ఆయిల్ పామ్ కు ఎంఐఎస్ భేష్
స్వాగతించిన ఓపీడీపీఏ
హైదరాబాద్: పామాయిల్ రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్)ను వర్తింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ద ఆయిల్ పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోసియేషన్(ఓపీడీపీఏ) పేర్కొంది. ఆయిల్ పామ్ ఫ్రెచ్ ఫ్రూట్ బంచెస్(ఎఫ్ఎఫ్బీ)కి టన్నుకు ఎంఐఎస్గా రూ.7,888ను కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది కాలంలో ముడి చమురు ధరలు బాగా తగ్గాయని, ఇది ఆయిల్ పామ్ పరిశ్రమ, రైతులపై తీవ్రమైన ప్రభావం చూపించిందని ఓపీడీపీఏ అధ్యక్షుడు సంజయ్ గోయెంకా చెప్పారు.
సమస్యల నుంచి గట్టెక్కెందుకు కనీస మద్దతు ధర(ఎంఐఎస్) లేదా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్) కావాలని కోరామని పేర్కొన్నారు. కేంద్రం ఎంఐఎస్ను ప్రకటించడం రైతులకు, పరిశ్రమకు పెద్ద ఊరట అని వివరించారు. భారత్లో ఉత్పత్తయ్యే పామాయిల్లో 90 శాతం వాటా తెలంగాణ, ఏపీలదేనని, ఈ చర్య ఈ రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు.