మెదక్ జిల్లాను కుదిపేసిన అకాలవర్షం
మెదక్: మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షాలు అన్నదాతకు నష్టం మిగిల్చాయి. సిద్దిపేటలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం, పొద్దు తిరుగుడు విత్తనాలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 500 బస్తాల ధాన్యం తడిసినట్లు సమాచారం. ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రంలోని పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా తడిచిపోయాయి. అలాగే, నారాయణఖేడ్, పరిగి, ములుగు, వర్గల్ మండలాల్లో కురిసిన వడగండ్ల వానలతో జనం ఇబ్బందుల పాలయ్యారు.