ఒక్క రూపాయి నోట్లపై ఆర్బీఐ క్లారిటీ
ఒక్క రూపాయి నోట్లపై ఆర్బీఐ క్లారిటీ
Published Tue, May 30 2017 6:16 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త కొత్త నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతోంది. తాజాగా కొత్త రూపాయి నోట్లను త్వరలోనే చలామణిలోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ నోట్లను ప్రింటింగ్ ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్న ఆర్బీఐ, ఈ నోట్ల వివరాలను మంగళవారం పేర్కొంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ నోట్లు ఇప్పటికే ప్రింట్ అయ్యాయని ఆర్బీఐ తెలిపింది. కాయినేజ్ యాక్ట్ 2011 కింద వీటిని లీగల్ టెండర్ గా ప్రవేశపెట్టనున్నట్టు సెంట్రల్ బ్యాంకు చెప్పింది.. ఈ కొత్త నోట్లు వల్ల ప్రస్తుతం చలామణిలో ఉన్న రూపాయి నోట్లపై ఎలాంటి ప్రభావముండదని, అవి కూడా లీగల్ టెండర్ గానే కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.. కొత్త రూపాయి నోట్లకు సంబంధించిన ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
డినామినేషన్ ఆఫ్ నోట్ : ఒక్క రూపాయి కరెన్సీ నోట్
ఆకారం, సైజు : దీర్ఘచతురస్రాకారం 9.7 x 6.3 సెంటీమీటర్స్
పేపర్ కంపోజిషన్ : ఏ) 100 శాతం (పత్తి) రాంగ్ కంటెంట్
బీ) పేపర్ బరువు : 90జీఎస్ఎం( గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్)
సీ) పేపర్ థింక్ నెస్: 110 మైక్రోన్స్
మల్టిటోనల్ వాటర్ మార్క్స్ :
1) 'సత్యమేవ జయతే' పదాలు లేకుండా విండోలో అశోకా పిల్లర్
2) సెంటర్ లో హిడెన్ నెంబర్ '1'
3) కుడి చేతివైపు నిలువుగా అరేంజ్ చేసిన 'భారత్' అనే పదాన్ని దాగి ఉంటుంది.
Advertisement
Advertisement