Oil industry
-
షాద్ నగర్ పరిధిలోని BRS ఆయిల్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
వంటనూనెల కొరతతో చిక్కులు!
2017–18లో దేశీయ వంటనూనెల వినియోగం 2.5 కోట్ల టన్నులు కాగా ఇందులో 1.5 కోట్ల టన్నులు దిగుమతులు చేస్తున్నారు. దేశీయ ఉత్పత్తి 80 లక్షల టన్నులు దాటడం లేదు. భారత్‌లో తలసరి నూనెల వాడకం సంవత్సరానికి 17 కే.జీ.లు ఉండగా ప్రపంచంలో 25 కే.జీ.లు ఉన్నది. 2030 నాటికి నూనెల వినియోగం 3.40 కోట్ల టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నూనెల దిగుమతుల కోసం ప్రస్తుతం రూ.83,669 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఇందులో కోటీ 20 లక్షల టన్నుల వంట నూనెలకు క్రూడాయిల్ కోసం రూ.69,669 కోట్లు వెచ్చిస్తుండగా, 29 లక్షల టన్నుల రిఫైన్డ్ ఆయిల్ దిగుమతులకు గాను, రూ. 14 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రస్తుతం నూనె గింజల ఉత్పత్తికి 6.65 కోట్ల ఎకరాలు దేశంలో సాగవుతున్నది. వినియోగంలో 46 శాతం పామాయిల్, 16 శాతం సోయా, 14 శాతం మస్టర్, 24 శాతం ఇతర నూనెలు వాడుతున్నాం. భారతదేశం వంటనూనెల దిగుమతులపై అత్యధిక నిధులు వెచ్చిస్తున్నది. దేశంలో 8 కోట్ల సాగునీటి భూమి బీళ్ళుగా మారింది. బీళ్ళుగా మారిన భూమిలో నూనె గింజలు, పప్పుధాన్యాలు పండాల్సింది. కానీ, ఈ రోజు వంట నూనెలతో పాటు 50 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయ అవసరాలకు 2.35 కోట్ల పప్పు ధాన్యాలు అవసరం కాగా, ప్రస్తుతం మన ఉత్పత్తులు 1.85 కోట్ల టన్నులకు మించడం లేదు. పౌష్టిక, కీలక ఆహార సరుకులను దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది తప్ప, బీడు భూములను సాగు చేసి, పైసరుకులలో స్వయంపోషకత్వం కావడానికి ఎలాంటి కృషి జరగడం లేదు. దినదినం నూనెగింజల విస్తీర్ణం తగ్గుతూ ఉంది. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం బడ్జెట్లో అతి తక్కువ మొత్తాన్ని కేటాయిస్తోంది. ప్రయోగాల ద్వారా నూనె గింజలను పెంచాలని నిధులు విడుదల చేసినా ఎక్కడా దేశంలో నూనె గింజల ఉత్పాదకతకు ఎలాంటి ప్రయోజనాలు రావడం లేదు. ప్రపంచంలో 5 దేశాలు పామాయిల్ ఉత్పత్తిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. 2017–18లో ప్రధమ స్థానంలో ఇండోనేíసియా 2.1 కోట్ల టన్నులు, మలేసియా 1.95 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తిలో ఈ రెండు దేశాలు 85 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండోనేసియా, మలేసియా నుండి భారతదేశం వంట నూనెలు దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా నేటికీ 7 లక్షల ఎకరాలలో మాత్రమే పామాయిల్ తోటలు వేశారు. తోటల విస్తరణకు 90 శాతం రాయితీ ఇస్తూ ప్రోత్సహించాలని పథకాలు రూపొందిస్తున్నారు. దళిత, గిరిజనులకు 100 శాతం ఇస్తున్నారు. కానీ, చాలా వరకు ఈ సబ్సిడీ పథకాలు దుర్వినియోగం జరుగుతున్నాయి. కష్టపడి తోటలు వేసే వారికి మాత్రం లభించడం లేదు. తోటల మంజూరుకు పైరవీలు చేయలేక చాలా మంది విరమించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం 13.478 ఎకరాలలో పామాయిల్ తోటలు తీసివేయగా ప్రస్తుతం 3,58,331 ఎకరాలలో మాత్రమే తోటలు ఉన్నాయి. తెలంగాణలో 40,110 ఎకరాలలో తోటలు వేశారు. దేశంలో 68 వేల ఎకరాలను