Online Grocery Business
-
పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా కంటే కూడా భారత్‌లో వివిధ డెలివరీ యాప్‌లు వేగంగా కస్టమర్లను చేరుకుని సంచలనం సృష్టిస్తున్నాయి. యూఎస్‌లోని డెలివరీ దిగ్గజ కంపెనీలు యాప్‌లపై ఆర్డర్ అందుకున్నాక లొకేషన్ ఆధారంగా అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేస్తున్నట్టు వెల్లడైంది. అందుకు భిన్నంగా మన దేశంలో ‘క్విక్ సర్వీస్’అనేది నాణ్యమైన సేవకు గీటురాయిగా మారింది. స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ వంటి యాప్‌లు...చిన్న చిన్న నిత్యావసరాలను సైతం అత్యంత వేగంగా వినియోగదారుల ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో మనదేశంలో... ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకున్నాక అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్న ఔట్లెట్ల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకుని కస్టమర్లకు చేర్చేవారు. ఐతే గత దశాబ్దకాలంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటి ద్వారా ఈ–కామర్స్ ఒక్కసారిగా పుంజుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో భారత్‌లో వేగంగా నిత్యావసర సరుకులు అందించే డెలివరీ సంస్థలు ఆన్లైన్ షాపింగ్‌పై అధిక నమ్మకాలు పెట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్సంస్థలు ఉనికిలో నిలిచేందుకు కష్టపడుతుంటే, అదేకోవలోని భారత్ మార్కెట్ మాత్రం అంతకంతకు వృద్ది చెందుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 లాక్‌డౌన్‌తో... ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు పెరగగా..ఆ తర్వాత కొన్నిదేశాల్లో షాపులకు వెళ్లి వస్తువులు కొనుక్కునేందుకు మొగ్గుచూపడంతో అవి వెనకడుగు వేయక తప్పలేదు. భారత్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్టప్‌లు మరింత వృద్ది చెందడంతో పాటు సేవలో వేగం, నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టడం గమనార్హం. పచారీ కొట్లకు తప్పని పోటీ ఇప్పుడు డెలివరీ యాప్‌లు వేగం పుంజుకోవడంతో...పది నిమిషాల్లోనే కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులు చేరవేయడం అనే దాన్ని ఈ సంస్ధలు ఒక అలవాటుగా మార్చుకుంటున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేశాక పదినిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలను డెలివరీ ఏజెంట్లు అందజేయడాన్ని కూడా సెకన్ల వారీగా ట్రాక్ చేస్తుండటం విశేషం. ఆన్లైన్లో ఆర్డర్లను అందించే క్రమంలో ఏ కారణంచేతనైనా ఏజెంట్లు నెమ్మదిస్తే వారి ఫోన్లలో ‘ఎరుపు ఫ్లాష్’ద్వారా హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. దేశంలోని వివిధ డెలివరీ యాప్‌ల ద్వారా పాలు, పండ్లు మొదలు గులాబీల దాకా నిమిషాల వ్యవధిలోనే కస్టమర్ల వద్దకు చేరేలా సర్వీసులు అందిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పలు రకాల నిత్యావసరాలకు ఆర్డర్ అందగానే పది నిమిషాల్లో ఇళ్లకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సరుకులను నిమిషాల్లో డెలివరీ చేసే యాప్‌లు పచారీ కొట్లకు సవాల్‌గా మారాయి. సంప్రదాయ కిరాణా దుకాణాలు, వీధి చివర్లలోని షాపులకు గట్టి పోటీ తప్పడం లేదు. మనదేశంలోని వివిధ వర్గాల ప్రజలు... తమ ఇళ్లకు దగ్గరలోని షాపుల నుంచి బియ్యం, పప్పులు, ఇతర వస్తువులను తెచ్చుకోవడమో లేదా ఫోన్లో ఆర్డర్ చేసే ఆ దుకాణాల్లో పనిచేసే వారు ఇళ్లకు చేరవేయడమో చేస్తూ వచ్చారు. ఇప్పుడు డెలివరీ యాప్‌ల యుగంలో...