Oil Adulteration
-
పసుపు..కారం..కాదేదీ కల్తీకనర్హం!
సాక్షి సిటీబ్యూరో: యూరియాతో పాలు, ఇనుప రజను పౌడర్‌తో టీ పొడి..ఇటుక పొడితో కారం..బట్టల సోడాతో చక్కెర..మోటానిల్‌తో పసుపు పౌడర్, జంతువుల కొవ్వుతో వంట నూనె..నాసిరకం వస్తువులతో అల్లం వెల్లుల్లి పేస్ట్...డూప్లికేట్ ఇంజిన్ ఆయిల్స్...ఇలా సిటీలో సర్వం కల్తీ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని అక్రమార్కులు కోట్ల రూపాయల కల్తీ సరుకు తయారు చేసి మార్కెట్లోకి జొప్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఎతైన గోడలతో గోదాములు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించి లోపలికి ఎవరినీ అనుమతించకుండా..నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కర్మాగారాలు యధేచ్చగా నడుస్తున్నాయి. దాదాపు సరుకులన్నీ... చిన్న పిల్లకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం, నూనె, కారం, ఉప్పు, పప్పు, నెయ్యి, మసాలాలతో సహా ప్రతి వస్తువులు కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులు సైతం డూప్లికేట్ అవుతున్నాయి. అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకిలీవి తయారవుతున్నాయి. నగర శివారు నుంచే... నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి. కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుతోంది. రాచకొండ, సైబరాబాద్ ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాలుగా మార్చుకున్నారు. రాచకొండ పరిధిలోని పహాడీ షరీఫ్, జల్పల్లి, షాహీన్ నగర్, బాలాపూర్ శివారు, శ్రీరాంనగర్ కాలనీ, మీర్పేట్, నాదర్‌గూల్, బడంగ్పేట్, కందుకూర్, మామిడిపల్లి, హయాత్‌నగర్, పెద్ద అంబర్పేట్, ఆదిభట్ల, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి మేడ్చల్ తదితర ప్రాంతాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్, శంషాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు. . ఇక్కడ రూ.50 విక్రయించే వస్తువును పది రూపాయలకే తయారుచేస్తున్నారు. డూప్లికేట్ ప్యాకింగ్‌తో లారీల ద్వారా బస్తీలు, కాలనీలు, గ్రామాలకు తరలిస్తున్నారు. చిన్నా చితక కిరాణా షాపులకు తక్కువకే విక్రయిస్తున్నారు. వ్యాపారులకూ పాత్ర కొందరు వ్యాపారులు సైతం కల్తీ మాఫియాతో సంబంధాలు ఏర్పరుచుకొని వినియోగదారులకు బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. కల్తీ మాఫియా సంబంధిత అధికారులనే మేనేజ్ చేసుకొని తమ దందాను కొనసాగించడానికి నగర శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. నిత్యవసర వస్తువుల తయారీ పేరుతో పరిశ్రమలు ఏర్పాటు చేసి దాని మాటున నకలీ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కాగా కల్తీ దందా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. అక్రమార్కులు ఏదో ఫుడ్స్ పేరుతో ఒక చోట కంపెనీ నెలకొల్పడం..కుటీర పరిశ్రమ కింద రిజిస్టర్ చేయించుకోవడం.. ఇక పై దందా షురూ! ఓ భారీ షెడ్.. లోపల జరిగే బాగోతం బయటకు కనిపించకుండా చుట్టూ కోటను తలపించే ఎత్తయిన గోడలు.. ఎవరైనా తనిఖీ కోసం వస్తే వారిని మేనేజ్ చేసుకొవడం...ఇలా కల్తీ వ్యాపారం మూడు పొట్లాలు ఆరు ప్యాకెట్లుగా కొనసాగుతుంది. ఏటేటా పెరుగుతున్నా... కల్తీ ఆహార పదార్థాల కేసులు ప్రపంచంలో ఏటా లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కల్తీ పదార్థాలు తినడం వల్ల ఏటా దాదాపు 30 లక్షల మంది మర ణిస్తున్నారని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. 2011–12లో 13 శాతం ఉన్న కల్తీ వ్యాపారం 2018–19 నాటికి 26 శాతానికి పెరిగింది. దీనికి కారణం అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ లోపించడమే. కల్తీ నేరానికి ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ కొత్తగా కల్తీ నేరానికి 10 లక్షల జరిమానా,యావజ్జీవ జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. కల్తీని నిర్మూలించడానికి వాస్తవంగా ఫుడ్స్, పీసీబీ, జీహెచ్ఎంసీ, పరిశ్రమల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని ప్రస్తుతం ఒక్క పోలీసులే చేస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. పోలీసులు దాడులు పెరగడంతో కొందరు కల్తీదారులు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. -
కాదేదీ కల్తీకి అనర్హం!
సాక్షి, అమరావతి బ్యూరో: కల్తీలకు కాదేదీ అనర్హం అన్నచందంగా జిల్లాలో కొందరు వ్యాపారులు చెలరేగుతున్నారు. ప్రతి వస్తువునూ కల్తీచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కూరలో వేసే కారం నుంచి నూనె వరకు, నెయ్యి నుంచి టీపొడి వరకు, ఆఖరికి పాలు, పెరుగు, మిఠాయిలు, పండ్ల వరకు ప్రతి ఒక్కదానినీ కల్తీమయం చేస్తున్నారు. ఏకంగా జంతువుల కొవ్వు, మాంసం వ్యర్థాలతో నూనెతీసి, దానిని విక్రయిస్తున్న ఘటన గుంటూరులో ఆదివారం వెలుగుచూసింది. ఇలా ప్రతి వస్తువునూ కల్తీ చేస్తుండటంతో ఏది కొనాలో ఏది కొనకూడదో, ఏది తింటే ఆరోగ్యం దెబ్బతింటుందో అన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంచలనం రేకెత్తించిన కల్తీ కారం రెండేళ్ల క్రితం గుంటూరులో కల్తీ కారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పలు మిల్లులు, గోదాముల్లో భారీ స్థాయిలో కల్తీకారం, మిరపకాయల తొడేలతో చేసిన కారం పట్టుబడింది. అప్పట్లో విజిలెన్స్, జిల్లాస్థాయి అధికారులు హడావుడి చేశారు. ప్రత్యేక బృందాలతో తనిఖీ చేసి శాంపిల్స్‌ను తీశారు. 97 శాంపిల్స్ తీయగా వాటికి సంబంధించి 16 కేసులు కోర్టులో నడుస్తున్నాయి. మరో 45 కేసులు జేసీ కోర్టులో ఉన్నాయి. 12 కేసులకు సంబంధించి అధికారులు జరిమానాలతో సరిపెట్టారు. ఈ కల్తీ వ్యవహారంలో ఓ అధికారి పార్టీ నేత పంచాయితీలు జరిపి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని కేసును కోల్డ్‌స్టోరేజీలపైకి నెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. గత ఏడాది ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ గుంటూరులో దాడులు చేసినప్పుడు మళ్లీ కల్తీకారం పట్టుబడింది. అధికారులు ఎంతగా హడావుడి చేసినా కల్తీకారం తయారీకి అడ్డుకట్టపడలేదన్న వాస్తవం ఈ ఘటనతో వెల్లడైంది. నెయ్యి, నూనె కల్తీతో ఆందోళన జిల్లాలో విజిలెన్స్ దాడుల్లో కల్తీ నెయ్యి, నూనెలు పలుమార్లు పట్టుబడ్డాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాము వాడుతున్న నూనెలు మంచివేనా అన్న అనుమానం వారిని పీడిస్తోంది. పండ్లు,టీపొడి, ఊరగాయలు, చికెన్, మటన్, ఇలా ప్రతి వస్తువులో కల్తీ జరుగుతోందని అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో ప్రజలు ఏ వస్తువును కొనా లన్నా ఆందోళన చెందుతున్నారు. చివరకు హోటళ్లు, దాబాల్లో సైతం కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తుండటంతో ప్రజారో గ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లు, ప్రభుత్వ హాస్టళ్లకు కల్తీవస్తువులు సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు, హోటళ్లలో భోజనం చేసేవారు అనారోగ్యం పాలవుతున్నారు. ఫుడ్ కంట్రోల్ శాఖలో సిబ్బంది కొరత కల్తీ వస్తువులను నియంత్రించాల్సిన ఫుడ్ కంట్రోల్ శాఖ అధికారులు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫుడ్ కంట్రోలర్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉండటంతో వారు కల్తీలను నియంత్రించలేకపోతున్నారు. విజిలెన్స్, పోలీసు అధికారులు పట్టుకున్నప్పుడు హాజరై శాంపిల్స్ తీసి కేసులు నమోదు చేసేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. జిల్లాలో తీసిన శాంపిల్స్ నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం తెలంగాణకు పంపిస్తున్నారు. శాంపిల్స్ పరీక్షించి నివేదికలు వచ్చేం దుకు జాప్యం జరగడంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫుడ్ కంట్రోల్ అధికారులు అన్నిరకాల ఆహార పదార్థాల్లో 449 శాంపిల్స్ తీశారు. 97 శాంపిల్స్ సురక్షతం (అన్‌సేఫ్/ సబ్స్టాండెడ్) అని పరీక్షల్లో తేలడం గమనార్హం. వీటిలో 14 కేసులు నూనెలకుసంబంధించిన కేసులు ఉన్నాయి. 37అన్‌సేఫ్, 19 సబ్ స్టాండెడ్, 46 మిస్‌బ్రాండ్ వస్తువులుగా తేలాయి. వీటికి సంబంధించి కొన్ని కేసులు కోర్టులో నడుస్తుండగా, కొన్ని జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. గత జూలైలో మంగళగిరిలో పట్టుబడిన కల్తీ నెయ్యి, ఆదివారం గుంటూరులో పట్టుబడిన జంతు కొవ్వుల నూనె వ్యవహారం సంచలనం రేకెత్తించాయి. ఫుడ్ కంట్రోల్ అధికారులు నెలకు 30 నుంచి 40 శాంపిల్స్ తీయాల్సి ఉంది. అయితే ఈ శాంపిల్స్ తీసేందుకు వారికి వాహన సదుపాయం, సహాయ సిబ్బంది లేకపోవడంతోచట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించి శాంపిల్స్ తీస్తున్నాం. పరీక్షల్లో అన్‌సేఫ్ అని తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టులో పెడుతున్నాం. మిస్‌బ్రాండ్, సబ్స్టాండెడ్ వస్తే జేసీ కోర్టుకు నివేదిస్తున్నాం. ఈ ఏడాది కల్తీ నూనెలకు సంబంధించి 14 శాంపిల్స్ పరీక్షలు మిస్బ్రాండ్గా తేలాయి. హోటళ్లు, నూనె, కారం మిల్లులు, పండ్ల వ్యాపారం, నీరు, పాలు తదితర ఉత్పత్తుల సరఫరా చేసేవారిపై నిఘా పెంచాం. కల్తీల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – షేక్ గౌస్‌మొహిద్దీన్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
వంట నూనె వ్యాపారుల ...ఘరానా మోసం..!
