ఒపెక్ దేశాల బిగ్ సర్ప్రైజ్
ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించాలని పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరపతనం కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తు సంస్థ అల్జీరియాలోని ఓరాన్ ఒపెక్ కూటమి సమావేశం నిర్ణయం తీసుకుంది. 42 లక్షల బ్యారళ్ల క్రూడ్ ఉత్పత్తికి కోత పెట్టాలని, ఇది జనవరి ఒకటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 33.24 మిలియన్ బ్యారెళ్ల నుండి 32.5 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తి తగ్గిస్తామని ఒపెక్ కూటమి ప్రకటించింది. అలాగే మార్కెట్లో వేలాది సంఖ్యలో ఉన్న అదనపు బ్యారెల్స్ క్రూడ్‌ను తక్షణమే తొలిగిస్తామని రష్యా ఇతర దేశాలు ప్రకటించాయి. ఉత్పత్తి కోతపై ఇప్పటికే తాము ఏకాభిప్రాయానికి వచ్చామని ఒపెక్‌లో ముఖ్య నేత సౌదీ అరేబియా చమురు మంత్రి అలీ నయిమి తెలిపారు.
రోజుకు 700,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని మాత్రమే తగ్గిస్తారు. ప్రస్తుత ఉత్పత్తి అంచనా 33.24 మిలియన్ బ్యారెళ్లతో పోల్చితే ఈ తగ్గింపు చాలా తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.ఈ కోత స్వల్ప కాలికంగా ధర మద్దతుకు దోహదం చేస్తుందని గోల్డ్ మన్ వ్యాఖ్యానించింది. ఈ రోజు ప్రకటించిన ఉత్పత్తి కోత 2017ఆర్థికసంవత్సరం మొదటి భాగంలో కఠినంగా అమలుచే స్తే బ్యారల్ చమురు విలువ 10 డాలర్లు పెరగనుందని గోల్డ్ అంచనా వేసింది. అయితే అధిక సప్లయ్ సమస్యకు ఈ కోత ఇప్పటికిపుడు పరిష్కారం చూపదని మోర్గాన్ స్టాన్లీ పెదవి విరిచింది. ఈ డీల్ పట్ల బిగ్ సర్ ప్రైజ్ అంటూ మరికొంతమంది ఎనలిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయిల్ మార్కెట్ల పట్ల మదుపర్ల అయిష్టత పెరుగుతుందనీ, మరిన్ని షార్ట్ పొజిషన్లు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.
తాము రోజుకు 6 లక్షల పైగా క్రూడ్ ఉత్పత్తిని తగ్గిస్తామని రష్యా ఉపప్రధాని ఇగోర్, అజర్ బైజాన్ ఇంధనమంత్రి అలీవ్ ప్రకటించారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పడిపోకుండా చూడాలని వీరు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒపెక్ ఎగుమతి చేసే ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 40.74 డాలర్లు ఉంది. కాగా గత రెండేళ్లుగా చమురు ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే.