One Side Love
-
వన్ సైడ్ లవ్: ప్రేమించిన యువతిని హత్య
తిరువొత్తియూర్: ప్రేమించిన యువతిని తనకిచ్చి వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు తిరస్కరించడంతో నిద్రపోతున్న యువతిపై బండరాయి వేసి ఓ యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన తంజై జిల్లాలో చోటుచేసుకుంది. తంజై జిల్లా పట్టుకోట్టైకి చెందిన పాండ్యన్ కుమార్తె మౌనిక (18). తిరువారూర్ జిల్లా ముత్తుపేట పట్టణ పంచాయతీకి చెందిన ప్రాంతంలో ఉన్న అవ్వ రాజకుమారి ఇంటిలో ఉంటూ తిరుచ్చిలో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో మౌనిక బంధువు అయిన ముత్తుపేట తిరుకలూర్ గ్రామానికి చెందిన శివ శంకర్ (28). ఇతను మౌనికను వన్ సైడ్ లవ్ చేసినట్లు తెలిసింది. మౌనికను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను కోరాడు. అందుకు వారు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం చెందిన శివశంకర్ శనివారం రాత్రి రాజకుమారి ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న మౌనికపై బండరాయి వేశాడు. మౌనిక అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు శివశంకర్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వితంతువు పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె ముందే..
భోపాల్ : వితంతువు పెళ్లికి నిరాకరించిందని ఆమె ముందే తుపాకీతో కాల్చుకొని చనిపోయాడో యువకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం జరిగింది. వివరాలు.. స్థానికంగా నివాసముండే ఓ మహిళ, భర్త చనిపోవడంతో తన కూతురితో అత్తమామల వద్ద ఉంటోంది. చిన్న వయసులోనే కొడుకు చనిపోవడంతో కోడలికి మరో పెళ్లి చేయాలని అత్తామామలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఛత్తార్పూర్కి చెందిన జితేంద్ర అనే యువకుడు ఆమెను ప్రేమిస్తూ, పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడేవాడు. కానీ ఆమెకు ఇష్టం లేకపోవడంతో అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. తిరస్కారాన్ని తట్టుకోలేకపోయిన జితేంద్ర ఆఖరుసారిగా అడిగి చూద్దామని శనివారం ఉదయం ఆమె ఉంటున్న ఇంట్లోకి వెళ్లి మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే ఎప్పటిలాగే ఆమె తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన జితేంద్ర తన వద్దనున్న తుపాకితో కణతకు గురిపెట్టి కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకి శబ్దం విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చి చూసేసరికి జితేంద్ర విగత జీవిగా పడిఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.అనంతరం స్థానికుల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు వితంతు మహిళకు మాత్రం ఎలాంటి క్లీన్చిట్ ఇవ్వలేదు. కాగా, యువకుడి వన్ సైడ్ లవ్వే ఈ ఘటనకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. -
వన్‌సైడ్ లవ్వా? మీ కోసమే..
వన్‌సైడ్ లవ్‌లో ఉన్న చాలామంది తమ ప్రేమను ఎదుటి వారికి చెప్పటానికి సతమతమవుతుంటారు. రోజులు గడుస్తున్న కొద్ది వారిలో భయం, బాధా పెరిగిపోతుంటాయి. చెప్పలేక కొంత.. ఇక చెప్పలేమోనని మరికొంత అల్లాడిపోతుంటారు. ప్రతిక్షణం బాధపడుతూ.. మనసును బాధించుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం సంగీతం ఓ ఔషదంలా పనిచేస్తుంది. కొన్ని పాటలు గుండెలోని బాధను తరిమికొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలాంటి 10 తెలుగు వన్‌సైడ్ లవ్ పాటలు మీకోసం.. మనసుకు హత్తుకునే 10 వన్‌సైడ్ లవ్ సాంగ్స్ : 1) కలలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ( నువ్వస్తావని) 2) ఏ కొమ్మకాకొమ్మ గుంగొత్త రాగం ( శ్రీను ) 3) సుస్వాగతం నవరాగమా ( సుస్వాగతం) 4) ఇంకా ఏదో.. ఇంకా ఏదో.. ( డార్లింగ్ ) 5) మనసున ఉన్నది చెప్పాలనున్నది ( ప్రియమైన నీకు) 6) ఏదో ప్రియరాగం వింటున్నా.. ( ఆర్య) 7) నీ చూపులే దీపావళి (ఎందుకంటే ప్రేమంట) 8) సుమమ్ ప్రతి సుమమ్ సుమమ్ ( మహర్షి) 9) వేయి కన్నులతో వేచి చూస్తున్నా( నీ స్నేహం) 10) చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా..( ఏప్రిల్ 1 విడుదల) లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రాణాలు తీసిన ఒన్‌సైడ్ లవ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచ్చిలో ఒన్ సైడ్ లవ్ వ్యవహారంలో అమముక కార్యదర్శి బుధవారం దారుణహత్యకు గురయ్యాడు. తిరుచ్చి మేల్‌కలండ కోట మసీదు వీధికి చెందిన ఖాదర్‌హుసేన్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇతని కుమారుడు జావిద్‌హుసేన్ (24). పొన్నమలై అమముక మైనారిటీ విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. డిప్లొమో చదువుకున్న హుసేన్ చెన్నై ఐసీఎఫ్‌లో అప్రెంటీస్‌గా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదిలాఉండగా పొన్నమలై ప్రాంతానికి చెందిన ప్లస్ ఒన్ విద్యార్థినిని ఒన్‌సైడ్ లవ్‌గా ప్రేమిస్తూ వచ్చాడు. విద్యార్థిని ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటపడుతూ ప్రేమించమని ఒత్తిడి చేసేవాడు. తన వెంట పడవవద్దని, హద్దుమీరితే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించింది. అయినా కూడా జావిద్‌హుసేన్ విద్యార్థిని వెంటపడడం మానలేదు. ఇదిలాఉండగా, బుధవారం సాయంత్రం జావిద్‌హుసేన్ పొన్నమలై ప్రాంతంలో కోడి మాంసం దుకాణానికి వెళ్లగా, మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు జావిద్తో ప్రేమ వ్యవహారంపై గొడవపడ్డారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆ ఇద్దరు యువకులు తాము తీసుకువచ్చిన కత్తితో జావిద్ హుసేన్‌పై వేటు వేశారు. వారి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు జావిద్‌హుసేన్ పరుగులు తీయగా ఇద్దరు వ్యక్తులు వెంటపడి కత్తితో నరకడంతో జావిద్‌హుసేన్ ప్రాణాలు విడిచాడు. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా హత్యకు పాల్పడింది విద్యార్థిని సోదరుడు, అతని స్నేహితుడని పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో దాగి ఉన్న విద్యార్థిని సోదరుడు కమలకన్నన్, అతని స్నేహితుడు శరవణకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
వన్ సైడ్లవ్కు ‘ధన్య’ బలి
ప్రేమోన్మాదుల కిరాతకానికి మరో అబల బలైంది. మరెంతమంది బలికావాల్సి వస్తుందో అన్న ఆందోళన రాష్ట్రంలో ఏర్పడింది. మూడు నెలల్లో ఆరుగురు హతమయ్యారు. ‘వన్ సైడ్ ప్రేమ’ వ్యవహారంలో యువకులు తనకు దక్కంది మరొకరికి దక్కకూడదన్నట్టుగా ఉన్మాదులుగా మారి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సాక్షి, చెన్నై: వన్ సైడ్ ప్రేమ పేరుతో యువతులకు వేధింపులు నానాటికి రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే యువతులకు భద్రత కరువైనట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. తమకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్న