వంట నూనెల కల్తీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. జిల్లాకు చెందిన మంచి (పల్లీ) నూనె వ్యాపారులు చేస్తున్న కల్తీ దందా నిజమని అధికారులు చేసిన దాడుల్లో తేలింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి తదితర పట్టణాల్లో ఆయిల్ హోల్ సేల్ వ్యాపారం నిర్వహిస్తూ వినియోగదారులకు కుచ్చుటోíపీ పెడుతున్నారు. పేరుకు తమ బ్రాండ్‌పై వేరు శనగ ఉన్నట్లు క్యాన్లు, ప్యాకెట్ల పైన ముద్రించి మోసానికి పాల్పడుతున్నారు. జిల్లాలో కల్తీ నూనె విక్రయిస్తూ కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల నామ మాత్రపు తనిఖీలతో ఆయిల్ మిల్లర్లు, వ్యాపారులు తమ దందా బయట పడకుండా గుట్టుగా సాగిస్తున్నారు. నల్లగొండ టూటౌన్ : జిల్లాలో కల్తీ ఆయిల్ విక్రయిస్తున్నారని అప్పట్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు నల్లగొండ, హాలియా, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ పట్టణాల్లో సంబంధిత అధికారులు దాడులు జరిపి శాంపిల్స్ సేకరించారు. ఆయా ప్రాంతాల్లోని మిల్లులు, ట్రేడర్స్‌లో సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపడంతో వ్యాపారుల కల్తీ మాయ బయట పడింది. వ్యాపారులు విక్రయిస్తున్న ఆయిల్లో కల్తీ నిజమేనని రిపోర్ట్లలో కూడా వచ్చింది. నల్లగొండలోని నెహ్రూగంజ్‌లో ఉన్న ఓ ఆయిల్ మిల్లుపై మూడు కేసులు నమోదు చేశారు. అదే విధంగా హాలియాలో ఉన్న మిల్లు, ట్రేడర్స్పైకూడా కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడ, కొండ మల్లేపల్లిలోని కల్తీ వ్యాపారంపై నివేదిక తయారు చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ జాయింట్ కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. సదరు వ్యాపారులపై జాయింట్ కలెక్టర్ జరిమానా విధించాల్సి ఉంటుంది. ఆయిల్ కల్తీ చేసినందుకు ఒక్కో వ్యాపారికి రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. కానీ దాదాపు ఏడాది కావస్తున్నా సంబంధిత కల్తీ రిపోర్ట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తక్కువ ధర నూనె కలిపి ... కాకినాడ నుంచి వివిధ రకాల కంపెనీల నూనెను డ్రమ్ముల్లో జిల్లాకు చెందిన వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. పల్లి నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఇతర తక్కువ ధరలకు లభించే నూనె డ్రమ్ములు ఇక్కడి వ్యాపారులు హోల్ సేల్ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన సగం వేరు శనిగ నూనెను, తక్కువ ధరకు లభించే పత్తి నూనె, సన్‌ఫ్లవర్ నూనెను వాటిలో కలిపి మరో సారి వాటిని మిల్లులో పోస్తారు. ఈ ఆమిల్ అంతా బాగా కలిసి పోయినా తర్వాత ఆ నూనెను సంబంధిత వ్యాపారుల సొంత బ్రాండ్ స్టిక్కర్లు అంటించి ఉన్న క్యాన్లలో ప్యాక్ చేస్తారు. అదే లీటర్ ప్యాకెట్ తయారు చేసి జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న కిరాణా దుకాణాలకు సదరు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. వేరు శనిగ నూనె అని.. జిల్లాలోని ఆయిల్ మిల్లుల వ్యాపారులు, హోల్ సేల్‌గా ఆయిల్ తెచ్చి ఇక్కడే ప్యా క్ చేసి విక్రయిస్తున్న కొంత వ్యాపారులు రూ.కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వేరు శనిగ నూనె అని కల్తీ ఆయిల్‌ను వినియోగారులకు అంట కడుతూ నిండా ముంచుతున్నారు. వ్యాపారుల మాయ జాలం అంతా ఇంతా కాదు. ప్రతి రోజు జిల్లాలో కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. అమాయక ప్రజలు తా ము కొంటున్నది కల్తీ నూనె అని తెలియక వ్యాపారుల చేతిలో మోస పోతున్నారు. కల్తీ అని రిపోర్ట్లు వచ్చాయి. గతంలో తాము సేకరించిన శ్యాంపిల్స్‌లో కల్తీ అని తేలింది. సంబంధిత వ్యాపారుల ఆయిల్ కల్తీపై నివేదిక తయారు చేసి జాయింట్ కలెక్టర్‌కు పంపడం జరిగింది. కల్తీ వ్యాపారులకు జేసీ జరిమానా విధిస్తారు. తప్పు చేస్తే ఎవరికైనా జరిమానా తప్పదు. – ఖలీల్, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, నల్లగొండ -
