One hundred days of the regime
-
మాటలతో మాయ చేస్తున్నారు
టీడీపీ పాలనపై వైఎస్సార్సీపీ నేత తమ్మినేని ధ్వజం హైదరాబాద్: చంద్రబాబు వంద రోజుల పాలనలో పురోగతిపై శ్వేతపత్రం విడుదల చే యాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఈ వంద రోజు ల్లో టీడీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని పే ర్కొంటూ.. తాము ఫలానా పని చేశామని అధికారపక్షం చెప్పగలదా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? అని ఆయన సవాలు విసిరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలపై మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చంద్రబాబు చెబుతుంటే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం మరోవైపు మద్యాంధ్రప్రదేశ్ అంటున్నారని విమర్శించారు. బెల్ట్‌షాపుల రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేస్తే.. యనమల మాత్రం సెప్టెంబర్ నెలాఖరు కు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ‘వ్యాట్’ వసూళ్లు రావాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ ముగిసేనాటికి రూ.2,314.20 కోట్ల మేరకు రావాల్సిన వసూళ్లు రూ.1,805.13 కోట్లకే ఎందుకు పరిమితమయ్యాయని యనమల ప్రశ్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం తగ్గడానికి వీల్లేదని మంత్రి తాఖీ దులిచ్చారని అన్నారు. మద్యం నుంచి వచ్చే ఆదాయమే ఖజానాకు శరణ్యమని మంత్రి చెప్ప డం ప్రజలను ఫుల్లుగా తాగండని సందేశమివ్వడమేనన్నారు. బాబు గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఇలాగే ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించా రన్నారు. 2003 జనవరిలోనే 40 వేలకుపైగా బెల్ట్‌షాపులుండేవి. ఇపుడు మళ్లీ అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ఆదాయాన్ని సమీక్షిస్తూ పెంచుకునే యత్నం చేస్తున్నారన్నారు. రైతుల రుణమాఫీ గురించి ఎన్నికల్లో చెప్పిందొకటి, ఇపుడు చేస్తున్నది మరొకటని, ఆర్బీఐ గురించిగానీ, కోట య్య కమిటీ వేస్తామనిగానీ అపుడు చెప్పలేదని అన్నారు. రుణమాఫీ కోసం సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఓ సంస్థను ఏర్పాటు చే యడమెందుకు? రుణాలన్నీ కట్టేయమని చంద్రబాబు ఒక్కమాట చెబితే చాలు ఆయనే చెల్లిస్తారని సలహాఇచ్చారు. -
వంచనకు ‘వంద
సాక్షి ప్రతినిధి, గుంటూరు షరా మామూలే! తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. అటు ప్రజలకు, ఇటు పార్టీ కేడర్‌కు నిరాశ కలిగిం చింది. ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త మాట చెబుతూ ఇంకా ప్రజలను నమ్మించే యత్నంలోనే ఉన్నారు. ‘ఇదే చివరి ఎన్నిక...ఇప్పుడు అధికారంలోకి రాకపోతే పార్టీయే ఉండద’ని కేడర్‌ను రెచ్చగొట్టి సీఎం అయిన తరువాత వారికి ఉప యోగపడే నిర్ణయం ఒక్కటీ తీసుకోలేదు. ప్రభుత్వ కార్యాలయా ల్లో కూడా పనులు కావడం లేదనే బాధను ఆ పార్టీ కేడర్ వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది జూన్ ఎనిమిదవ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గ్రౌండ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ఐదు సంతకాల్లో ఒక్క దానిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. రుణమాఫీ ప్రకటన కారణంగా రైతులు రెండు విధాలుగా నష్టపో యారు. జిల్లాలో 11 లక్షల 78 వేల మంది రైతులు వివిధ వాణిజ్య బ్యాంకుల్లో రూ.8,598 కోట్లను పంట, బంగారు రుణాలను తీసుకున్నారు. ఎన్నికల సమయంలో షరతులు లేకుండా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే రూ.1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని చెబుతూ అందులోనూ అనేక నిబంధనలు విధిస్తుండటంతో రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో రూ.1400 కోట్లను రుణాలుగా తీసుకున్న 71,418 గ్రూపులు ఆ పార్టీ గెలుపు కోసం ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రయత్నించాయి. ఆ తరువాత మహిళల రుణాలపై స్పష్టమైన ఉత్తర్వులు రాకపోవడంతో సభ్యులు నిత్యం ఏదో గ్రామంలో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన తొలి హామీ ‘ఇంటికో ఉద్యోగం’ను నిలబెట్టుకోలేకపోయారనే అభిప్రాయం వెలువడుతోంది. టీడీపీ ప్రభుత్వం తరచూ మాట మారుస్తున్న వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన బాబు విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుందని ప్రకటించారు. ఆ తరువాత విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఉంటుందని వెల్లడించారు. జాబు కావాలంటే బాబు రావాలనే ప్రచారాన్ని యువకుల్లోకి తీసుకు వెళ్లిన టీడీపీ నేతలకు తాజా పరిస్థితి మింగుడు పడటం లేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న 800 మందిని కొత్త ప్రభుత్వం తొలగించింది. పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ ఆ నిధులను బాబు కొత్త పథకాలకు మళ్లిస్తూ మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తాము ప్రతిపక్షంలో ఉన్నామో అధికారంలోకి వచ్చామో అర్థం కావడం లేదని టీడీపీ కేడర్ సైతం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పని కూడా కావడం లేదని, బాబు గెలుపు కోసం ఇల్లు గుల్ల చేసుకున్నామనే ఆవేదన పార్టీ కేడర్ నుంచి వినపడుతోంది. ఇంత వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభించ లేదు. దేవాదాయశాఖకు చెందిన కమిటీల రద్దుపై కోర్టు స్టే ఇవ్వడం తో, మిగిలిన కమిటీలకు ఇదే పరిస్థితి ఎదురవుతుందనే భయం వారిని వెన్నాడుతోంది. ఇక వృద్ధ్యాప్య, వితంతు,వికలాంగ పింఛన్ల పెంపు అమలులోకి రాకపోవడంతో పేద వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. -
మార్కెట్ల జాతరగా మోడీ ‘వంద’
ప్రజల తీర్పును మార్పు కోసం ఉపయోగించాలనే నిజమైన ఆకాంక్ష మోడీలో కనిపిస్తోంది. కానీ ఆహార, వ్యవసాయ శాఖ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే సాకుతో రైతును శిక్షిస్తోంది. ప్రభుత్వ సేకరణ ధరలను దాదాపు స్తంభింపజేయడమేగాక, ఆ విధానాన్నే రద్దు చేయాలని చూస్తోంది. సేకరణ ధరల రద్దు రైతు పాలిటి మరణ శాసనమే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వంద రోజుల పాలన భారీ మార్కెటింగ్ మేళాగా మారిన వైనాన్ని మీరు గుర్తించే ఉంటారు. ఒక ప్రభుత్వం వంద రోజుల పాలనపై బడా మీడియా సంస్థలు జాతీయ సర్వేలను నిర్వహించి, ఫలితాలను మొదటి పేజీల్లో, టీవీ తెరలపై మెరిపించడం, చర్చలను నిర్వహించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇంతవరకు పాత్రికేయ విన్యాసంగా ఉంటున్న ‘వంద రోజుల పాలన’ ఇప్పుడు మార్కెట్ల స్థాయికి చేరింది. వాలెంటైన్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డేలలాగే ముందు ముందు ఈ వంద రోజుల పాలన కూడా ఐదేళ్ల కొకసారి జరిగే మార్కెటింగ్ తంతుగా మారిపోయినా ఆశ్చర్యపోను. ఒకసారి ఇలాంటి సందర్భం మార్కెట్ల పరం అయిందంటే ఇక మారుమోగేది బడా వ్యాపార వర్గాల గొంతే. ‘బిగ్ టికెట్ రిఫార్మ్స్’ను (మౌలిక ఆర్థిక సంస్కరణలు) ప్రవేశపెట్టేలా ప్రధానిని ఒప్పించడానికి, ప్రేరేపించడానికి ఈ సందర్భమే అత్యంత అనువైనదని ఆ వర్గాలు భావించాయి. ఎగుస్తున్న స్టాక్ మార్కెట్లు వాటికి దన్నుగా ఉన్నాయి మరి. ఈ సర్వేలన్నిటినీ చూస్తే పూసల్లో దారంలా అన్నిట్లోనూ.... మౌలిక సంస్కరణలను, సబ్సిడీల తగ్గిం పును, పారిశ్రామిక రంగానికి మరిన్ని రాయితీలను, ప్రోత్సాహకాలను చౌకగా, తేలికగా భూ సేకరణను కోరడం కొట్టవచ్చినట్టు కనిపించింది. మరింకేమీ వాటికి పట్ట లేదు. మార్కెట్లను ఉత్సాహపరచని చర్యలు మొత్తంగా ఈ 100 రోజుల మార్కెటింగ్ వ్యవహారమంతా ప్రధానంగా బిగ్ టికెట్ రిఫార్మ్స్‌ను ప్రవేశపెట్టేలా ప్రధానిపై ఒత్తిడి చేయడం కోసమే సాగిందని కొన్ని పత్రికల కాలమ్స్‌లో రుజువైంది. ఈ ప్రచార దుమారం మోడీ ఆలోచనను, వైఖరిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది నాకు అనుమానమే. ఇప్పటికైతే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి, ఎంపీ నియోజకవర్గ నిధులను పాఠశాలల్లో, బహిరంగ స్థలాల్లో, ఇంటింటా వాటిని నిర్మింపజేయడానికే వినియోగించాలని ఎంపీలు, ఎంఎల్ఏలను మోడీ కోరారు. మార్కెట్లలో అదేమీ ఉత్సాహాన్ని రేకెత్తింపజేసేది కాదు. భారతదేశ ఆహార భద్రత పరిరక్షణకు శాశ్వత పరిష్కారాన్ని చూపే వరకు వాణిజ్య సౌలభ్య ఒప్పందంపై సంతకాలు చేసేది లేదంటూ ప్రధాని ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం కూడా విపణి విధానాల వకాలతుదారులకు మింగుడు పడేది కాదు. ‘‘అంతర్జాతీయ, జాతీయ మీడి యాలో ఈ నిర్ణయం పట్ల విమర్శ ఎదురు కావచ్చు. కానీ రైతాంగం జీవనోపాధి విషయంలో దేశం రాజీపడజాలదు’’ అని మోడీ అన్న తీరు నచ్చింది. ఆయనకు ముంద టి ప్రధానులెవరూ అంతర్జాతీయ వాణిజ్య సమాజాన్ని ఉద్దేశించి అంత శక్తివంతమైన ప్రకటనను ఇవ్వలేదని నా అభిప్రాయం. క్రమశిక్షణ, పని సంస్కృతి వంద రోజుల పాలనను అంచనా కట్టడంపై పలు టీవీ చర్చల్లో ఒక విషయం నొక్కి చెప్పాను. అది ప్రధాని నిర్ణయాత్మక పాత్రను పోషించిన ఫలితంగా ఫలితాలు కనిపిస్తున్న అంశమది. మోడీ మంత్రివర్గ సహచరుల క్రమశిక్షణ, పని సంస్కృతి ప్రభుత్వ యంత్రాంగంలోకి కూడా వ్యాపిస్తోంది. ఇదేమీ చిన్న విజయం కాదు. ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారు, ఏళ్ల తరబడి చేస్తున్నట్టు ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నిధులను వృథా చేయడం లేదు. ఈ పని సంస్కృతి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విస్తరించేట్టయితే తప్పకుండా ఆ తేడా తెలుస్తుంది. ప్రభుత్వాధికారులు నవ్వు మొహంతో ఆహ్వానించి, తక్షణమే మన ప్రశ్నలకు జవాబు చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రజలు తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మార్పు కోసం ఉపయోగించాలనే నిజమైన ఆకాంక్ష మోడీలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ మార్పును తీసుకురావాల్సింది మాత్రం సామాజిక, పర్యావరణపరమైన కల్లోలాల మూల్యాన్ని చెల్లించడం ద్వారా మాత్రం కాదు. రైతుకు శిక్షే ధరల నియంత్రణా? ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాంశం. దానర్థం ఎక్కువ ఉత్పత్తి చేసినందుకు రైతాంగాన్ని శిక్షించడం కాదు. ద్రవ్యోల్బణాన్ని అల్ప స్థాయిలో ఉంచే సాకుతో ఆహార, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సేకరణ ధరలపై విరుచుకుపడింది. ప్రభుత్వోద్యోగులు 107 శాతం కరువు భత్యాన్ని అందుకుంటున్న ఈ ఏడాది... సేకరణ ధరలను దాదాపు గత ఏడాది స్థాయిలోనే స్తంభింపజేసి రైతాంగాన్ని శిక్షించింది. అంతకు మించి, సేకరణ ధరలపై బోనస్‌ను ఇవ్వరాదని, ఇచ్చిన రాష్ట్రాల్లో కేంద్రం సేకరణ నుండి ఉపసంహరించుకుంటుందని ఆహార శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు తాఖీదును జారీ చేసింది. ఈ ఆదేశాలు ఒక విధంగా చెప్పాలంటే... రైతులకు అధిక సేకరణ ధరలను ఇస్తామంటూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడమే. కొత్త సీసాలో పాత సారా జన్యుమార్పిడి పంటలకు మౌన అంగీకారం, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలను