One rupee notes
-
రూ.5 నోట్లు చలామణీలో ఉన్నాయా.. రూ.10 నాణేలు ఎందుకు తీసుకోరు?
సాక్షి, హైదరాబాద్: రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లు చూసి చాలా కాలమైంది కదూ.. అవసలు చలామణీలో ఉన్నాయా? అనే అనుమానం కూడా కలుగుతోంది కదూ.. కానీ ఉన్నాయి. అధికారికంగా చలామణీలో ఉన్నాయి. కానీ ఆ నోట్లు ఇవ్వడం కానీ, పుచ్చుకో వడం కానీ దాదాపుగా జరగటం లేదు. చెల్లుబాటు జరగ డం లేదనే ప్రచారం, నిబంధనలు తెలియకపోవడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆ దిశగా అవగాహన కల్పించకపోవడం వల్ల..విలువైన నోట్లు ఎందుకూ కొరగానివన్నట్టుగా మారుతున్నాయి. కానీ ఒకప్పుడు అవే రా జ్యమేలాయంటే అతిశయోక్తి కాదు. 1983–84 సంవత్సరంలో 100 రూపాయల నోట్ల కన్నా 1, 2, 5 రూపాయల నోట్లే ఎక్కువ సంఖ్యలో చలామణి అయ్యాయి. క్రమంగా ఇవి తగ్గుతూ వచ్చినా ఇప్పటికీ.. అంటే 2021– 22 నాటికి కూడా రూ.వందల కోట్ల విలువైన ఈ నోట్లు ఇంకా అధికారికంగా చలామణిలోనే ఉండడం విశేషం. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన భారత ఆర్థిక గణాంకాల నివేదిక (ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్) 2021–22 ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాణేలు కూడా.. ప్రస్తుతం 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇందులో 1, 2, 5 రూపాయల నాణేలకు ఇప్పటికీ విలువ ఉంది. వీటిని ప్రజలు పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు. కానీ, 10, 20 రూపాయల నాణేలను మాత్రం ప్రజలు అంగీకరించడం లేదు. అక్కడక్కడా రూ.20 నాణేల పరస్పర మార్పిడి జరుగుతున్నా, రూ.10 కాయిన్ ఇస్తే మాత్రం చెల్లదని తిరిగి ఇచ్చేస్తున్నారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ మార్కెట్లో రూ.5,404 కోట్ల విలువైన 10 రూపాయల నాణేలు, రూ.674 కోట్ల విలువైన 20 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు నోట్లు, నాణేల చలామణి ఇలా.. ►1983–84లో రూ.198 కోట్ల రూపాయి నోట్లు చలామణిలో ఉంటే ప్రస్తుతం రూ.382 కోట్లు మార్కెట్లో ఉన్నాయి. ►1983–84లో రూ.450 కోట్ల రెండు రూపాయల నోట్లుంటే ఇప్పుడు అవి రూ.853 కోట్లకు చేరాయి. ►రూపాయి నాణేలు 1983–84లో రూ.303 కోట్లు ముద్రించగా, ఇప్పుడు మార్కెట్లో రూ.4,777 కోట్లు ఉన్నాయి. ►2021–22లో రూ.6,816 కోట్ల విలువైన రెండు రూపాయల నాణేలు, రూ.9,217 కోట్ల విలువైన ఐదు రూపాయల నాణేలు, రూ.5,404 కోట్ల విలువైన 10 రూపాయల నాణేలు, రూ.674 కోట్ల విలువైన 20 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. ►ప్రస్తుత బహిరంగ మార్కెట్లో రూ.3,431 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు, రూ.27,805 కోట్ల పది రూపాయల నోట్లు, రూ.22,026 కోట్ల 20 రూపాయల నోట్లు, రూ.43,571 కోట్ల విలువైన 50 రూపాయల నోట్లు ఉన్నాయి. ►1987–88 నుంచి అమల్లోకి వచ్చినప్పుడు బహిరంగ మార్కెట్లో రూ.180 కోట్ల విలువైన రూ.500 నోట్లుంటే 2021–22 నాటికి రూ.22,77,340 కోట్ల విలువైన నోట్లను ముద్రించాల్సి వచ్చింది. ►రూ.100 నోట్ల విషయానికి వస్తే 1983–84లో రూ.11,690 కోట్ల విలువైన నోట్లు ఉంటే ఇప్పుడు రూ.1,81,421 కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. లక్ష కోట్లకు పైగా రూ.200 నోట్లు ఉన్నాయి. ►వెయ్యి రూపాయల నోట్లను 2000–01 సంవత్సరంలో వాడుకలోకి తెచ్చినప్పుడు 3,719 కోట్ల నోట్లను ముద్రిస్తే పెద్ద నోట్ల రద్దు సమయానికి (2018–19) వాటి విలువ 6,610 కోట్లకు చేరింది. ►ఇక, రెండు వేల రూపాయల నోట్ల విషయానికి వస్తే వాడుకలోకి వచ్చిన 2016–17లో 6.57 లక్షల కోట్ల విలువైన నోట్లను ముద్రించారు. నాణేలు.. నగరం నాణేల ముద్రణతో భాగ్యనగరానికి అవినాభావ సంబంధముంది. నిజాం కాలంలో సైఫాబాద్‌లో మింట్ కాంపౌండ్‌ను ప్రారంభించారు. ఈ మింట్ 1997 వరకు ఇక్కడ కొనసాగినా.. ఆ తర్వాత దీన్ని చర్లపల్లికి తరలించారు. ప్రస్తుతం చర్లపల్లిలో నాణేల ముద్రణ సాగుతోంది. (క్లిక్: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..) -
శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా?