లక్ష్యంగా నిర్ణయించుకొని, 36 వేల ఎకరాలలో మాత్రమే తోటలు వేశారు. ఏపీలో పామాయిల్ తోటల విస్తరణ లక్ష్యం 31 వేల ఎకరాలు కాగా 13 వేల ఎకరాలకు, తెలంగాణలో 5 వేల ఎకరాలు లక్ష్యం కాగా, 1,162 ఎకరాలను మాత్రమే నాటారు. దీనిని బట్టి చూస్తే దేశంలో పామాయిల్ తోటల విస్తరణ పెంచడానికి, ప్రభుత్వ పథకాలు అమలు జరపడానికి అధికార యంత్రాంగం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. దేశీయ అవసరాలకు ఉత్పత్తికన్నా దిగుమతులు ఎక్కువగా వున్నాయి. ఇక్కడున్న కొద్దిపాటి ఉత్పత్తికి కూడా నిర్ణయించిన ధర ఇవ్వకుండా మధ్యదళారీలు రైతులను నష్టపరుస్తున్నారు. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకాన్ని రూపొందించి పామాయిల్ తోటల పెంపకాన్ని వృద్ధి చేయడం ద్వారా నూనె కొరతను తీర్చవచ్చు. ప్లాంటేషన్ తోట లన్నింటిలో కొనుగోలుదారులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. మధ్యదళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏజెన్సీ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. ప్రస్తుతం టన్నుకు రూ. 10,000లు అమ్మినప్పటికీ ఒక సందర్భంలో 6 వేలకు ధరలు తగ్గాయి. ధరల స్థిరత్వం లేకపోవడం వల్ల రైతులలో తోటల పెంపుదలపై ఉత్సాహం కనపర్చడం లేదు. కనీసం టన్నుకు రూ. 15,000 ధర నిర్ణయించడం ద్వారా రైతులకు కొంత ప్రోత్సాహం కలుగుతుంది. కనీస అవసరాలమేరకైనా ప్రతి వ్యక్తీ నూనెల వాడకానికి కావలసిన ఉత్పత్తిని దేశీయంగా చేయాలి. అందుకనుగుణంగా ప్రభుత్వం పథకాలు రూపొందించి ప్రత్యేక శ్రద్ధతో తోటల విస్తరణ చేసి, నూనె దిగుమతులను పూర్తిగా తగ్గించాలి. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త ఉపాధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ 94900 98666 -
విత్తు పోయే.. నూనె వచ్చె!
సాక్షి,సిటీబ్యూరో: దేశంలో లభించే విత్తనాలకు తక్కువ ధరకు ఖరీదు చేసి విదేశాల్లో ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం పేరుతో టోకరా వేసిన కేసులను ఇప్పటి వరకు చూశాం. తాజాగా సైబర్ నేరగాళ్లు విత్తుల్ని వదిలి నూనెపై పడ్డారు. ఇందుకు సంబంధించిన కేసు బుధవారం నగర సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైంది. సైబర్ నేరగాళ్ల ముఠాలో సభ్యుడైన ఓ నైజీరియన్ నేరుగా వచ్చి బాధితుడిని కలవడం ఈ కేసులో కొసమెరుపు. ఫేస్బుక్ ద్వారా మహిళగా పరిచయమైన సైబర్ నేరగాళ్ళు రామ్‌కోఠి ప్రాంతానికి చెందిన వ్యాపారి ఆదినారాయణ నుంచి రూ.17 లక్షలు కాజేశారు. ఈయనకు ఫేస్బుక్ ద్వారా రెండు నెలల క్రితం ఎల్జిబెత్ జోన్స్ రేయి పేరుతో మహిళగా చెప్పుకున్న సైబర్ నేరగాడు పరిచయమయ్యాడు. కొన్నాళ్ళ పాటు చాటింగ్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ నేపథ్యంలోనే లాభసాటిగా ఉండే ఓ వ్యాపారం చెప్తానంటూ ఎల్జిబెత్ ఎర వేసింది. తాను యూకేలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్నానని తమ కంపెనీకి ‘ఇచికు వా రిజరŠడ్వ్’ పేరు గల నూనె భారీగా అవసరమంటూ చెప్పింది. దీనిని భారత్‌తో లీటర్ 2300 డాలర్లకు ఖరీదు చేయించి... కంపెనీకి 4300 డాలర్లకు విక్రయిస్తుంటానని నమ్మించింది. ఇటీవల తనను వేరే విభాగానికి బదిలీ చేశారని, ఇప్పటి వరకు తాను చేయించిన నూనె వ్యాపారం విషయం తమ యజమాన్యానికి