ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి? | meera nandan acts with sarath kumar | Sakshi
Sakshi News home page

ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి?

Published Sat, Sep 6 2014 1:10 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి? - Sakshi

ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి?

‘ఎవరో ప్రేమించారని నేనెందుకు భయపడాలి? నటనకు దూరం అవ్వాలి?’ అంటూ ప్రశ్నిస్తోంది నటి మీరా నందన్. వాల్మీకి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ భామ మీరానందన్. మలయాళంలో 25 చిత్రాలకు పైగా నటించి బిజీ నటిగా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ తమిళంలో చాలా తక్కువ చిత్రాలే చేసింది. కొంచెం గ్యాప్ తరువాత సండమారుతం చిత్రంలో శరత్‌కుమార్‌కు జంటగా రీఎంట్రీ అవుతోంది. ఈ సందర్భంగా నటి మీరానందన్‌తో చిన్న భేటీ.

ప్ర: తమిళంలో చాలా గ్యాప్ రావడానికి కారణం?
 జ: అందరి మాదిరిగానే ఎంతో ఊహించుకుంటూ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. తొలి చిత్రమే నిరాశపరచడంతో ఊహలు తారుమారయ్యాయి. ఆ తరువాత నటించిన కొన్ని చిత్రాలు కూడా సరిగా ఆడలేదు. అందువల్ల మంచి కథ, పాత్ర, మంచి దర్శకుడు చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. అలాంటి అవకాశం రాకపోవడమే ఈ గ్యాప్‌నకు కారణం.
 
ప్ర: దర్శకుడొకరు మిమ్మల్ని ఒన్ సైడ్ లవ్ చేస్తుండటంతోనే విరక్తి చెంది తమిళ సినిమాకు దూరమయ్యారనే ప్రచారం గురించి మీ స్పందన?
 జ: ఎవరో ఏదో చెప్పడానికి నేనెందుకు సీరియస్‌గా తీసుకోవాలి? ఆ విషయాన్ని నేనూ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటప్పుడు నేనెందుకు విరక్తికి గురవుతాను.
 
ప్ర: సండమారుతం చిత్రం గురించి?

 జ: ఈ చిత్రంలో నేను పొల్లాచ్చి ప్రాంతంలో నివసించే మహాలక్ష్మి అనే గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. చిత్రం ప్లాష్ బ్యాక్‌లో దాదా లాంటి సర్వేశ్వర్ (శత్‌కుమార్)కు జంటగా నటిస్తున్నాను. తాను నటించిన సన్నివేశాలు పొల్లాచ్చిలో ఇటీవల చిత్రీకరించారు. షూటింగ్ చాలా జాలీగా జరిగింది. శరత్‌కుమార్ నటనకు సంబంధించి పలు టిప్స్ చెప్పి ప్రోత్సహించారు.
 
ప్ర: మీ కంటే చాలా సీనియర్ నటుల సరసన నటించడం మీ ఇమేజ్‌కు బాధింపు ఏర్పడుతోందని భావించడంలేదా?
 జ: నేనలా ఎప్పుడూ ఆలోచించలేదు. తమిళంలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ దక్కించుకునే అవకాసంగా భావిస్తున్నాను. అంతేకాకుండా చిత్ర నిర్మాతలలో ఒకరైన లిస్టన్ స్టీపన్ తనకు మంచి స్నేహితుడు. ఇది మంచి కథ నువ్వు తప్పకుండా నటించాలని కోరడంతో నిరాకరించలేకపోయాను. నా వయసు వారు నా కంటే టాప్‌లో ఉన్నా వారే సీనియర్ నటులతో నటిస్తుండగా నేను నటించ కూడాదా? అంతే కాకుండా సండమారుతం చిత్ర కథలో శరత్‌కుమార్ నాకంటే చాలా పెద్ద వాడిగా నటిస్తున్నారు. నేనే మామ, మామా అంటూ ఆయన చుట్టూ తిరిగుతుంటాను.

 ప్ర: సరే. మీరిప్పటికీ చదువు కొనసాగిస్తున్నారట?
 జ: బెంగళూర్ కళాశాలలో ఎం.ఏ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నాను. నాకు ఇష్టమైన రంగం మీడియా. నేను టీవీ యాంకర్‌గా చేసి సినీ రంగానికి వచ్చాను.
 
ప్ర: పెళ్లెప్పుడు చేసుకుంటారు?
 జ: 25 ఏళ్లు దాటగానే ఎదుర్కొనే ప్రశ్న ఇది. అయితే త్వరలోనే అనే బదులే ప్రస్తుతానికి చెప్పగలను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement