One China policy
-
తైవాన్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తూ.. మెలిక పెడుతున్న అమెరికా!
వాషింగ్టన్: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్ పర్యటన ఎంత వివాదాస్పదమైంతో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా చైనా అమెరికాపై కస్సుమంటూ తైవాన్ సరిహద్దుల్లో సైన్యం మోహరింప చేసి యుద్ధాని రెడీ అంది. ఎంతగా అమెరికా నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన వినకపోగా యుద్ధ కాంక్షతో రగిలిపోయింది. దీంతో అమెరికా కూడా తైవాన్‌పై దాడి చేస్తే ఊరుకోనని చైనాకి స్ట్రాంగ్కి వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఇరు దేశాల మధ్య తైవాన్ విషయమై చిచ్చు మొదలైంది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ని మీడియా ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ లాగా ఆయుధాల సాయం కాకుండా యూఎస్ దళాలు తైవాన్ దేశాన్ని రక్షించడానికి ముందుకు వస్తాయా అని ప్రశ్నించిగా....దీనికి బైడెన్ చైనా దాడి చేసేందుకు రెడీ అయ్యితే కచ్చితంగా యూఎస్ దళాలు తైవాన్‌ని రక్షించేందుకు వస్తాయని నర్మగర్భంగా చెప్పారు. ఔను! తైవాన్ రక్షించుకోవమే కాకుండా తైవాన్ విషయంలో యూఎస్ తన నిబద్ధతకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. ఐతే తాము తైవాన్ స్వాతంత్య్రానికి మద్ధతు ఇవ్వలేదంటూ ఝలక్ ఇచ్చారు. అలాగే బీజింగ్‌కి సంబంధించిన చైనా వన్ పాలసీ విధానానికి వాషింగ్టన్ అధికారికంగా గుర్తించడమే కాకుండా దానికి కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఐతే తైవాన్ విషయంలో కాదని ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్2: ఆమెతో ఉన్నప్పుడూ మా అమ్మ గుర్తుకొచ్చింది.. బైడెన్ భావోద్వేగం) -
'ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. ప్రోత్సాహకాలు అందుకోండి'
బీజింగ్: జన సంఖ్య పరంగా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న చైనా.. ప్రస్తుతం జనాభా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా చేపట్టిన కట్టడి చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది యువత పెళ్లి, సంతానానికి దూరంగా ఉండిపోవటమే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ అంశం దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన చెందుతోంది డ్రాగన్ దేశం. జనాభా వృద్ధి, శ్రామిక శక్తిని పెంచేందుకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ.. భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. అందులో పన్నుల రాయితీ, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలతో పాటు నగదు రూపంలోనూ ప్రోత్సాహకాలు ఉన్నాయి. చైనాలోని జనాభాపై 2022, జనవరిలో గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే విషయాలను వెల్లడించింది. 2021 చివరి నాటికి చైనాలో 1.413 బిలియన్ల జనాభా ఉండగా.. జననాల సంఖ్య 10.62 మిలియన్లకు పడిపోయింది. అది మరణాల సంఖ్యకు సమానంగా ఉండటం గమనార్హం. ఈశాన్య నగరమైన వూహూలో జననాల రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ఇలాగే జననాల రేటు పడిపోతే.. యువకుల సంఖ్య తగ్గిపోయి కొన్నేళ్లలోనే శ్రామిక శక్తి సైతం వేగంగా పడిపోనుంది. జనాభా సంక్షోభానికి కారణమిదే.. పెరుగుతున్న జనాభాను కట్టడి చేసేందుకంటూ.. గతంలో ఒకే బిడ్డ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. దశాబ్దాలుగా బలవంతంగా అబార్షన్లు చేయించి మహిళల హక్కులను కాలరాసింది. దాంతో పిల్లల్ని కనేందుకు చాలా మంది వెనకడుగు వేయాల్సి వచ్చింది. కొన్నేళ్లలోనే అది జనాభా సంక్షోభానికి దారి తీసింది. ఈ సమస్యను గుర్తించిన చైనా.. ప్రస్తుతం ఇద్దరు, లేదా ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిస్తోంది. అంతే కాదు మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మహిళలకు.. పన్ను రాయితీలు, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, ఈ ప్రోత్సాహకాలు వివాహం జరిగిన దంపతులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు ప్రస్తుతం సామాజిక ప్రయోజనాలైన ఆరోగ్య బీమా, విద్య వంటివి పొందలేకపోతున్నారని తెలిపింది. మరోవైపు.. ఇప్పటికీ మైనారిటీలు, ఒంటరి మహిళలపై చైనా వివక్ష చూపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నాయి. కొత్త పాలసీపైనా వ్యతిరేకత.. ఆ దేశంలో మహిళలు విద్య, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధిస్తున్నా.. వివాహం విషయంలో పురుషులతో పోలిస్తే వెనకబడే ఉన్నారు. గత ఏడాది కొత్త జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది బీజింగ్. దంపతులు ముగ్గురు పిల్లలను కలిగి ఉండేందుకు అనుమతించింది. అయితే.. ఆర్థిక భారం వల్ల ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం పట్ల అక్కడి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు. -
రష్యాకు ట్రంప్ స్నేహహస్తం
వాషింగ్టన్: రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతోపాటు ‘ఒక చైనా’ పాలసీపై చర్చలు చేయనున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్యాపదేశంగా చెప్పారు. ద వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన ట్రంప్ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడవుతోంది. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేలా సైబర్ దాడులకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో రష్యాపై అమెరికా అధ్యక్షుడు ఒబామా గత నెలలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వీటిని కొంతకాలం వరకు అలాగే ఉంచుతానని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ రష్యా హింసాత్మక ఉగ్రవాదంపై పోరు వంటి తమ కీలక లక్ష్యాల సాధనకు తోడ్పడితే ఆంక్షల వంటి వాటిని ఎత్తేయవచ్చు అని ట్రంప్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ నెల 20న తాను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమవుతానని కూడా చెప్పారు. -
చైనాపై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్
వాషింగ్టన్ : చైనా అనుసరిస్తున్న విధానాలను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. వాణిజ్య విషయాల్లో బీజింగ్ మినహాయింపులు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నప్పుడు 'వన్ చైనా' పాలసీని కొనసాగించాల్సినవసరం ఏముందని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎవరిన్నీ నడిపించాల్సినవసరం లేదని దుమ్మెత్తిపోశారు. 'వన్ చైనా' పాలసీలో తైవాన్‌పై చైనా అనుసరిస్తున్న ఆధిపత్య విధానాన్ని అమెరికా 1979 నుంచి గౌరవిస్తూ వస్తోంది. కానీ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మాత్రం ఆ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. చైనా ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా ఆ పాలసీని కొనసాగిస్తున్నట్టు, ఇలా నియంతృత్వ పోకడగా ఉన్నప్పుడు దాని ఆధిపత్యంలో కొనసాగాల్సినవసరం ఏముందని ప్రశ్నించారు. చైనా ఇతర దేశాలను పట్టించుకోకుండా ఎప్పడికప్పుడూ తమ కరెన్సీని డివాల్యుయేషన్ చేస్తుందని, సరిహద్దు ప్రాంతాల్లో మనం ఆ దేశానికి పన్నులు మినహాయింపులు ఇచ్చినప్పుడు చైనా మాత్రం భారీగా పన్ను వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఉత్తరకొరియా దేశంతో చైనా సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ దేశ అధ్యక్షుడు తీసుకునే నియంతృత్వ పోకడలను మాత్రం కట్టడిచేయలేకపోతుందని ఆరోపించారు. ఇతర దేశాలకు ఏ విషయంలోనూ సాయపడని చైనాతో మనం కలిసి పనిచేయాల్సినవసరం ఏముంది? అని ప్రశ్నించారు. చైనా అమెరికాను నియంత్రణ చేయడం తమకు ఏమాత్రం ఇష్టలేదని తేల్చిచెప్పేశారు. చైనాతో సంబంధాలు దెబ్బతినేలా తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడటంపై చైనా ఇప్పటికే గరంగరంగా ఉంది. గత దశాబ్దకాలంగా ఏ అమెరికా అధ్యక్షుడు కూడా తైవానీస్ నేతలతో మాట్లాడలేదు. ట్రంప్ ఎన్నికల్లో గెలవడమే ఆ దేశ అధ్యక్షురాలితో మాట్లాడటం, తైవాన్ తమ భూభాగ ప్రాంతమని చెప్పుకుంటున్న చైనాకు ట్రంప్ చర్యలు మింగుడు పడటం లేదు. ప్రస్తుతం వన్ చైనా పాలసీని ట్రంప్ విమర్శలు చేయడం చైనాకు మరింత ప్రతికూలంగా మారనుంది.