online billing
-
ఆన్..లైన్!
►కొత్త పాలసీ.. పాత నిర్ణయం! ►మూడేళ్లుగా సాగుతున్న కసరత్తు ►అమల్లోకి రాని ఆన్లైన్ బిల్లింగ్ ►అద్దె ప్రాతిపదికన కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ కార్వే సంస్థతో ఒప్పందం ►ఈ నెల 25 తుది గడువు ►ఎప్పటిలానే వ్యాపారుల ససేమిరా ►వంతపాడుతున్న అధికారులు ఆన్లైన్ బిల్లింగ్‌తో సిండి‘కేట్ల’కు అడ్డుకట్ట వేయాలనే అబ్కారీ శాఖ ఆలోచనకు ఎప్పటికప్పుడు కళ్లెం పడుతోంది. ఎమ్మార్పీకే మద్యం విక్రయించేలా చర్యలు చేపట్టి మందుబాబుల జేబుకు కాస్త ఊరటనివ్వాలనే ఈ నిర్ణయం వ్యాపారులకు మింగుడుపడటం లేదు. ఈ విషయంలో అధికారులకు చిత్తశుద్ధి కొరవడటం కూడా అమలులో వెనుకబాటుకు కారణంగా తెలుస్తోంది. రెండు నెలల కిందట కొత్త పాలసీ అమల్లోకి రావడం.. దుకాణాలు కొత్త వ్యాపారుల చేతుల్లోకి వెళ్లడంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. మద్యం అమ్మకాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ 2015లో ఆన్లైన్ బిల్లింగ్‌కు శ్రీకారం చుట్టింది. నకిలీ మద్యం నివారణ.. అమ్మకాల్లో పారదర్శకత లక్ష్యమని అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నకిలీ లేబుళ్లతో నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. అక్కడ మద్యం ధరలు తక్కువ కావడం.. పైగా ట్యాక్స్ వెసలుబాటు ఉండటంతో వ్యాపారులు ఆ దిశగా దందా సాగిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కొత్త విధానంతో వీరికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఇకపోతే నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాలు కలుపుతుండటంతో మందుబాబులు అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హోలోగ్రాం విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబర్ ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టమవుతుంది. ఫలితంగా నకిలీ మద్యం ప్రవాహాన్ని నిలువరించే వీలుంటుంది. జిల్లాలో ప్రస్తుతం ప్రతినెలా రూ.50కోట్ల మద్యం విక్రయిస్తున్నారు. కొత్త విధానం అమలైతే మద్యం మాఫియా ఆగడాలకు బ్రేక్ పడటంతో పాటు ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌కు వ్యాపారులు ససేమిరా ఆన్లైన్ బిల్లింగ్ విషయమై మూడేళ్ల క్రితం కార్వే సంస్థ ఒప్పందం చేసుకుంది. వ్యాపారులు కంప్యూటర్లు కొనుగోలు చేసినా.. లేదంటే అద్దెకైనా పరికరాలను అమరుస్తామని కార్వే ముందుకొచ్చింది. బిల్లింగ్ అమలైతే మద్యం సిండికేట్‌కు అవకాశం ఉండదు. దీంతో వ్యాపారులు ఈ విధానాన్ని తిరస్కరించారు. అబ్కారీ అధికారులు కూడా అదనపు ఆదాయం కోల్పోతామనే భావనతో లోలోపల బిల్లింగ్‌కు వ్యతిరేకంగా పని చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా మూడేళ్ల నుంచి ఈ అంశానికి బ్రేక్ పడుతూ వస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం ఈ ఏడాది ఎలాగైనా దీన్ని అమలు చేయాలని పట్టుబట్టారు. ఈ నెల 25లోపు అన్ని దుకాణాల్లో కంప్యూటర్లు అమర్చుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే వ్యాపారులు, స్థానిక అబ్కారీ అధికారులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ సిండికేట్‌కు రంగం సిద్ధం ఎప్పటిలాగే ఆన్లైన్బిల్లింగ్ను అడ్డుకోగలిగితే వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి ‘వయోలేషన్’(ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయాలు సాగించడం) చేసే యోచనలో వ్యాపారులు ఉన్నారు. దీనికి కొందరు అధికారులు కూడా మద్దతుగా ఉన్నట్లు సమాచారం. వయోలేషన్తో ప్రతినెలా జిల్లాలోని వ్యాపారులకు రూ.4.5కోట్ల నుంచి రూ.13కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూరుతుంది. ఈ డబ్బులో ఎక్సైజ్ అధికారులతో పాటు సివిల్ పోలీసులకు వాటా ఉంటుందనే బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ‘ఆన్లైన్’ పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చి వచ్చే నెలలో సిండికేట్ కావాలనే యోచనలో వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. అద్దె ముసుగులో దోపిడీ ఆన్లైన్ విధానంలో ‘కార్వే’కు భారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 240 మద్యం దుకాణలు ఉండగా.. కంప్యూటర్, సాఫ్ట్వేర్ కార్వే అమరుస్తుంది. నెలకు రూ.5వేలు అద్దె వసూలు చేస్తారు. వ్యాపారులు కొనుగోలు చేస్తే రూ.30వేల లోపు మొత్తం పరికరాలు వస్తాయి. గడువు ముగిసిన తర్వాత కంప్యూటర్ వ్యాపారికి మిగులుతుంది. కానీ కార్వేకు నెలకు రూ.5వేలు చొప్పున ఏడాదికి రూ. 60వేలు చెల్లించాలి. ఈ లెక్కన రూ.14.40కోట్లు కార్వేకు ముడుతుంది. కొత్తపాలసీ దక్కించుకునే వారికి తిరిగి ఈ కంప్యూటర్లనే అమరుస్తారు. అంటే అద్దె పేరుతో భారీగా దండుకోవడమే లక్ష్యంగా కన్పిస్తోంది. కంప్యూటర్ బిల్లింగ్.. హోలోగ్రాం ► yes ప్రతి మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లులు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పాటు చేస్తారు. ►yes సూపర్‌మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేసి, బిల్లు ప్రతిని కొనుగోలుదారునికి అందజేస్తారు. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎక్సైజ్ కమిషనరేట్‌కు చేరుతుంటాయి. ►yes అలాగే ప్రతి మద్యం సీసాపై హోల్గ్రాం ఉంటుంది. దీనిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌కు సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. ► yes బాటిల్‌పై ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ముద్రిస్తారు. ►yes మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు, క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు? ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మకం జరిగింది? అనే వివరాలు అతనికి ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. -
