శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్‌వేస్ విమానం బుధవారం ఉదయం అత‍్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం మస్కట్ నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సాంకేతికలోపం తలెత్తడంతో గమనించిన పైలట్ అప్రమత‍్తమై వెంటనే విమానాన్ని అత‍్యవసరంగా ల్యాండ్ చేశాడు. సాంకేతిక సిబ‍్బంది సమస‍్యను పరిష‍్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment