హెచ్టీసీ కన్ఫాం చేసింది
న్యూఢిల్లీ: గూగుల్ ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో హెచ్ టీసీ స్మార్ట్ ఫోన్ల తయారీకి రంగం సిద్ధమైంది. తమ అప్ కమింగ్ మోడ్సల్ ను గూగుల్ అండ్రాయిడ్ వెర్షన్ నోగట్ తో అప్ డేట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది చివరికి ఆండ్రాయిడ్ 7.0 వెర్షన్ తో అప్ డేట్ చేస్తామని ట్టిట్టర్ ద్వారా తెలిపింది. ఈ అప్ డేట్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది ఈ ఏడాది ఫోర్త్ క్వార్టర్ లో హెచ్ టీసీ10ను నౌగట్ వెర్షన్ తో అప్ డేట్ చేసే మొదటి స్మార్ట్ ఫోన్ కానుంది. .వన్ ఎం 9, వన్ ఎ 9 డివైజ్ లను నౌగట్ తో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది చివరికా, లేక 2017 ఫస్ట్ క్వార్టర్ లోనా అనేది స్పష్టంగా పేర్కొనలేదు.
కాగా గూగుల్ నెక్సస్ స్మార్ట్ ఫోన్ల తయారీలో హెచ్టీసీ భాగస్వామ్య వార్తలను ఇటీవల హెచ్టీసీ ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో పనిచేసేలా రెండు కొత్త నెక్సస్ స్మార్ట్ ఫోన్లను తయారీచేస్తున్నామని హెచ్ టీసీ రిపోర్టు చేసింది.
We’re excited to receive final shipping Android 7.0 Nougat software from Google! pic.twitter.com/BNbQBpgddK
— HTC (@htc) August 24, 2016