మనలో చాలా మందికి ఒక రూపాయి నోటు, ఐదు, పది, 20,50, 100, 200, 500, 2000 రూపాయి నోటు గురుంచి తెలుసు కానీ, మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న "జీరో రూపాయి నోట్" గురుంచి చాలా మందికి తెలియదు. అసలు ఈ నోటుకు ఉన్న శక్తి గురుంచి చాలా మందికి తెలియదు అని చెప్పుకోవాలి. అసలు ఇది ఎక్కడ లభిస్తుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అవినీతి ఇప్పటికీ జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అధికారులను ఎదిరించలేక వారు అడిగిన ఎంతో కొంత మొత్తం ప్రజలు ఇస్తూ వస్తున్నారు. మన దేశంలో లంచం అడగడం, ఇవ్వడం రెండూ కూడా చట్ట ప్రకారం నేరం. అమెరికాలో జాబ్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఎన్నారై ఆనంద్ మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అవినీతిని చూసి ఏదైనా చేయాలని అనుకున్నాడు. అవినీతిని తొలిగించడానికి ఏమి చేయాలో ఆలోచించిన విజయ్ ఆనంద్ దేశంలో అవినీతిపై పోరాడాలనే ఏకైక ఉద్దేశ్యంతో 2006లో 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. జీరో రూపాయి నోట్ ప్రధాన ఉద్దేశ్యం ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల(శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, పత్రికా)ను దాటి మెరుగైన సమాజం, అవినీతి రహిత పాలనా వ్యవస్థ కోసం కృషి చేస్తున్న ప్రజల కోసం 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. 2007లో విజయ్ సమాజంలో అవినీతి నిర్మూలించడానికి ది "జీరో రూపాయి నోట్" అనే ఒక కాన్సెప్ట్ ను ముందుకు తీసుకువచ్చాడు. జీరో రూపాయి నోట్లు సామాన్యులకు సాధికారత కల్పించడానికి ముద్రించబడ్డాయి. అవినీతి చేత ఎక్కువగా బాధపడేవారు, తరచుగా అవినీతి అధికారులచే అణచివేయబడేవారు అధికారంలో ఉన్నవారికి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పడం, తాము కోల్పోవడానికి ఏమీ లేదని అవినీతి అధికారులకు తెలియజేయడం, వారు పోరాటంలో ఒంటరిగా లేరని చెప్పడం ఈ నోట్ ప్రధాన ఉద్దేశ్యం. 30 లక్షల నోట్ల పంపిణీ 5వ పిల్లర్ వాలంటీర్ల సహాయంతో దీని గురుంచి అవగాహన కలిగించడానికి స్థానిక మార్కెట్ ప్రదేశాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో జీరో రూపాయి నోట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. వారు కరపత్రాలతో పాటు నోట్లను పంపిణీ చేస్తూ వివిధ ప్రదేశాలలో సమాచార డెస్క్ లను ఏర్పాటు చేశారు. 5th పిల్లర్ సంస్థ 30 లక్షల నోట్లను 2007 నుంచి 2014 వరకూ ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చింది. ఈ నోట్లను మొదటిసారి చెన్నైలోని డొమెస్టిక్ విమానాశ్రయంలో ఉపయోగించారు. అక్కడ విజయవంతం కావడంతో తమిళంతో పాటూ… తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నోట్లను ప్రింట్ చేస్తున్నారు. ఒక్క భారత్ లోనే కాదు ఈ ఫిఫ్త్ పిల్లర్ సంస్థ మెక్సికో, నేపాల్ వంటి దేశాల్లో కూడా జీరో నోట్లను ముద్రించి ఇస్తోంది. 2020లో మన దేశంలో అవినీతి ఏ రేంజ్ లో ఉంది అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం జరిపించగా.. సంవత్సరానికి రూ.490 కోట్ల అవినీతి జరుగుతోందని తేలింది. ఒకవేల మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే జీరో రూపాయి నోట్ చూపించాలని పేర్కొన్నాడు. ఈ నోటు చూపించక కూడా మీతో అతను ప్రతిఘటిస్తే ఈ నోట్లను ఇవ్వండి అని కోరుతున్నారు ఆనంద్. వీటిని ఇచ్చే ముందు నోట్ వెనుక సూచించిన చిరునామాను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. ఇలా సమాచారం ఇచ్చిన తర్వాత అతని లంచావతారం సంగతి అధికారులు చూసుకుంటారని ఆనంద్ చెబుతున్నారు. దేశంలోని ప్రతి అణచివేతకు గురైన భారతీయుడు, అవినీతి అధికారికి జీరో రూపాయి నోటు చేరేలా చూడాలని 5వ పిల్లర్ కోరింది. ఇది ఖచ్చితమైన అహింసాత్మక ఆయుధం, అవినీతిపరులను ఆత్మపరిశీలన చేసుకోవడానికి సరైన మార్గం అని ఆనంద్ అన్నారు. ఎవరికైనా ఈ నోట్లు కావాలంటే ఈ సంస్థ వెబ్సైట్ (https://5thpillar.org)లోకి వెళ్లి డౌన్లోడ్చేసుకోవచ్చు. చేయి చేయి కలుపుదాం.. మనదేశంలో అవినీతిని రహిత సమాజాన్ని నిర్మిద్దాం. -