రోజువారీ అవసరాలకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులను సైతం ఆన్లైన్లో ఆర్డర్ చేసి నిమిషాల్లోని ఇంటి గుమ్మం వద్దకు తెప్పించుకుంటున్నారు. స్విగ్గీలో ఐతే ఒకేఒక మామిడిపండును ఆర్డర్ చేసినా దానిని కూడా కస్టమర్‌కు డెలివరీ చేస్తోంది. వేగం, కచ్చితత్వం గత ఏప్రిల్‌లో భారత్‌లోని ఆన్లైన్ సరుకుల మార్కెట్, క్విక్ డెలివరీని గోల్డ్‌మాన్ సాక్స్ విశ్లేíÙంచినపుడు... ప్రస్తుతం భారత్ ఆన్లైన్ సరుకుల మార్కెట్ 11 బిలియన్ డాలర్లుగా నిలుస్తుండగా వాటిలో క్విక్ డెలివరీ మార్కెట్ 5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా తేలింది. ఆన్లైన్ కస్టమర్ల ప్రాధాన్యతలకు తగ్గట్టుగా సరుకులను చేరవేయడంలో వేగం, కచ్చితత్వం పెరుగుదలతో 2030 కల్లా 60 బిలియన్ డాలర్లుగా చేరుకుని ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్లో క్విక్ కామర్స్ 70 శాతంగా నిలుస్తుందని ఈ సంస్ధ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా 1.30 కోట్ల నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు, షాపులు ఉండగా, వీటికి సంబంధించిన రిటైల్ అసోసియేషన్ల అంచనాల ప్రకారం... క్విక్ కామర్స్యాప్ల ద్వారా అమ్మకాలు తగ్గుదల పుంజుకోవడంతో... వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల వారీగా చూస్తే సంప్రదాయ దుకాణాల్లో పది నుంచి 60 శాతం దాకా అమ్మకాలు నమోదైనట్టుగా తెలుస్తోంది. -
జెప్టో జెట్ స్పీడ్
ఇరవై ఏళ్ల వయసు దాటని వారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ‘ఈ వయసులో ఎందుకు?’ అనే మాట వినిపించడం సాధారణం. కైవల్య వోహ్ర, అదిత్ పలిచా ‘జెప్టో’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలు కాస్త గట్టిగానే వినబడ్డాయి. అయితే ఈ మిత్రద్వయం వెనక్కి తగ్గలేదు. ‘జెప్టో’తో సూపర్ హిట్ కొట్టింది. ‘సక్సెస్‌కు వయసుతో పనిలేదు’ అని మరోసారి నిరూపించింది. ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జెప్టో’ సూపర్ సక్సెస్ కావడమే కాదు యూనికార్న్ స్టేటస్ సాధించింది. నడక నుంచి పరుగు వరకు ‘జెప్టో’ నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.... పాఠం నెం 1: క్లారిటీ స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్ సైన్స్ చదువును వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చిన కైవల్య, అదిత్‌ల ముందుకు వచ్చి నిలబడిన ప్రశ్న...‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉందా?’ హండ్రెడ్ పర్సంట్. లాక్డౌన్ సమయంలో వచ్చిన ఐడియాను స్టార్టప్ రూపంలో రోడ్డు ఎక్కించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్‌పై క్లారిటీ ఉండాలి. దీని కోసం ఇ–కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని కాచి వడబోసినంత పని చేశారు కైవల్య, ఆదిత్‌లు. పాఠం నెం 2: నమ్మకం చిన్న వయసు కావడం వల్ల కైవల్య, అదిత్లను ఇన్వెస్టర్లు నమ్మడం అంత తేలికైన విషయం కాదు. ఫండింగ్ విషయంలో ఇది ఇబ్బందిగా మారుతుంది. ‘మీకు ఎలాంటి అనుభవం లేదు కదా. ఎలా నమ్మడం?’ అంటారు. అయితే సక్సెస్ అన్ని సమస్యలకు జవాబు చెబుతుంది. మనపై ఇతరులకు నమ్మకం కలిగిస్తుంది. తొలి అడుగుల్లోనే ‘జెప్టో’ గెలుపు జెండా ఎగరేయడం వల్ల ఫండింగ్ విషయంలో ఇబ్బంది కాలేదు. పాఠం నెం 3: ధైర్యం ‘ఈ పని రాదు అని మేము ఎప్పుడూ భయపడలేదు. ఎందుకు రాదు...ప్రయత్నించి చూద్దాం అనుకొని ముందుకు వెళ్లాం. ఈ క్రమంలో పెద్ద కంపెనీల నుంచి పోటీ ఎదురైంది. ఆ పోటీ నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. మేము భయం దగ్గరే ఆగిపోయి ఉంటే మా ప్రయాణం కొనసాగేది కాదు’ అంటాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో కైవల్య వోహ్ర. స్టార్టప్ మొదలు పెట్టినప్పుడు పెద్ద కంపెనీలతో పోల్చి మాట్లాడుతుంటారు చాలామంది. వారి మాటలకు చిక్కితే భయమే మిగులుతుంది. భయం అనేది అపజయానికి క్లోజ్‌ఫ్రెండ్. పాఠం నెం 4: టీమ్ స్ట్రెంత్ స్టీవ్ జాబ్స్‌ను అభిమానించే కైవల్య, అదిత్లకు ఆయన నోటి నుంచి వచ్చిన ‘వ్యాపారంలో గొప్ప విజయాలు అనేవి ఒక వ్యక్తి వల్ల వచ్చేవి కాదు. అది సమష్టి కృషి’ అనే మాట తెలియనిదేమీ కాదు. అందుకే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం ఉన్నా అది హద్దులు దాటకుండా చూసుకున్నారు. టీమ్ స్ట్రెంత్‌ను నమ్ముకున్నారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. పాఠం నెం 5: రీసెట్ డీఎన్ఏ తమ కంపెనీ తక్కువ టైమ్‌లోనే ఘన విజయాన్ని సాధించిన సంతోషంలో ‘జెప్టో స్పీడ్’ అనే టర్మ్‌ను కాయిన్ చేశాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో అదిత్ పలిచా. అయితే ఈ జెప్టో స్పీడ్‌కు స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయాల గురించి అదిత్ పలిచా ఇలా స్పందిస్తాడు ‘మరింత క్రమశిక్షణతో ఉండాలనుకున్న సమయం, సుస్థిరమైన ఎదుగుదల మార్గాలపై మరింత దృష్టి పెట్టాలని అనుకున్న సమయం, కంపెనీ డీఎన్ఏను రీసెట్ చేయాలనుకున్న సమయం అది.’ -
వేల కోట్ల డీల్..జొమాటో చేతికి ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్(గతంలో గ్రోఫర్స్ ఇండియా)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,447.5 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. శుక్రవారం సమావేశమైన బోర్డు బ్లింక్ కామర్స్‌కు చెందిన 33,018 ఈక్విటీ షేర్ల కొనుగోలుకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఒక్కో షేరుకి రూ. 13.45 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొంది. కాగా.. జొమాటోకు చెందిన 62.85 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా లావాదేవీని పూర్తి చేయనున్నట్లు వివరించింది. రూ. 1 ముఖవిలువగల ఒక్కో షేరునీ రూ. 70.76 సగటు ధరలో జారీ చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే బీసీపీఎల్‌లో 1 ఈక్విటీ షేరుతోపాటు మరో 3,248 ప్రిఫరెన్స్ షేర్లను కలిగి ఉంది. క్విక్ కామర్స్ బిజినెస్‌లో పెట్టుబడి వ్యూహాలకు అనుగుణంగా బీసీపీఎల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు జొమాటో ఈ సందర్భంగా పేర్కొంది. బ్లింకిట్ బ్రాండుతో బీసీపీఎల్ ఆన్లైన్ క్విక్ కామర్స్ సర్వీసులను అందిస్తున్న విషయం విదితమే. కాగా, బ్లింకిట్ కొనుగోలు తదుపరి రెండు కంపెనీల యాప్స్ విడిగా కొనసాగనున్నట్లు జొమాటో వెల్లడించింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో జొమాటో షేరు నామమాత్ర లాభంతో రూ. 70.15 వద్ద ముగిసింది. -
జొమాటో కంటే ముందుగానే...10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ప్రారంభించిన గ్రాసరీ సంస్థ..!