తెలిస్తే తనకు ఇబ్బందంటూ కథ అల్లింది. అలా కాకుండా ఉండాలంటే మీరే ఆ వ్యాపారం చేపట్టి నూనెను ఖరీదు చేసి తమకు పంపాలని చెప్పింది. ఆ నూనె సరఫరా కాంట్రాక్టు ఇప్పించే బాధ్యత తనదేనంటూ నమ్మించింది. ఇందుకు ఆదినారాయణ అంగీకరించడంతో వ్యాపారంలో వచ్చే లాభంలో తనకు 40 శాతం వాటా ఇవ్వాలంటూ చెప్పడంతో బాధితుడు పూర్తిగా వల్లోపడ్డాడు. ఈ మేరకు సదరు ఆయిల్‌ను లీటర్ 4700 డాలర్లకు సరఫరా చేస్తానంటూ ఓ కొటేషన్ పంపమంటూ ఆమె కోరడంతో ఆదినారాయణ ఈ–మెయిల్ చేశాడు. దీంతో కంపెనీతో ఒప్పందం ఖరారైందంటూ ఎల్జిబెత్ సందేశం ఇచ్చింది. అయితే తాను చెప్పిన ఆయిల్ ఖరీదు చేసిన తర్వాత నమూనాలు పరీక్షించడానికి తమ కంపెనీకి చెందిన వారు వస్తారంటూ చెప్పింది. ఈ మేరకు సదరు కంపెనీ పేరుతో ఈ–మెయిల్ కూడా వచ్చింది. ఆపై చాటింగ్ ద్వారా ఆదినారాయణతో సంప్రదించిన ఎల్జిబెత్ భారత్‌లో సదరు ఆయిల్ సరఫరా చేసే వ్యక్తంటూ ఓ ఫోన్ నెంబర్ ఇచ్చింది. బాధితుడు ఆ నెంబర్‌కు కాంటాక్ట్ చేయగా మాట్లాడిన మహిళతో తనకు తొలుత రెండు లీటర్ల ఇచికు వా అయిల్ కావాలని కోరగా, లీటర్ 2300 డాలర్ల చొప్పున మొత్తం రూ.3 లక్షలు ముందుగా బ్యాంకులో డిపాజిట్ చేయాలంటూ ఆమె సమాధానమిచ్చింది. దీంతో ఆదినారాయణ రూ.3 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయడంతో కొరియర్ ద్వారా రెండు లీటర్ల నూనె ఆయనకు డెలివరీ చేశారు. ఇది అందిన వెంటనే తనిఖీ చేసుకునేందుకు ఉద్యోగులను పంపాలంటూ ఆదినారాయణ కంపెనీకి ఈ–మెయిల్ పెట్టారు. దీనికి సమాధానంగా ఫలానా రోజున తమ ఉద్యోగి హైదరాబాద్ వస్తున్నట్లు మరో ఈ–మెయిల్ వచ్చింది. నిర్ణీత తేదీన శంషాబాద్‌కు వచ్చిన ఓ నైజీరియన్‌ను ఆదినారాయణను అక్కడికి రప్పించుకుని, రెండు లీటర్ల నూనె నుంచి కొంత శాంపిల్‌గా తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తూ... ఈ నమూనాలను ఢిల్లీలోని అధీకృత ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత ఆర్డర్ విషయం చెప్తామన్నాడు. మరుసటి రోజు ఫోన్ చేసిన ఆ వ్యక్తి నమూనాలు పరీక్షించామని, క్వాలిటీ చాలా బాగుందంటూ కంపెనీకి సమాచారం ఇచ్చామంటూ చెప్పాడు. ఆపై కంపెనీ నుంచి అంటూ కాల్ చేసిన మరో వ్యక్తి తమకు తొలి విడతలో 179 లీటర్ల నూనెను పంపించాలంటూ ఆర్డర్ ఇచ్చాడు. అయితే తాను అంత ఒకేసారి పంపించలేనని, తొలుత 10 లీటర్లు పంపిస్తానంటూ ఆదినారాయణ చెప్పడంతో నేరగాళ్ళు అంగీకరించారు. దీంతో 10 లీటర్ల నూనె కావాలంటూ గతంలో రెండు లీటర్లు పంపిన వారిని సంప్రదించగా, రూ.14 లక్షలు డిపాజిట్ చేయని కోరడంతో ఆదినారాయణ ఆ మొత్తం డిపాజిట్ చేశాడు. ఈ డబ్బు డిపాజిట్ అయిన తర్వాత అప్పటి వరకు మాట్లాడిన అన్ని ఫోన్ నెంబర్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా సాంకేతిక ఆధారాలను బట్టి ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది, కంపెనీ ఉద్యోగులుగా చెప్పుకుంది, ఆయిల్ సరఫరా చేస్తామన్నది ఒకే ముఠాకు చెందిన వారుగా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. -
ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
మెదక్ : మూసి ఉన్న ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వడియారంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియరాలేదు. -
మూసివేయాల్సిందే!