కొందరు యువత ఒడి గడుతున్న ఘాతుకాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మూడు నెలల్లో ఆరుగురు యువతులు ఒన్ సైడ్ ప్రేమకు బలి కావడం తల్లిదండ్రుల్ని కలవరంలో పడేస్తున్నాయి. నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కలకలం సృష్టిస్తే, విల్లుపురంలో నవీన ఆహుతి ఆందోళన ను రెట్టింపు చేసింది. కరూర్‌లో తరగతి గదిలో సోనాలి హత్య, విరుదాచలంలో పుష్పలత, తూత్తుకుడిలో ఫ్రాన్సీనా హత్యలు వన్ సైడ్ ప్రేమోన్మాదుల ఘాతకమే. తాజాగా, బుధవారం సాయంత్రం కోయంబత్తూరులో ధన్య(23) బలి అయింది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన దన్యను ప్రేమోన్మాది కాటేశాడు. ఈ వరుస ఘటనలతో రాష్ర్టంలో యువతులకు భద్రత ఉందా..? అన్న ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి. మరో బలి : కోయంబత్తూరు జిల్లా అన్నూర్ తెన్న పాళయం వీజీపీ మహల్‌కు చెందిన సోము, శారద దంపతుల కుమార్తె ధన్య(23). బీఎస్సీ - ఐటీ పూర్తి చేసిన ధన్య అన్నూర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేసేది. పది రోజుల క్రితం అన్నూర్‌కు చెందిన ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడు దినేష్‌తో ధన్యకు వివాహ నిశ్చయతార్థం జరిగింది. బుధవారం ఓనం పండుగ కావడంతో తనకు కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన ధన్య ఐదున్నర గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరింది. ధన్య రాగానే, ఆమె తండ్రి సోము, తల్లి శారద ఆసుపత్రికి వెళ్లారు. గంటన్నర తర్వాత ఇంటికి వచ్చిన సోము, శారద అక్కడ రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న ధన్యను చూసి రోదిస్తూ పెట్టిన కేకలు కలకలం రేపాయి. ఆ పరిసర వాసులు ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. అతి దారుణంగా ఆమె హత్యకు గురై ఉండడంతో డీఎస్పీ కృష్ణమూర్తి నేతృత్వంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లతో కూడిన విచారణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రేమోన్మాదం : ఆగమేఘాలపై మరో గంటన్నర వ్యవధిలో సాగిన విచారణతో జకీర్ అనే యువకుడి ప్రేమోన్మాదం ఈ ఘాతంగా ప్రాథమిక దర్యాప్తులు పోలీసులు తేల్చారు. అర్ధరాత్రి సమయంలో జకీర్ కోసం వేట సాగినా, పాలక్కాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ జరిపిన విచారణతో జకీర్ వన్ సైడ్ లవ్ ఉన్మాదం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ధన్యను కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెదిన అనిఫా కుమారుడు జకీర్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. ధన్య తీవ్రంగా హెచ్చరించడంతో కొన్ని నెలల క్రితం పత్తా లేకుండా పోయాడు. అతడి వేధింపుల నుంచి తాను బయట పడ్డటే అని భావించిన ధన్య, చాటుగా తనను జకీర్ తరచూ వెంటాడుతున్న విషయాన్ని గుర్తించ లేకపోయింది. ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపి మరో మారు తన ప్రేమను తెలియజేయడానికి బుధవారం జకీర్ ప్రయత్నం చేశాడు. ఉదయాన్నే ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే, ధన్య కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమాచారంతో ఉన్మాదిగా మారాడు. తనకు దక్కనిది మరొకడికి దక్కకూడదన్నట్టు ఆక్రోశంతో కిరాతకుడయ్యాడు. ఆమె ఇంటికి వచ్చే వరకు ఆ పరిసరాల్లో మాటు వేశాడు. ఇంటికి రావడం, ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లడాన్ని అదనుగా తీసుకున్నాడు. ఇంటి వెనుక వైపుగా ఉన్న గోడను దూకి,తలుపును తట్టాడు. శబ్దం విన్న ధన్య తలుపు తెరవగానే, తన చేతిలో ఉన్న రాడ్డుతో తలపైకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశాడు. అక్కడి నుంచి ఆగమేఘాలపై పాలక్కాడుకు చేరుకుని, క్రిమిసంహాకరక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ కిరాతకుడ్ని కఠినంగా శిక్షించాలని అన్నూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి?
‘ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి? నటనకు దూరం అవ్వాలి?’ అంటూ ప్రశ్నిస్తోంది నటి మీరా నందన్. వాల్మీకి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ భామ మీరానందన్. మలయాళంలో 25 చిత్రాలకు పైగా నటించి బిజీ నటిగా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ తమిళంలో చాలా తక్కువ చిత్రాలే చేసింది. కొంచెం గ్యాప్ తరువాత సండమారుతం చిత్రంలో శరత్‌కుమార్‌కు జంటగా రీఎంట్రీ అవుతోంది. ఈ సందర్భంగా నటి మీరానందన్తో చిన్న భేటీ. ప్ర: తమిళంలో చాలా గ్యాప్ రావడానికి కారణం? జ: అందరి మాదిరిగానే ఎంతో ఊహించుకుంటూ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. తొలి చిత్రమే నిరాశపరచడంతో ఊహలు తారుమారయ్యాయి. ఆ తరువాత నటించిన కొన్ని చిత్రాలు కూడా సరిగా ఆడలేదు. అందువల్ల మంచి కథ, పాత్ర, మంచి దర్శకుడు చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. అలాంటి అవకాశం రాకపోవడమే ఈ గ్యాప్‌నకు కారణం. ప్ర: దర్శకుడొకరు మిమ్మల్ని ఒన్ సైడ్ లవ్ చేస్తుండటంతోనే విరక్తి చెంది తమిళ సినిమాకు దూరమయ్యారనే ప్రచారం గురించి మీ స్పందన? జ: ఎవరో ఏదో చెప్పడానికి నేనెందుకు సీరియస్‌గా తీసుకోవాలి? ఆ విషయాన్ని నేనూ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటప్పుడు నేనెందుకు విరక్తికి గురవుతాను. ప్ర: సండమారుతం చిత్రం గురించి? జ: ఈ చిత్రంలో నేను పొల్లాచ్చి ప్రాంతంలో నివసించే మహాలక్ష్మి అనే గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. చిత్రం ప్లాష్ బ్యాక్‌లో దాదా లాంటి సర్వేశ్వర్ (శత్‌కుమార్)కు జంటగా నటిస్తున్నాను. తాను నటించిన సన్నివేశాలు పొల్లాచ్చిలో ఇటీవల చిత్రీకరించారు. షూటింగ్ చాలా జాలీగా జరిగింది. శరత్‌కుమార్ నటనకు సంబంధించి పలు టిప్స్ చెప్పి ప్రోత్సహించారు. ప్ర: మీ కంటే చాలా సీనియర్ నటుల సరసన నటించడం మీ ఇమేజ్‌కు బాధింపు ఏర్పడుతోందని భావించడంలేదా? జ: నేనలా ఎప్పుడూ ఆలోచించలేదు. తమిళంలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ దక్కించుకునే అవకాసంగా భావిస్తున్నాను. అంతేకాకుండా చిత్ర నిర్మాతలలో ఒకరైన లిస్టన్ స్టీపన్ తనకు మంచి స్నేహితుడు. ఇది మంచి కథ నువ్వు తప్పకుండా నటించాలని కోరడంతో నిరాకరించలేకపోయాను. నా వయసు వారు నా కంటే టాప్‌లో ఉన్నా వారే సీనియర్ నటులతో నటిస్తుండగా నేను నటించ కూడాదా? అంతే కాకుండా సండమారుతం చిత్ర కథలో శరత్‌కుమార్ నాకంటే చాలా పెద్ద వాడిగా నటిస్తున్నారు. నేనే మామ, మామా అంటూ ఆయన చుట్టూ తిరిగుతుంటాను. ప్ర: సరే. మీరిప్పటికీ చదువు కొనసాగిస్తున్నారట? జ: బెంగళూర్ కళాశాలలో ఎం.ఏ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నాను. నాకు ఇష్టమైన రంగం మీడియా. నేను టీవీ యాంకర్‌గా చేసి సినీ రంగానికి వచ్చాను. ప్ర: పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: 25 ఏళ్లు దాటగానే ఎదుర్కొనే ప్రశ్న ఇది. అయితే త్వరలోనే అనే బదులే ప్రస్తుతానికి చెప్పగలను. -
వన్ సైడ్ లవ్