online donations
-
‘డొనేట్‌కార్ట్’కు రూ.2.55 కోట్ల సీడ్ ఫండ్
రాయదుర్గం: ఆన్లైన్ డొనేషన్ ప్లాట్‌ఫామ్‌గా టీ–హబ్‌లో ఊపిరి పోసుకున్న ‘డొనేట్‌కార్ట్’కు రూ.2.55 కోట్ల సీడ్ ఫండింగ్ లభించింది. లెట్స్ వెంచర్, ఇతర ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సీడ్ ఫండింగ్ లభించినట్లు డొనేట్‌కార్ట్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్‌రెడ్డి, సందీప్ శర్మ చెప్పారు. ఈ నిధులతో టెక్నాలజీని, టీమ్‌ను మరింత మెరుగుపర్చుకుంటామని వారు చెప్పారు. వీరిద్దరూ ఎన్ఐటి నాగ్‌పూర్‌లో చదువుకుని, 2016లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. చెన్నయ్‌లో వరదల సందర్భంగా నెల రోజులపాటు వలంటీర్‌గా పనిచేయటం ఈ స్టార్టప్ దిశగా తమను ప్రేరేపించిందని వారు చెప్పారు. డొనేట్‌కార్ట్ సంస్థ గడిచిన రెండున్నరేళ్లలో 30వేల మంది నుంచి రూ.5 కోట్ల విరాళాలను సేకరించింది. వాటిని 500 స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరార్థులకు పంపిణీ చేసింది. వచ్చే మూడేళ్ళలో రూ.100 కోట్ల విరాళాలను సేకరించి, అవసరార్థులకు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. -
'ఆప్' కు తగ్గిన ఆన్ లైన్ విరాళాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఆన్ లైన్ ద్వారా అందే విరాళాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆప్ కు విరాళాలు తగ్గాయి. అధికారంలోకి వచ్చింది కాబట్టి 'ఆప్'కు ఇక తమ అవసరం లేదనుకున్నారో ఏమో గానీ దాతలు విరాళలు ఇవ్వడం తగ్గించారు. గత 15 రోజుల్లో 'ఆప్'కు రూ. 291,104 విరాళాలు అందాయి. అంతకుముందుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఎన్నికల పోలింగ్ ముగిసిన నాటి నుంచి విరాళాలు క్రమంగా తగ్గాయి. ఎన్నికల ఫలితాల తర్వాతి రోజు రూ. 430,392 వచ్చాయి. 12న ఎంత మొత్తం అందిందనేది ఆప్' తెలపలేదు. ఇక గురువారం నాడు కేవలం రూ.80,031 విరాళాలు మాత్రమే వచ్చాయి. గతేడాది నవంబర్ 1 నుంచి ఇప్పటివరకు రూ. 18,49,87,448 విరాళాలు 'ఆప్' సేకరించింది.