oman airways
-
‘ఒమన్’ విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ : మస్కట్ నుంచి బ్యాంకాక్ బయలుదేరిన ఒమన్ ఎయిర్‌లైన్‌కు చెందిన (డబ్ల్యూవై11) విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురవ డంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మస్కట్ నుంచి బుధవారం తెల్లవారుజామున 3.22 గంటలకు బయలుదేరిన విమానంలో ఒమన్ ప్రయాణికుడు షమీస్ అలీ మహ్మద్ అల్‌ఫార్సీ (74) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో శంషాబాద్ ఏటీసీ అనుమతితో ఉదయం 8.33కి విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపారు. ప్రయాణికుడిని వెంటనే స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు అపోలో వైద్యులు ధ్రువీకరించారు. ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. విమానం గంట తర్వాత ఇక్కడి నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. -
ఒమన్ విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్వేస్ విమానం బుధవారం ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం మస్కట్ నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సాంకేతికలోపం తలెత్తడంతో గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
చెన్నైకి బదులు శంషాబాద్‌లో
శంషాబాద్: వర్దా తుపాను ప్రభావంతో చెన్నైలో వాతావరణం అస్తవ్యస్థంగా మారడంతో ఓమన్ ఎయిర్వేస్(డబ్ల్యూవై 251) విమానం సోమవారం ఉదయం అత్యవసరంగా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. మస్కట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన వివానం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు.