oninons price
-
ఉల్లి లొల్లి షురూ...
సాక్షి, హైదరాబాద్: వంటిట్లో ఉల్లి మరోసారి కంటినీరు తెప్పిస్తోంది. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా తయారవుతోంది. తెలంగాణ జిల్లాల నుంచి ఉల్లి దిగుమతులు ఆగిపోవడం, మహారాష్ట్ర నుంచి అనుకున్న దానికి కంటే సగం ఉల్లి మాత్రమే సరఫరా అవుతుండటం కూడా ఉల్లి ధర ఘాటెక్కేందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రెట్టింపైన ఉల్లి ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం ఉల్లి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. వర్షాలతో మార్కెట్‌కు డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో పాటు, స్థానికంగా కూడా ఉల్లి దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో నగర మార్కెట్లకు ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగాయని హోల్‌సెల్ వ్యాపారులు చెబుతున్నారు. గత వారం హోల్‌సెల్ మార్కెట్లో ఉల్లి కిలో రూ. 8 నుంచి 12 వరకు ధర పలుకుతుండగా... ప్రస్తుతం కిలో రూ. 22 నుంచి రూ. 32 వరకు పలుకుతోంది. సోమవారం నుంచి ఉల్లి నగరంలోని బోయిన్పల్లి, గుడి మల్కాపూర్, మలక్‌పేట్‌కు కర్నూలు, కర్ణాటకతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి లోకల్ ఉల్లి దిగుమతులు తగ్గాయి. దీంతో ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుంచి తగ్గిన దిగుమతులు సాధారణంగా నగర ఉల్లి అవసరాల్లో దాదాపు 60 శాతం మే మహారాష్ట్ర దిగుమతులే తీరుస్తాయి. పూణె, నాసిక్‌తోపాటు షోలాపూర్ తదితర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు రోజూ దాదాపు 60 లారీల ఉల్లి దిగుమతి అవుతుంది. మిగతా 40 శాతం కర్ణాటక, కర్నూలుతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి వస్తుంది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో చేతికి అందిన ఉల్లి నోటికి చేరలేదు. దాని ప్రభావం నగర మార్కెట్‌పై పడింది. రోజు మలక్‌పేట్ మార్కెట్‌కు 60 నుంచి 70 లారీల ఉల్లి దిగుమతి అయ్యేది. వర్షాలతో 30 నుంచి 35 లారీల ఉల్లి మాత్రమే దిగుమతి అవుతోంది. ధరల నియంత్రణకు కృషి గతంతో పోలిస్తే నగరంలో ఉల్లి వినియోగం పెరిగింది. తెలంగా ణ జిల్లాల్లో వర్షాల కారంగా ఉల్లి పంటకు నష్టం జరిగింది. స్థానికంగా ఉల్లి దిగుమతులు తగ్గా యి. లాక్డౌన్ అనంతరం ప్రతి నెల ఉల్లి వినియోగం పెరుగుతూ వస్తోంది. స్థానికంగా ఉల్లితో పాటు మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి ఉల్లి దిగుమతులు మార్కెట్‌కు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధరలు తక్కువగా ఉన్నాయి. కమీషన్ ఏజెంట్లు, హోల్‌సెల్ వ్యాపారులు ఉల్లిని నిల్వ చేయడం, లేదా కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తప్పవు. ఉల్లి ధరలు నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. – దామోదర్, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, మలక్‌పేట్ మార్కెట్ -
కొండెక్కిన ఉల్లి.. సెంచరీకి చేరువగా పరుగులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరలు చూసి సామాన్య ప్రజలు భయపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర రూ.70-80కి చేరి సెంచరీ దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకు ముందు కిలోల కొద్ది ఉల్లి కొనే వినియోగదారులు.. ప్రస్తుతం కిలో కొనాలన్న వెనకడుగేస్తున్నారు. ఇక హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధర రూ.50కి మిగించింది. కొన్ని చోట్ల రూ.60కి కూడా పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉల్లి ధరలు పెరగడానికి వర్షాలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నారని.. అందుకే ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఉల్లి ఘాటెక్కడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి నిల్వ చేసిన ప్రాంతాల నుంచి కొరత ఉన్న ప్రాంతాలకు రవాణా చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. మరోవైపు పెరిగిన ఉల్లి ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా నష్టపోయాయని ఈసారైన మద్దతు ధర లభించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఆదుకున్న అరవింద్.. అయితే ఉల్లి ధరలు ఆకాశానంటడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశారు. కేజీ ఉల్లిని ప్రభుత్వం తరఫున కేవలం రూ. 25కే చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వాహానాల ద్వారా వీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. -
దిగివస్తున్న ఉల్లి ధర
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : పది, పదిహేనురోజులుగా విపరీతంగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిన ఉల్లి ధర ప్రస్తుతం తిరోగమన బాట పట్టింది. నిన్న, మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ.4700 పైగా ఉండగా సోమవారం ఒకే రోజు రూ.3500కు పడిపోయింది. ఇది కూడా గరిష్ట ధర కావడం గమనార్హం. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా ఉల్లి వచ్చింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ఉల్లికి కొంత డిమాండ్ తగ్గడంతో ఆ ప్రభావం ధరపై పడింది. ఎక్కువ లాట్లకు రూ.3000 నుంచి రూ.3300 వరకే ధర లభించింది. రూ.4 వేలకు పైగా ధర లభిస్తుందనుకొని మార్కెట్ ఉల్లిని తరలించిన రైతులు ధర పడిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. నిజంగా ఉల్లికి డిమాండ్ తగ్గిందా? వ్యాపారుల మాయాజాలమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉల్లికి డిమాండ్ తగ్గిందని, అందువల్లే ధర తగ్గుముఖం పట్టిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రైతు బజార్లో ఉల్లి అమ్మకాలు రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించే నిమిత్తం మార్కెటింగ్ అధికారులు కర్నూలు సీక్యాంప్ రైతు బజార్లో ఉల్లిని తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన రైతు ద్వారా రెండు రకాల సరుకు(కిలో రూ.40, కిలో రూ. 30)ను అమ్మించారు. ఇలా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 క్వింటాళ్లు విక్రయించారు. రైతు బజార్లో ఉల్లి విక్రయాలు కొనసాగిస్తామని, రైతులు ముందుకు రాకపోతే మార్కెట్ యార్డు నుంచి కొనుగోలు చేసి నో లాస్, నో ప్రాఫిట్ ప్రకారం వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని మార్కెటింగ్ ఏడీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ రిటైర్డ్ జేడీ నారపురెడ్డి రైతు బజారులో స్వచ్ఛందంగా రైతులకు సేవలందిస్తున్నారు. సోమవారం ఉల్లి పంపిణీ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ హనుమంతరావు, సెక్యూరిటీ గార్డులు కూడా తమ వంతు సహకారం అందించారు.