేడర్ పోస్టులు రెండు లేదా మూడు ఉన్న పక్షంలో ఒక సింగిల్ కేడర్ పోస్టును నూతన జిల్లాకు కేటాయించాలన్నారు. పాత జిల్లాలో ఉన్న శాఖలు కొన్ని కలిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం, రాష్ట్ర హెచ్ఓడీల ఆదేశాల మేరకు సిబ్బంది జాబితా తయారు చేయాలన్నారు. నూతన జిల్లాలో శాఖాధిపతిని నిర్దేశిస్తూ జాబితా ఇవ్వాలన్నారు. నూతనంగా ఏర్పడే జిల్లాలో అవసరమైన వనరులన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయాల భవనాల కేటాయింపులు జరపాలన్నారు. వాటి మరమ్మతులకు నిధులు మంజూరు కాని పక్షంలో ప్రైవేట్ భవనాలను ప్రభుత్వ రేట్ల ప్రకారం అద్దెకు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు యజమానితో అగ్రిమెంట్ చేయించుకోవాలన్నారు. కొన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా పంచాలన్నారు. ఫైళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఉమ్మడిగా ఉన్న ఫైళ్లను స్కాన్, జిరాక్స్ తీసి నూతన జిల్లాకు పంపాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, డీఆర్వో శ్రీనివాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు పాల్గొన్నారు.