రాజేంద్రనగర్, న్యూస్‌లైన్: ఆయిల్ పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గగన్‌పహాడ్ వాసులు ఆయా పరిశ్రమల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఒక పరిశ్రమ యజమానిని గ్రామం లో నిర్బంధించారు. పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో అతడిని విడుదల చేశారు. గగన్‌పహాడ్ ప్రాంతంలో శీతల్డ్రాప్ ఆయిల్ మిల్, గోవర్ధన్, మానియర్, పవన్, గోల్డ్‌డ్రాప్ ఆయిల్ మిల్స్ కొనసాగుతున్నాయి. పరిశ్రమ నిర్వహణలో ఇక్కడ వరి పొట్టును వినియోగిస్తున్నారు. పొట్టుకాలి పొగ గ్రామంలోకి వ్యాపిస్తోంది. ప్రజలు అనారోగ్యానికి గురికావడంతో పాటు ఇళ్లన్నీ పొగతో మసిబారుతున్నాయి. వాయు కాలుష్యానికి కారణమవుతున్న ఈ ఆయిల్ మిల్స్‌ను మూసివేయాలని స్థానికులు గతంలో పలుమార్లు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో గగన్‌పహాడ్ గ్రామానికి చెందిన యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో సోమవారం ఉదయం శీతల్ డ్రాప్ ఆయిల్‌మిల్ వద్దకు చేరుకున్నారు. యజమాని ఉమేష్‌ను గ్రామానికి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధించారు. ఆ తర్వాత గోవర్ధన్ ఆయిల్‌మిల్, గోల్డ్‌డ్రాప్ పరిశ్రమల వద్దకు వెళ్లి.. వాటి యజమానులను నిర్బంధిం చారు. అయితే, వారు తప్పించుకొని వెళ్లిపోయారు. గ్రామస్తుల ఆం దోళనపై సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉమేష్ ను విడుదల చేయాలని ఆందోళనకారులను కోరారు. ఆరోగ్యాన్ని హరిస్తున్న పరిశ్రమలను మూసి వేసే వరకు ఆందోళన విరమించే ది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. దీంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గ్రామస్తులను సముదాయించారు. వారం రోజుల్లో పరిశ్రమను మూసివేస్తానని శీతల్డ్రాప్ యజమాని ఉమేష్ రాత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అవినీతిని తరిమికొడతా
రాష్ట్రంలోని అవినీతిని తరిమికొట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ప్రారంభించిన నూనె పరిశ్రమను ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం టాస్మాక్ గోడౌన్‌గా మార్చిందని విమర్శించారు. వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అవినీతిని పారద్రోలేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ కూటమి పార్టీలోని పాట్టాలి మక్కల్ పార్టీ అభ్యర్థి ఎదురొలి మణికి మద్దతుగా బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. విజయకాంత్ మాట్లాడుతూ తిరువణ్ణామలైలో ఎంజీఆర్ ప్రారంభించిన టేన్‌కాప్ నూనె పరిశ్రమ ప్రస్తుతం టాస్మాక్ గోడౌన్‌గా మారిందని వీటిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఏనాడైనా చర్యలు చేపట్టాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీంఎకే పార్టీలు కలిసి రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడే దుస్థితి ఏర్పడిందన్నారు. సాతనూర్ డ్యామ్ నుంచి తిరువణ్ణామలైకి వస్తున్న తాగునీరు ప్రస్తుతం నిలిచి పోయిందని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంగంలోని ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరిస్తామని సంవత్సరం క్రితం తెలిపారని, అరుుతే ఇంత వరకూ పనులు ప్రారంభించలేదన్నారు. గిరివలయానికి ప్రతినెలా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అయితే ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఇక దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. తాను రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలను పారద్రోలేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇందుకు నరేంద్ర మోడీ తప్పక సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. తాము ఏర్పరుచుకున్న కూటమితో ఇప్పటికే పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తిరువణ్ణామలైలో ఎదురొలి మణి, డీఎండీకే, పీఎంకే, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.