కొత్త రూపాయి నోటు వచ్చిందోచ్
కడప కోటిరెడ్డి సర్కిల్: రూపాయి నోట్లు ఇంతకు ముందు నుంచే ఉన్నాయి. ఇదేమి కొత్తగా చెబుతున్నారనే కదా! మీ సందేహం.. అవునవును కొత్త సంగతే మ రి. కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో మొదట రూ.2000 నోట్లను, తరువాత రూ.500 నోట్లను విడుదల చేసింది. కరెన్సీ వాడకంపై కఠిన నిబంధనలు విధించడంతో ప్రజలకు చిల్లర సమస్యలు వచ్చాయి. చిల్లర కొరతను అధిగమించడానికి దాదాపు 10 నెలల అనంతరం రిజర్వ్ బ్యాంకు రూ.200 నోట్లను విడుదల చేసింది. అయినా ఇంకా చిల్లర సమస్య తీరలేదు. ఈ క్రమంలో తాజాగా ఒక్క రూపాయి నోట్లను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. వారం క్రితం విడుదలైన ఈ నోట్లు కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా ఇతర బ్యాంకుల్లోకి రాలేదు. మార్కెట్లో వీటిని ఇస్తుంటే వ్యాపారులు రూపాయికి ఏమి వస్తుందని హేళన చేస్తున్నారని పలువురు అంటున్నారు. రూపాయి విలువతో కొనుగోలు చేసే వస్తువులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు దాదాపు రూపాయి నోటును చాలా కాలం కిందట మరచిపోయారు. బస్సుల్లో చార్జీగాను, టీ దుకాణాల్లో మాత్రమే చాలా వరకు రూపాయి, రెండు రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. విలువ లేని రూపాయికి.. కొత్త రూపాయి నోట్లు విడుదల చేయడం వల్ల ఒరిగేదేముందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
ఒక్క రూపాయి నోట్లపై ఆర్బీఐ క్లారిటీ
పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త కొత్త నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతోంది. తాజాగా కొత్త రూపాయి నోట్లను త్వరలోనే చలామణిలోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ నోట్లను ప్రింటింగ్ ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్న ఆర్బీఐ, ఈ నోట్ల వివరాలను మంగళవారం పేర్కొంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ నోట్లు ఇప్పటికే ప్రింట్ అయ్యాయని ఆర్బీఐ తెలిపింది. కాయినేజ్ యాక్ట్ 2011 కింద వీటిని లీగల్ టెండర్ గా ప్రవేశపెట్టనున్నట్టు సెంట్రల్ బ్యాంకు చెప్పింది.. ఈ కొత్త నోట్లు వల్ల ప్రస్తుతం చలామణిలో ఉన్న రూపాయి నోట్లపై ఎలాంటి ప్రభావముండదని, అవి కూడా లీగల్ టెండర్ గానే కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.. కొత్త రూపాయి నోట్లకు సంబంధించిన ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. డినామినేషన్ ఆఫ్ నోట్ : ఒక్క రూపాయి కరెన్సీ నోట్ ఆకారం, సైజు : దీర్ఘచతురస్రాకారం 9.7 x 6.3 సెంటీమీటర్స్ పేపర్ కంపోజిషన్ : ఏ) 100 శాతం (పత్తి) రాంగ్ కంటెంట్ బీ) పేపర్ బరువు : 90జీఎస్ఎం( గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) సీ) పేపర్ థింక్ నెస్: 110 మైక్రోన్స్ మల్టిటోనల్ వాటర్ మార్క్స్ : 1) 'సత్యమేవ జయతే' పదాలు లేకుండా విండోలో అశోకా పిల్లర్ 2) సెంటర్ లో హిడెన్ నెంబర్ '1' 3) కుడి చేతివైపు నిలువుగా అరేంజ్ చేసిన 'భారత్' అనే పదాన్ని దాగి ఉంటుంది.