ఏపీలో ఆన్లైన్లో మద్యం విక్రయాలు
మలికిపురం/ మామిడికుదురు (తూర్పుగోదావరి): రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ఇక కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎక్సైజ్, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిమండ, అప్పన్నపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మద్యాన్ని ఎమ్మార్పీకంటే అధికంగా అమ్ముతున్నారని, ఎక్సైజ్ శాఖలో అవినీతి అధికంగా ఉందని వస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా.. మద్యం కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తికీ షాపులో కంప్యూటర్ బిల్లు ఇచ్చేలా ఆన్లైన్ విధానం నెల రోజుల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. మద్యం ధరల వివరాలు ముందుగానే ఈ కంప్యూటర్లో పొందుపరిచి వుండగా వాటి ప్రకారమే బిల్లు వస్తుంది. తాగుడు వల్ల కలిగే అనర్థాలను వివరించి మద్యం నుంచి ప్రజలను దూరం చేసేందుకు, బెల్ట్‌షాపులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. -
ఆన్లైన్ గుబులు
ఆన్లైన్ బిల్లింగ్ విధానం మద్యం వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగించి భారీగా లాభపడొచ్చన్న ఆశతో లెసైన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. లిక్కర్ బాటిళ్లపై హోలోగ్రామ్‌ను అమర్చి.. సూపర్ మార్కెట్ల తరహాలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మద్యం దుకాణంలో బిల్లింగ్‌ను కమిషనర్ కార్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. ఆగస్టు నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. దీనివల్ల ఇటు వ్యాపారులు, అటు ఎక్సైజ్ అధికారుల అక్రమార్జనకు చెక్ పడనుంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్‌శాఖ రెండేళ్ల కిందటే శ్రీకారం చుట్టింది. అయితే.. అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఆ విధానాన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్ కమిషనర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ మద్యాన్ని నివారించి, నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మద్యం సీసాలపై హోలోగ్రామ్ వేసి.. నూతన కంప్యూటర్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. ప్రతి మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లింగ్‌కు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేయాలి. దాని ప్రతిని కొనుగోలుదారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి. అలాగే ప్రతి మద్యం సీసాపై హోల్‌గ్రామ్ వేస్తారు. దానిపై సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబరును కూడా ముద్రిస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు, ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మారు? అనే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారు చేస్తున్నారు. తద్వారా నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కర్ణాటక నుంచి అక్కడి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. అక్కడ మద్యం ధరలు తక్కువ. పైగా ట్యాక్స్ వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా దీన్ని పూర్తిగా నివారించే అవకాశముంది. అలాగే నకిలీ మద్యం తాగిన వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హోల్‌గ్రామ్ విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబరు ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టమవుతుంది. దీనివల్ల నకిలీ మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెలా రూ.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త విధానం అమలైతే ఎక్సైజ్ ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. వ్యాపారుల వెనకడుగు ఆన్లైన్ విధానం అమలుపై మద్యం వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దుకాణాలు కొత్తగా ప్రారంభమైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. బాటిల్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10-30 అధికంగా వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ బిల్లింగ్ పెడితే ఎమ్మార్పీకే విక్రయించాలి. పైగా కంప్యూటర్ల కోసం రూ.90 వేలు చెల్లించాలి. దీంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. అయితే.. ఆబ్కారీ అధికారులు మాత్రం ‘కార్వే’ సంస్థ ద్వారా సాఫ్ట్‌వేర్‌తో పాటు మిషనరీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతినెలా రూ.5వేలు అద్దె చెలిస్తే మిషనరీ అమరుస్తారు. లేదంటే రూ.90 వేలు పెట్టి కొనాల్సి ఉంటుంది. గతేడాది కూడా వ్యాపారుల నుంచి రూ.90వేల చొప్పున వసూలు చేశారు. మిషనరీ మాత్రం అమర్చలేదు. దీంతో వారు డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త దుకాణాలు దక్కించుకున్నవారితో ఆ డబ్బు ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందరూ అద్దెకు తీసుకుంటామంటున్నారు ఆన్లైన్ బిల్లింగ్ ఆగస్టు నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కార్వే సంస్థ సాఫ్ట్వేర్ అందిస్తోంది. అందరూ అద్దె ప్రాతిపదికర మిషనరీ కొనుగోలు చేస్తామంటున్నారు. గతేడాది డబ్బు చెల్లించిన వారికి కొత్త వ్యాపారుల నుంచి ఇప్పిస్తాం. ఇది పెద్ద సమస్య కాబోదు. - జీవన్‌సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్‌శాఖ