కల్తీ ఆయిల్ గుట్టురట్టు
జంతు, కోళ్ల వ్యర్థాలతో తయారీ పూడూరు మండలం గొంగుపల్లిలో వెలుగుచూసిన ఘటన స్థావరంపై పోలీసుల దాడి 1200 లీటర్ల ఆయిల్‌స్వాధీనం జంతు, కోళ్ల వ్యర్థాలతో తయారీ పూడూరు మండలం గొంగుపల్లిలో వెలుగుచూసిన ఘటన పూడూరు: జంతు, కోళ్ల వ్యర్థాలతో ఆయిల్ తయారు చేస్తున్న ఓ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 1200 లీటర్ల కల్తీ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన మండల పరిధిలోని గొంగుపల్లి శివారులో బుధవారం వెలుగుచూసింది. చేవెళ్ల సీఐ ఉపేందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొంగుపల్లి గ్రామానికి చెందిన 143 సర్వేనంబర్‌లో కొంత భూమిని ప్రభుత్వం గతంలో అదే గ్రామానికి చెందిన పర్మయ్యకు ఇచ్చింది. ఈభూమిని నగరంలోని మెహిదీపట్నంకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ లీజుకు తీసుకొని ఓ షెడ్‌ను నిర్మించుకున్నాడు. కొంతకాలంగా అందులో పశు, కోళ్ల వ్యర్థాలతో కల్తీ ఆయిల్‌ను గుట్టుగా తయారు చేస్తున్నాడు. దీంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. బుధవారం సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో చన్గోముల్ ఎస్ఐ శేఖర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓ పెద్ద బాణలో జంతు, కోళ్ల వ్యర్థాలను మరిగిస్తూ నూనె తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అక్కడ పని చేస్తున్న అన్వర్, షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షెడ్ యజమాని ఇర్ఫాన్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. 1200 లీటర్ల కల్తీ ఆయిల్, 8 డ్రమ్ముల పశువుల వ్యర్ధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న కేంద్రాన్ని సీజ్ చేశారు. స్థానిక వీఆర్ఓ రాంచందర్‌రావు ఫిర్యాదు మేరకు కల్తీ ఆయిల్ తయారీలో ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. ఔషధాలలో ముడి సరుకుగా... జంతు వ్యర్థాలతో తయారు చేసిన ఈ కల్తీ ఆయిల్‌ను జౌషదాల తయారీలో ముడి సరుకుగా ఉపయోగిస్తారని, ఈక్రమంలో ఫార్మా కంపెనీలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ నూనె తయారీకి అవసరమయ్యే కొన్ని పదార్థాలను షోలాపూర్ నుంచి ఉసా చాచా అనే వ్యాపారి సమకూరుస్తాడని కల్తీ అయిల్ తయారీ కేంద్రంలో పని చేసే బిహార్‌కు చెందిన అన్వర్, షకీల్‌లు తెలిపారు. అంతా అధికారులకు తెలుసు..? చాలా రోజులుగా ఈ కల్తీ దందా సాగుతోంది. ఈ విషయం రెవెన్యూ, పంచాయతీ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. పొలాల మధ్య నిర్వహిస్తున్న ఈ దందాలో అధికారులు అడ్డుకోకుండా నిర్వాహకులు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిమినల్ కేసు నమోదు: సీఐ ఉపేందర్ కల్తీ ఆయిల్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశాం. నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ప్రజలకు హానీ కలిగించే ఇలాంటి కేంద్రాలపై చర్యలు తీసుకుంటాం. 1200 లీటర్ల కల్తీ ఆయిల్, పశు, కోళ్ల వ్యర్ధాలు ఉన్న డబ్బాలను స్వాధీనం చేసుకున్నాం. -
ఆయిల్ కల్తీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ : జంతువుల వ్యర్థాల నుంచి ఆయిల్‌ను తయారుచేసి, దాన్ని వంట నూనెలో కలిపి... కల్తీ నూనెను అమ్ముతున్నవారిని రాజేంద్రనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతోపాటు, 51 డబ్బాల కల్తీ ఆయిల్‌ను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.