oil prices decreased
-
మళ్ళీ భారీగా తగ్గిన వంట నూనె ధరలు..
-
సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్‌కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, హైదరాబాద్‌లో రూ.109.66గా ఉంది. మంగళవారం నుంచి ఈ ధరలపై 40 పైసలు త్గగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గి చాలా రోజులుగా స్థరంగా కొనసాగుతుండటంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది. ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలను తగ్గించారు. అలాగే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో అక్టోబర్ తొలి అర్ధభాగంలో ఇంధన విక్రయాలు భారీగా పెరిగి కరోనా ముందు స్థితికి చేరుకున్నాయి. పండుగ సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీ వృద్ధి నమోదు చేశాయి. దీంతో ధరలు తగ్గించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం లీటర్‌పై 40 పైసలే తగ్గించినప్పటికీ.. రానున్న రోజుల్లో రూ.2వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
వంట నూనెల ధరలు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల ధరలు తగ్గాయి. బ్రాండ్, నూనె రకాన్నిబట్టి గరిష్ట ధరపై 10–15 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం ప్రకటించింది. ధరలు సవరించిన కంపెనీల జాబితాలో అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్), రుచి సోయా (మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా), ఇమామీ (హెల్తీ అండ్ టేస్టీ), జెమిని (ఫ్రీడమ్), బాంజ్ (డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్స్) వంటివి ఉన్నాయి. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా గత కొన్ని నెలలుగా దేశీయంగా వంట నూనెలు ప్రియం కావడం వినియోగదార్లతోపాటు ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అనేకసార్లు శుద్ధి, ముడి వంట నూనెల దిగుమతి సుంకాలను తగ్గించింది. సరఫరాను పెంచడానికి లైసెన్స్ లేకుండా శుద్ధి చేసిన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు వ్యాపారులను అనుమతించింది. ముడి పామాయిల్, కొన్ని ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలను ప్రారంభించడాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ నిషేధించింది. భారత్‌లో ఏటా 2.25 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో దిగుమతుల వాటా ఏకంగా 65 శాతం దాకా ఉంది. -
ముడిచమురుకూ కోవిడ్-19 సెగ
సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ లాక్‌డవున్‌ను ప్రకటించగా.. ఫ్రాన్స్, జర్మనీ సైతం కఠిన ఆంక్షలను విధించాయి. దీంతో ఇటీవల కొంతమేర రికవరీ బాట పట్టినట్లు కనిపిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. వెరసి బుధవారం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు గురువారం తిరిగి అదే స్థాయిలో డీలాపడ్డాయి. దీంతో ఒక దశలో నైమెక్స్ బ్యారల్ 5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్టంకాగా.. బ్రెంట్ బ్యారల్ సైతం 5 శాతం క్షీణించి 36.89 డాలర్లను తాకింది. బ్రెంట్ ధరలైతే ఈ ఏడాది మే నెలలో మాత్రమే 37 డాలర్ల దిగువకు చేరినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి చమురు ధరలు మే, జూన్ స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఓకే ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.75 శాతం పుంజుకుని 36.43 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 0.8 శాతం బలపడి 37.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కారణాలివీ అక్టోబర్ 23తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలను మించుతూ 4.57 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీనికితోడు కోవిడ్-19 కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోవడంతో ఇటీవల కొంతకాలంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరగడంతో సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. -
భారీగా పతనమైన చమురు ధరలు
-
భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. కొద్ది కాలంగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు భారీగా తగ్గాయి. ఒక లీటరు పెట్రోల్ ధర రూ.3.77, ఒక లీటరు డీజిల్ ధర రూ.2.91 తగ్గింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల సమాఖ్య శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. తగ్గించిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. పెట్రోల్ ధరల నియంత్రణ నిర్ణయాన్ని కేంద్రం ఆయిల్ కంపెనీలకు కట్టబెట్టిననాటిననాటినుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.91గాను, డీజిల్ రూ.64.34గానూ ఉంది. తగ్గిన ధరలతో పెట్రోల్ రూ.72.14కు, డీజిల్ రూ.61.43కు దిగిరానుంది. (గమనిక:ఆయిల్ కంపెనీని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి) అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కనిష్ఠానికి చేరుకోవడంతో బ్యారెల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారి 50 డాలర్ల దిగువ ట్రేడ్ అవుతోంది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉందనే వార్తలు ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.