online apllication
-
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
యువలోకం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ‘నేటి యువతీ, యువకులే దేశానికి మార్గనిర్దేశకులు... దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే సమర్థులను ఎన్నుకోవడంలో యువత పాత్ర కీలకంగా ఉండాలి... అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది..’ ఇదంతా అందరూ చెప్పేదే. అయితే, ఇది జరగాలంటే ఓటరుగా యువతీ, యువకులందరూ నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఈమేరకు 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు నమోదు చేయించేలా అధికారులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నారు. అవగాహన కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో అధికారులు విస్తృత ప్రచారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ పదేపదే అవకాశం కల్పిస్తున్నా యువత ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే అంశమే అయినా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కమిషన్ ఆదేశాలతో... నూతన ఓటర్ల నమోదుకు అవకాశమున్న విషయమై ప్రచారం చేయాలని ఇప్పటికే పలు సమావేశాలు, సమీక్షల ద్వారా జిల్లాలోని అధికార యంత్రాన్ని ఎన్నికల కమిషన్ అలర్ట్ చేసింది. కమిషన్ అధికారులు పలు సమీక్షల ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే ఓ వైపు ఓటర్ల జాబితాల రూపకల్పనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయడంతో పాటు నిరేర్దేశించిన షె డ్యూల్ మేరకు అక్టోబర్ 8న తుది ఓటర్ల జాబితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇం దులో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కాగా, అక్టోబర్ 4న క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. విస్తృత ప్రచారం జిల్లాలో ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులతో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ఇప్పటికే అవగాహన కల్పించారు. తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ చైతన్యపరిచి ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం బూత్ లెవల్లో, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో, ఆన్లైన్లో గానీ ఓటరుగా నమోదు చేసుకునేలా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. స్కూల్ విద్యార్థులతో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రచార రథాలను జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించగా.. బస్టాండ్లు, ఆస్పత్రులు వంటి రద్దీ ప్రాంతాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటుచేసి సిబ్బంది ద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రచారం చేస్తున్నారు. నమోదు ఇలా... 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతీ ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అర్హులు. గ్రామంలోని బూత్‌లెవెల్ అధికారి లేదా తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫారం–6 దరఖాస్తులు సమర్పించాలి. మీ సేవా కేంద్రాల్లో లేదా స్వయంగా ఆన్లైన్లో ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. -
ఇకపై పశువులకు ఆధార్
వీరపునాయునిపల్లె : ఇప్పటివరకు మనుషులకు ఉన్న ఆధార్ నెంబర్‌ను ఇకపై పశువులకు కేటాయించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. పశు సంజీవని పథకంలో భాగంగా ఆనాఫ్ పేరుతో పాడి ఆవులు, గేదెలకు 12 అంకెలతో కూడిన ట్యాగును అమర్చుతారు. ఇనాఫ్ పేరుతో మొబైల్ యాప్ కూడా రూపొందించి ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికపుడు తెలుసుకునేలా చేస్తోంది. ఆన్లైన్లో పూర్తి సమాచారం ట్యాగులోని 12 అంకెల ఆధారంగా పశువు పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ పశువు ఎపుడు ఎక్కడ పుట్టింది. ఏజాతికి చెందింది, దాని యజమాని ఎవరు, ఇంతవరకు ఎన్ని ఈతలు ఈనింది, ఎన్ని పాలు ఇస్తుంది. ఏదైనా జబ్బు చేసినపుడు చికిత్స పొందిందా..లేదా.. ఎంత విలువ చేస్తుంది. ఇలా పశువు పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ఎవరైనా పశువును కొనాలనుకుంటే దాని నెంబర్ ఆధారంగా పెద్ద శ్రమ లేకుండా ఆన్లైన్లోనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మందులు, దాణా పంపిణీ పశువులకు సాధారణంగా వచ్చే వ్యాధులు, నివారణ మందులు, పోషక విలువలతో కలిగిన దాణా, పశుగ్రాసం, బీమా సాయం, ఇకమీదట పశువుకు తగిలించిన ట్యాగులోని బిల్ల ఆధారంగా జరుగుతాయని అధికారులు తెలిపారు. పరిమితికి మించి మందులు, దాణా, పశుగ్రాసం యజమాని పొందే అవకాశం ఉండదని తెలిపారు. బీమా సాయం కూడా ఒకసారికి మించి తీసుకునే వీలు ఉండదని అధికారులు చెబుతున్నారు. -
ఇక ‘పరీక్షే’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నాటితో ముగిసింది. మొత్తం 78,881 మంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్నారు. వీరిలో వీఆర్ఓ పోస్టులకు 73,353 మంది, వీఆర్ఏ పోస్టులకు 3148 మంది.. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు 2,380 పోటీ పడుతున్నారు. జిల్లాలో 105 వీఆర్ఓ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఒక్కో పోస్టుకు 721 మంది మధ్య పోటీ నెలకొంది. మొత్తం దరఖాస్తుదారుల్లో వికలాంగులు 2,149 మంది ఉన్నారు. 2011లో 58 వీఆర్ఓ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో 59వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు గడువు పూర్తి కావడంతో మంగళవారం పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రధానంగా ఫొటోలు సంతకాలను పరిశీలిస్తారు. ఫొటో ఉండి సంతకం చేయనివి, సంతకం ఉండి ఫొటోలు లేని గుర్తిస్తారు. ఇలాంటి దరఖాస్తుదారులు రాత పరీక్షకు వచ్చే రోజు ఫొటోపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకురావాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పరిశీలన కోసం 25 మంది రెవెన్యూ ఉద్యోగులను పండగ రోజు కూడా కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. అనవసరమైనన్ని కంప్యూటర్లను కూడా సిద్ధం చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం రాత పరీక్షకు అవసరమైన సెంటర్లను గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రాథమికంగా సెంటర్లను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 254 సెంటర్లు ఏర్పాటు చేయతలపెట్టారు. అత్యధికంగా కర్నూలులో ఏడు సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా మిగిలిన వాటిని నంద్యాల, ఆదోని, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, బనగానపల్లె, గూడూరు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్ఓ అభ్యర్థులకు.. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. ఈనెల 19 నుంచి ఇంటర్నెట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.