కూడా పునఃసమీక్షించాల్సి ఉంది. ఒక వంక రైతులకు రక్షణ కల్పించడం పేరిట డబ్ల్యూటీఓ నిబంధనలను వ్యతిరేకించడ మూ, మరోవంక మార్కెట్లకు స్వయంప్రత్తినిచ్చే సరళీకరణ చర్యలను చేపట్టడమూ ప్రభుత్వం ఒకేసారి చేయజాలదు. ప్రభుత్వ సేకరణ ధరల రద్దు అంటే రైతాంగం పాలిటి మరణ శాసనమే. కానీ ప్రభుత్వం ఆ పనిచేయాలని అమితాసక్తిని కనబరుస్తున్నట్టు అనిపిస్తోంది. గత పదేళ్ల కాంగ్రెస్ దుష్పరి పాలనలో ఆర్థిక సలహాదారులుగా వెలిగిన వారే నేడు మళ్లీ రంగ ప్రవేశం చేసి మోడీ ప్రభుత్వానికి సలహాలిస్తుండటమే అందుకు ప్రధాన కారణం. నేటి ఈ సంక్షోభానికి కారణమైన వాళ్లే పరిష్కారాన్ని కూడా చూపగలరని ఆశించరాదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. ‘‘దుష్ఫలితాలు శూన్యం’’ బుట్టదాఖలు ఎర్రకోట నుండి ప్రధాని ప్రశంసనీయమైన ఒక వాగ్దానం చేశారు. మన దేశాన్ని వస్తు తయారీ కేంద్రంగా మార్చాలని ఆకాంక్షిస్తూ ఆయన ‘‘లోపాలు శూన్యం, దుష్ఫలితాలు శూన్యం’’ అనే విధానం పట్ల అనుకూలతను వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవుల విధ్వంసాన్ని అనుమతించేది లేదని ఆ విధానం సారం. కానీ పర్యావరణం, అడవుల శాఖ సరిగ్గా అందుకు విరుద్ధంగా పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేస్తోంది. సున్నితమైన జీవావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ కనుమలను గనుల తవ్వకాలకు, ఇతర హానికరమైన పరిశ్రమలకు దూరంగా ఉంచాలన్న మాధవ్ గాడ్గిల్ నివేదికను తిరస్కరించింది. అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టాలను నీరు గార్చడానికి అది ప్రయత్నిస్తోంది. ఇది ‘‘దుష్ఫలితాలు శూన్యం’’ విధానాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే. మార్కెట్లు ఈ సమస్యల గురించి ఎప్పుడూ నోరెత్తవు. కారణం స్వయం విదితమే. పర్యావరణ నిబంధనలు వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయని వాటి భావన. దేశం సామాజిక, పర్యావరణ పరమైన దుష్ఫలితాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రధాన స్రవంతి మీడియా ఎన్నడూ మాట్లడక పోవడం అందుకే. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వ పాలనపై చర్చనంతటినీ మార్కెటింగ్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకోవడం నాకు చికాకు పుట్టిస్తోంది. అభివృద్ధి ప్రజానుకూలమైనదిగా లైంగిక న్యాయాన్ని కల్పించేదిగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉండేలా ప్రధాని హామీని కల్పిస్తారని భావిస్తున్నాను. ఈ విషయంలో రాజీకి తావే లేదు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) - దేవేందర్ శర్మ -
కేసీఆర్ వందరోజుల పాలనలో నిరాశే
ఏ ఒక్క హామీపైనా క్లారిటీ రాలేదు శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్ నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వంద రోజుల పాలన పూర్తిగా నిరాశనే మిగిల్చిందని శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీపైనా క్లారిటీ రాలేదని విమర్శించారు. మంగళవారం నిజామాబాద్‌లోని మున్నూరుకాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుపై ఇంకొంత కాలం వేచి చూస్తామన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి, రెండు పడక గదులతో పక్కా ఇళ్ల నిర్మాణం, రూ. లక్ష వరకు రుణమాఫీ, ఏడు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ తదితర హామీలన్నీ, వంద రోజులు గడుస్తున్నా కనీసం మొగ్గ తొడగలేదన్నారు. ఎన్నికల హామీలన్నీ తుంగలో తొక్కి, తెలంగాణలోని మూడు ప్రాంతాలను ‘సింగపూర్’లా అభివృద్ధి చేస్తానని అమాయక ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మార్పు అధిష్టానం ఇష్టం మెదక్ ఉప ఎన్నికలకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం లేదని డీఎస్ చెప్పారు. కొత్త కమిటీ వేయాలనుకున్నా, పాత కమిటీనే కొ నసాగించాలనుకున్నా అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గుర్తించారు. కానీ, కేసీఆర్‌ను సీఎంగా చూడాలనుకున్నారు.’ అని డీఎస్ పేర్కొన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి తీరతారన్నారు. పోలవరంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్న కేసీఆర్ కాలయాపన చేశారన్నారు. భయాందోళనకు గురిచేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బలం పెంచుకోవాలని చూడటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. -
తుగ్లక్ పాలన... హిట్లర్ పోకడ
కేసీఆర్ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ విమర్శలు హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వంద రోజుల పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో తుగ్లక్‌ను, నిరంకుశత్వంలో హిట్లర్‌ను తలపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మంగళవారం శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్లతో కలసి మీడియాతో మాట్లాడారు. అబద్దాల్లో గోబెల్స్‌ను, తప్పుల్లో శిశుపాలుడిని, నిర్లక్ష్యంలో రోమ్ చక్రవర్తిని మొత్తంగా కుంభకర్ణుడి వారసుడిగా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ‘బంగా రు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ అందుకు భిన్నంగా రైతుల ఆత్మహత్యల, కరవు, వరదలు, కరెంటు లేని చీకటి తెలంగాణగా మార్చిండు. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు ఉన్న వాటి కి కత్తెర్లు వే స్తూ ప్రజలకు నరకం చూపిస్తుండు’అని ఆయన విమర్శించారు. అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చినప్పటికీ వారి కుటుంబాలను ఆదుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎండుగడుతుందనే భయంతో కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాయకులకు ఆశచూపి వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో విసిగిపోయి న ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ వంద రోజుల పాలనలో వైఫల్యాలపై టీపీసీసీ రూపొందించిన కరపత్రాన్ని పొన్నాల ఆవిష్కరించారు. రుణమాఫీ, సీఎం పదవి, 24 గంటల కరెంట్ సరఫరా, ఉద్యోగులకు ఆప్షన్లు వంటి ప్రధాన హామీలపై కేసీఆర్ ఎలా మాటమార్చారనే అంశాలపై ఎన్నికలకు ముందు, తరువాత కేసీఆర్ చేసిన ప్రసంగాలతో రూపొందించిన వీడియో దృశ్యాలను సమావేశంలో ప్రదర్శించారు. దీంతోపాటు షబ్బీర్‌అలీ ‘టీఆర్ఎస్ వంద రోజుల తప్పుడు పాలన’ పేరుతో ఆంగ్లంలో రూపొందించిన కరపత్రాన్నీ పొన్నాల విడుదల చేశారు. ఏ ఒక్క అంశంపై స్పష్టత లేదు: చాడ సీఎం కేసీఆర్ వంద రోజుల పాలన మూడడుగులు ముందు కు.. రెండడుగులు వెనక్కు.. అన్న చందంగా ఉందని తెలంగా ణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 43 అంశాలను గురించి ప్రకటించినా ఒక్క దానిపై కూడా స్పష్టత లేదనీ, అన్నింటినీ అమలుచేయాలని కోరారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజుల విషయంలో వెం టనే స్పష్టతనివ్వాలని, లేనిపక్షంలో వీరు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతాయన్నారు. మంగళవారం మఖ్దూం భవన్లో పార్టీ నాయకులు సిద్ధి వెంకటే శ్వర్లు, కందిమళ్ల ప్రతాపరెడ్డి, డాక్టర్ డి.సుధాకర్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాల సందర్భంగా.. ప్రజానాట్యమండలి రూపొందించిన ‘వీర తెలంగాణ పోరుపాటలు’ సీడీని చాడ ఆవిష్కరించారు.