onion cost
-
పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
ప్రతి ఏటా ఉల్లి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధరలు రూ. 10 నుంచి రూ. 20 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి ఢిల్లీలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది రూ. 100కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉల్లి ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డిమాండ్. డిమాండ్ పెరిగినప్పుడు అవసరమైనన్ని అందుబాటులో లేనప్పుడు తప్పకుండా ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా కొందరు రైతులు తమ పంటను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం వల్ల, దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఉల్లి ధరలు పెరగటానికి మరో ప్రధానమైన కారణం పంట ఆలస్యం. ఖరీఫ్ పంట ఆలస్యం వల్ల సాగులో జాప్యం ఏర్పడుతుంది. అప్పుడు చేతికి అందాల్సిన సమయానికి పంట రాకపోతే కొరత ఏర్పడుతుంది. తద్వారా ధరలు పెరుగుదల జరుగుతుంది. ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే? ఉల్లి ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఆగస్టు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి 'రోహిత్ కుమార్ సింగ్' వెల్లడించారు. ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం రిటైల్ పంపిణీని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా కేజీ ఉల్లి ధరలను రూ. 25కే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 లక్షల టన్నుల ఉల్లి స్టాక్‌ను నిర్వహిస్తోంది, రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. -
Onion Prices: మళ్లీ ఉల్లి లొల్లి షురూ..!
కొన్ని వారాల కొందట టొమాటో ధరలు ఏ స్థాయిని చేరుకున్నాయో చూశాం. కేజీ రూ.250 వరకు పలికిన వాటి ధరలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. ఇప్పుడు ఉల్లి రేట్లు పెరగడం ప్రారంభమైంది. దాంతో వీటి ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నిత్యం వంటల్లో వాడే ఉల్లి ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కిలో నాణ్యమైన ఉల్లిపాయలు రూ.40-50 మధ్య విక్రయిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్) దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ధరల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై విధించే పన్నును ఆగస్టులో 40శాతం మేర పెంచింది. ఈ పన్ను ఏడాది చివరివరకు అమలవుతుంది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠస్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు. కొన్ని చోట్లు ఉల్లిసాగు చేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో నేలకొరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దేశీయంగా ప్రతి నెలా సగటున 13లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే, నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40శాతం కోల్పోతాయి. కుళ్ళిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార ధరలు నియంత్రణలో ఉండాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ధర కేజీకి రూ.50కి మించకుండా ఉండాలని చూస్తుంది. ఈ సారి ఖరీఫ్ పంట ఆలస్యంగా చేతికి రావటంతో పాటు పంట దిగుబడి తగ్గడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను అరికట్టడానికి కేంద్రం మరింత జోక్యం చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. -
కేజీ ఉల్లి @220
రేటు చూసి మైండ్ బ్లాంక్ అయిందా? అయితే ఈ ధర మన దేశంలో కాదు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఉల్లిపాయల ధరలు మోత మోగిస్తున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా 220 రూపాయలకు అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. అనూహ్యంగా ధరలు పెరిగిపోవడంతో పలుచోట్ల వినియోగదారులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా వంటి దేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం పలు చోట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 38కే అందించే ప్రయత్నం చేస్తోంది. కాగా, తన నివాసంలో ఉల్లి వాడకంపై ప్రధాని షేక్ హసినా నిషేధం విధించారు. దీంతో శనివారం ప్రధాని నివాసంలో ఉల్లిపాయలు వాడకుండా వంటలు తయారుచేశారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు మనదేశంలోనూ ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. మేలు రకం ఉల్లి కిలో 70 రూపాయల వరకు బహిరంగ మార్కెట్ అమ్ముతున్నారు. నెల రోజులుగా ధరలు ఎక్కువగా ఉన్నా పాలకులు పట్టించుకున్నట్టు కనబడటం లేదు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఉల్లిపాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వెల్లడించారు. ధరల పెరుగులతో వినియోగదారులు కూడా తక్కువగానే కొంటున్నారని, దీంతో తమ వ్యాపారాలు మందగించాయని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలావుంచితే ఉల్లి ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈరోజు నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉల్లి ధరల గురించి ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి. Expensive Weekend Shopping. #onioncrisis #onionprice pic.twitter.com/GUQuo0fNuL — Rituparna Nath (@Rituparna_Nt) November 17, 2019 -
రికార్డు స్థాయికి ఉల్లి ధర
లాసల్గావ్లో క్వింటాలు రూ. 4,900 ఢిల్లీలో కిలో ధర రూ. 80 న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన నాసిక్(మహారాష్ట్ర)లోని లాసల్గావ్లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం అక్కడ క్వింటాలు ఉల్లి ధర రూ.4,900 పలికింది. జాతీయ ఉద్యానవన పరిశోధన, అభివృద్ధి ఫౌండేషన్(ఎన్హెచ్ఆర్డీఎఫ్) లెక్కలను అనుసరించి.. లాసల్గావ్ మార్కెట్లో క్వింటాలు ధర నిన్నటి వరకు రూ.4,500 పలుకుతుండగా.. గురువారం ఒక్కరోజే క్వింటాలుకు రూ.400 మేరకు అమాంతం పెరిగిపోయింది. గడిచిన రెండేళ్లలో లాసల్గావ్ మార్కెట్లో ఉల్లిపాయలకు పలికిన అత్యధిక ధర ఇదే. ఢిల్లీలో కిలో ధర రూ.80కి చేరింది. కొత్త పంట ఇంకా రాక సరఫరా తగ్గిపోవడమే ధరల మోతకు ప్రధాన కారణమని ఎన్హెచ్ఆర్డీఎఫ్ డెరైక్టర్ ఆర్పీ గుప్తా విశ్లేషించారు. ధరల మోతకు కారణాలు.. ♦ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కొత్త పంట రావడం మరింత జాప్యం కానుండడం. ♦ వర్షాభావ పరిస్థితుల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి భారీగా తగ్గే అవకాశం ఉంది. ♦ 2014-15 పంట సంవత్సరం(జూలై-జూన్)లో ఉల్లి దిగుబడులు 189 లక్షల టన్నులుగా అంచనా. ♦ అంతకుముందు ఏడాదిలో దిగుబడుల(194 లక్షల టన్నులు)తో పోలిస్తే ఇది ఐదు లక్షల టన్నులు తక్కువ.