
శంషాబాద్ : మస్కట్ నుంచి బ్యాంకాక్ బయలుదేరిన ఒమన్ ఎయిర్‌లైన్‌కు చెందిన (డబ్ల్యూవై11) విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురవ డంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మస్కట్ నుంచి బుధవారం తెల్లవారుజామున 3.22 గంటలకు బయలుదేరిన విమానంలో ఒమన్ ప్రయాణికుడు షమీస్ అలీ మహ్మద్ అల్‌ఫార్సీ (74) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో శంషాబాద్ ఏటీసీ అనుమతితో ఉదయం 8.33కి విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దింపారు. ప్రయాణికుడిని వెంటనే స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు అపోలో వైద్యులు ధ్రువీకరించారు. ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. విమానం గంట తర్వాత ఇక్కడి నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది.
Comments
Please login to add a commentAdd a comment