జెప్టో ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది..మెరుపు వేగంతో కేవలం పది నిమిషాల్లోనే ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందిస్తుంది. కాగా ఇప్పుడు గ్రాసరీ సేవలతో పాటుగా ఫుడ్ డెలివరీ సేవలను అందించేందుకు సిద్దమైంది జెప్టో. వచ్చేసింది...జెప్టో ‘కేఫ్’ జెప్టో ‘కేఫ్’ అనే సొంత యాప్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత ముంబై మహానగరంలో 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవలను జెప్టో మొదలుపెట్టింది. జెప్టో ప్రస్తుతం రూ. 99 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్స్‌పై ఉచితంగా డెలివరీ చేస్తోంది. పది నిమిషాల్లో ఫుడ్‌ను అందించేందకుగాను జెప్టో ముంబైకి చెందిన స్టార్టప్ బ్లూ టోకాయ్ కాఫీ, చాయోస్, గురుకృపా స్నాక్స్, సాసీ టీస్పూన్ వంటి రెస్టారెంట్లతో జత కట్టింది. ప్రస్తుతం కేవలం పది నిమిషాల్లో తయారయ్యే టీ, , సమోసాలు, కాఫీ, శాండ్విచ్స్ వంటి ఆహర పదార్థాలను డెలివరీ చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్నీ నగరాల్లో, ఎక్కువ ఫుడ్ ఐటెమ్స్‌ను డెలివరీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని జెప్టో వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా వెల్లడించారు. జొమాటో కంటే ముందుగానే.. కొద్ది రోజుల క్రితం..పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తామని ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. జొమాటోతో పాటుగా ఓలా, స్విగ్గీ వంటి సంస్థలు పది నిమిషాల ఫుడ్ డెలివరీపై ప్రణాళికలను కూడా రచిస్తున్నాయి. ఇక జొమాటో ప్రకటన సోషల్‌మీడియా చర్చకు దారితీసింది. పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా సాధ్యమంటూ నెటిజన్లు ప్రశ్నించారు. అంతేకాకుండా పది నిమిషాల ఫుడ్ డెలివరీ ప్రకటనపై ఏకంగా పార్లమెంట్లో కూడా చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. 10 నిమిషాల ఫుడ్ డెలివరీపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వివరణను కూడా ఇచ్చారు. ఇప్పుడు జొమాటోకు గట్టిషాక్‌ను ఇస్తూ ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ జెప్టో పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. చదవండి: ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ...భారత్‌కు గుడ్‌బై..! కారణం అదే..? -
ఆన్లైన్ కిరాణా బిజినెస్‌పై రిలయన్స్ భారీ డీల్..! ఏకంగా...!
దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు రిలయన్స్ రిటైల్ సిద్దమైంది. వాటాల కొనుగోలు....! ఆన్లైన్ కిరాణా డెలివరీ వ్యాపారంలో రిలయన్స్ రిటైల్ ఉనికిని విస్తరించేందుకుగాను ప్రముఖ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. తాజాగా రిలయన్స్ రిటైల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో డంజో సుమారు 240 మిలియన్ల డాలర్లను సేకరించింది. ఈ ఫండింగ్ రౌండ్లో ఇప్పటికే ఈ సంస్థకు ఇన్వెస్టర్లుగా ఉన్న లైట్‌బాక్స్, లైట్‌త్రాక్, 3ఎల్ క్యాపిటల్ , ఆల్టెరియా క్యాపిటల్ కూడా ఫండింగ్ రౌండ్లో పాల్గొన్నాయి. మరింత వేగవంతం..! డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో డంజో తన సేవలను విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని కంపెనీ సహా వ్యవస్థాపకుడు కబీర్ బిశ్వాస్ అన్నారు. డంజో ఇప్పటివరకు భారత్‌లో 7 మెట్రో నగరాల్లో వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం డంజో డైలీ పేరుతో మరింత వేగవంతమైన డెలివరీ సేవలను ప్రారంభించింది. చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..! -
ఈ-కామర్స్ జోష్
న్యూఢిల్లీ: దేశీయంగా ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. 2024 నాటికి 27 శాతం వార్షిక వృద్ధి రేటుతో 99 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కారణంగా ఆన్లైన్లో నిత్యావసరాల విక్రయాల్లో దాదాపు సగం వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే ఉండనుంది. గోల్డ్‌మన్ శాక్స్ రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్ వ్యాపార కార్యకలాపాలు మరింత జోరు అందుకున్నాయని నివేదిక పేర్కొంది. ‘2019–24 మధ్య భారత్‌లో ఈ–కామర్స్ వ్యాపారం 27 శాతం వార్షిక వృద్ధితో 2024 నాటికి 99 బిలియన్ డాలర్లకు చేరుతుంది. నిత్యావసరాలు, ఫ్యాషన్/దుస్తులు మొదలైనవి ఈ వృద్ధికి తోడ్పడతాయి‘ అని వివరించింది. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ–కామర్స్‌లోకి అడుగుపెట్టడం, ఆన్లైన్లో నిత్యావసరాల విక్రయానికి వాట్సాప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సమీప భవిష్యత్‌లో గణనీయంగా ప్రబావం చూపే అంశం‘ అని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. 2019లో ఆన్లైన్ గ్రాసరీ విభాగంలో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వాటా 80 శాతం పైగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ 9.99 శాతం వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గ్రాసరీ 81 శాతం వృద్ధి .. గడిచిన కొన్నాళ్లుగా ఆన్లైన్ గ్రాసరీ విభాగం 50 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తుండగా.. కరోనా వైరస్ పరిణామాలు, రిలయన్స్ ఎంట్రీ కారణంగా 2019–24 మధ్య కాలంలో ఏకంగా 81 శాతం వార్షిక వృద్ధి నమోదు చేయొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ‘ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కారణంగా ఆన్లైన్ గ్రాసరీ విభాగంలో 2024 నాటికి 50 శాతం పైగా వాటాతో రిలయన్స్ మార్కెట్ లీడరుగా ఎదిగే అవకాశం ఉంది. రెండు.. అంతకు మించిన సంఖ్యలో సంస్థలు ఈ విభాగంలో కార్యకలాపాలను సాగించేందుకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి‘ అని వివరించింది. నిత్యావసరయేతర ఈ–కామర్స్ వినియోగం వచ్చే రెండేళ్లలో 500 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చని, 2021 నాటికి 16.1 శాతానికి చేరవచ్చని పేర్కొంది. దేశీయంగా నిత్యావసరాల మార్కెట్ 2019లో 380 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం రిటైల్ మార్కెట్లో దీని వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. అయితే, ఆన్లైన్ అమ్మకాలు మాత్రం కేవలం 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ–కామర్స్ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ వచ్చే అయిదేళ్లలో 29 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. 2019లో ఆన్లైన్ గ్రాసరీ ఆర్డర్లు రోజుకు 3,00,000 స్థాయిలో ఉండగా.. 2024 నాటికి 50 లక్షలకు చేరవచ్చని పేర్కొంది. -
ప్రత్యర్థులకు గుబులు: దూసుకొచ్చిన జియో మార్ట్
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కు చెందిన ఆన్లైన్ రీటైల్ వెంచర్ జియో మార్ట్ ఆన్లైన్ గ్రాసరీ డెలీవరీ సేవలను ఇపుడు మరింత విస్తరించింది. గత నెల పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సేవలను తాజాగా మరిన్ని నగరాల్లో ప్రారంభించింది. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆంక్షల్లో కొంతమేర సడలింపుల నేపథ్యంలో జియోమార్ట్ కీలకమైన ఆన్ లైన్ గ్రాసరీ సేవల్లోకి మరింత వేగంగా దూసుకొస్తోంది. దేశవ్యాప్తంగా 200కి పైగా పట్టణాల్లో కిరాణా సామాగ్రిని ఇపుడు పంపిణీ చేయనుంది. ఈ మేరకు రిలయన్స్ మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్ ఈ ప్రకటన చేశారు. రాజస్థాన్‌లోని నోఖా, తెలంగాణలోని బోధన్, తమిళనాడులోని నాగర్కాయిల్, ఆంధ్రాలోని తాడేపల్లిగూడెం, రాయగఢ్ (ఒడిశా), బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కంపెనీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ సెగ్మెంట్ లో ఉన్న ప్రముఖ ఆన్ లైన్ డెలివరీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టులకు గట్టి పోటీ ఇవ్వనుంది. (జియోలో కేకేఆర్ భారీ పెట్టుబడి) నవీ ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలలో తన సేవలు విజయవంతమైన ఒక నెల తరువాత, అనేక పట్టణాలు, నగరాల్లో తన కార్యకలాపాను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది జియోమార్ట్. కొత్తగా ప్రారంభించిన ఇ-కామర్స్ పోర్టల్, జియోమార్ట్.కామ్ ద్వారా కిరాణా, పండ్లు, కూరగాయలు లాంటి ఇతర రోజువారీ కొనుగోళ్లకు వినియోగదారులు లాగిన్ అవ్వవచ్చు. అయితే ప్రస్తుతానికి తన వెబ్ సైట్ ద్వారా మాత్రమే కస్టమర్ల ఆర్డర్స్ తీసుకుంటుండగా, త్వరలో జియోమార్ట్ యాప్ లాంచ్ చేయనుంది. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) Nokha in Rajasthan; Bodhan in Telangana; Nagarcoil in Tamilnadu; Tadepalligudam in Andhra; Raygada, Odisha; Darjeeling, Bengal. Now on Grocery eComm map, with Fruits&Veggies, too. Next wave of democratisation of modernity. #JioMart Try with your pincode https://t.co/wrKLFTCDwV — Damodar Mall (@SupermarketWala) May 24, 2020 -
ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ హైజంప్!
దేశీయంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పలు రంగాలు డీలాపడినప్పటికీ.. ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ మాత్రం జోరందుకుంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్ అమలు చేస్తున్న నేపథ్యంలో హోమ్ డెలివరీలు చేసే ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ తదితర సంస్థల బిజినెస్ ఊపందుకుంది. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ 76 శాతం జంప్‌చేయనున్నట్లు ఫారెస్టర్ రీసెర్చ్ తాజాగా అభిప్రాయపడింది. వెరసి 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,500 కోట్లు)ను తాకనున్నట్లు అంచనా వేసింది. దేశవ్యాప్త లాక్‌డవున్ కారణంగా ఈకామర్స్ బిజినెస్‌కు 1.3 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు ఫారెస్టర్ అంచనా వేసింది. దీంతో తొలుత వేసిన 2 బిలియన్ డాలర్ల ఆన్లైన్ గ్రోసరీస్ బిజినెస్ 3 బిలియన్ డాలర్లను అధిగమించవచ్చని అభిప్రాయపడింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలు సైతం వినియోగదారులకు ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులను అందిస్తున్న విషయం విదితమే. 35.5 బిలియన్ డాలర్లకు ఈఏడాది దేశీయంగా మొత్తం ఈకామర్స్ బిజినెస్ 6 శాతం వృద్ధితో 35.5 బిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా. అయితే గత ఆరు వారాలుగా ఈకామర్స్ బిజినెస్‌లో నమోదైన అధిక డిమాండ్ కొనసాగకపోవచ్చని ఫారెస్టర్ రీసెర్చ్ పేర్కొంది. లాక్‌డవున్ తొలి రోజుల్లో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి కంపెనీలకు ఐదు రెట్లు అధికంగా ఆర్డర్లు లభించినప్పటికీ ఇటీవల నెమ్మదించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే మరికొంతకాలంపాటు ఈకామర్స్ బిజినెస్‌లో అమ్మకాల పరిమాణం అధికంగానే నమోదయ్యే వీలున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 35 శాతం అధికంగా ఆర్డర్లు లభిస్తున్నట్లు బిగ్‌బాస్కెట్ సీఈవో హరి మీనన్ పేర్కొన్నారు. కోవిడ్-19కు ముందు బిజినెస్‌తో పోలిస్తే లాక్‌డవున్ కాలంలో 60 శాతం అధిక విలువగల ఆర్డర్లు లభించినట్లు గ్రోఫర్స్ సీఈవో అల్వీందర్ తెలియజేశారు. -
వచ్చేసింది..జియోమార్ట్
ముంబై: చమురు నుంచి టెలికం దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించిన దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా ఆన్లైన్ కిరాణా వ్యాపార విభాగంలోకి కూడా ప్రవేశించింది. జియోమార్ట్ పేరిట ఈ–కామర్స్ వెంచర్‌ను ప్రారంభించింది. ప్రాథమికంగా ముంబైలోని నవీ–ముంబై, థానే, కల్యాణ్ ప్రాంతాల్లో ప్రారంభించిన కార్యకలాపాలను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఆఫ్‌లైన్–టు–ఆన్లైన్ వ్యాపారం ద్వారా 50,000 పైచిలుకు నిత్యావసర ఉత్పత్తులను విక్రయించనుంది. కనీస ఆర్డరు నిబంధనలేవీ లేకుండానే ఉచిత హోమ్ డెలివరీ సర్వీసులు కూడా అందించనున్నట్లు జియోమార్ట్ తన పోర్టల్‌లో పేర్కొంది. ప్రాథమికంగా ప్రారంభించిన సర్వీసులకు సబ్స్క్రయిబ్ చేసుకోవాలని, తొలి ఆర్డరుపై రూ, 3,000 దాకా పొదుపు చేసుకోవచ్చని ముంబైలో ని జియో మొబైల్ యూజర్లను జియోమార్ట్ ఆహ్వానిస్తోంది. జియోమార్ట్ సర్వీసులకు సంబంధించి త్వరలోనే ప్రత్యేక మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రానుంది. దీన్ని మై జియో, జియో మనీ యాప్‌లతో అనుసంధానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏడాదిగా కసరత్తు..: కమ్యూనికేషన్, కంటెంట్, కామర్స్ అనే మూడు వ్యాపార విభాగాల్లో విస్తరించే వ్యూహంతో రిలయన్స్ ముందుకెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జియో ద్వారా టెలికం రంగంలో సంచలనం సృష్టించింది. 2016లో జియోని ప్రవేశపెట్టిన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్, మ్యూజిక్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, టీవీ వంటి డిజిటల్ సర్వీసులను భారీగా విస్తరిస్తోంది. అదే విధంగా జియోమార్ట్ ద్వారా ఈ–కామర్స్ విభాగంలోనూ సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తమ ఇంటర్నెట్ ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) డివైజ్‌ల ఊతంతో ఏడాది కాలం పైగా.. కిరాణా స్టోర్స్‌ను క్రమంగా తమ ప్లాట్‌ఫాంలో చేర్చుకుంటూ వస్తోంది. ఒక్క నవీ ముంబై ప్రాంతంలోనే ఏకంగా 10,000కు పైగా కిరాణా వ్యాపారులు ఇందులో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కిరాణా వ్యాపారులు నమోదు చేసుకున్నప్పటికీ.. ఇన్‌ఫ్రాపరమైన సౌలభ్యత కారణం గా ముంబైలో ముందుగా ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు ప్రారంభించినట్లు వివరించాయి. కిరాణా వ్యాపారులు తమ స్టోర్‌లోని ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడానికి, కొత్త స్టాక్స్‌కు ఆర్డర్లివ్వడానికి, కస్టమర్లకు ఆఫర్లు పంపడానికి, ఆన్లైన్ విక్రయా ల నిర్వహణకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అమెజాన్.. బిగ్‌బాస్కెట్‌లకు పోటీ... రిలయన్స్ ఈ–కామర్స్ అరంగేట్రంపై ఏడాదిగా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. జియో, రిలయన్స్ రిటైల్ ఊతంతో కొత్త ఈ–కామర్స్ వ్యాపార విభాగంపై కసరత్తు చేస్తున్నట్లు గతేడాది వైబ్రంట్ గుజరాత్ సదస్సులో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వెల్లడించినప్పట్నుంచీ.. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆర్ఐఎల్ ఇప్పటికే ఏజియోడాట్‌కామ్ అనే ఫ్యాషన్ సైట్ ద్వారా, రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా ఈ–కామర్స్ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా జియోమార్ట్ .. దానికి కొనసాగింపుగా పూర్తి స్థాయి ఈ–కామర్స్ వెంచర్ కానుంది. గతంలో టెలికం రంగంలో జియో ఎంట్రీ తరహాలోనే.. ఈ–కామర్స్‌లో జియోమార్ట్ కూడా పెను సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దిగ్గజాలుగా ఎదిగిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ సంస్థలతో పాటు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి ఆన్లైన్ గ్రాసరీ సంస్థలకు కూడా గట్టి పోటీదారుగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, ఇందుకోసం మిగతా ప్రత్యర్థి సంస్థల కన్నా మరిన్ని ప్రయోజనాలను కిరాణా వ్యాపారులకు అందించాల్సి ఉం టుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. చౌకగా ఉత్పత్తుల సరఫరా, మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్) మినహాయింపునివ్వడం వంటివి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా తమ దగ్గరున్న ఉత్పత్తులు, నిల్వల గురించి కచ్చితమైన వివరాలు అందించేలా వ్యాపారులను ఒప్పించ డం ఒకింత సవాలుగా ఉండవచ్చని తెలిపాయి. -
ఆన్లైన్ కిరాణా వ్యాపారంలోకి ఓలా..
బెంగళూరులో పరీక్షిస్తున్న కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసుల రంగంలో ఉన్న ఓలా (గతంలో ఓలా క్యాబ్స్) ఆన్లైన్ కిరాణా వ్యాపారంలోకి అడుగిడుతోంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు సరుకులు, నిత్యావసర వస్తువులను కస్టమర్ల ఇంటికే పంపనుంది. ప్రస్తుతం బెంగళూరులో ఈ కొత్త సర్వీసులను ‘ఓలా స్టోర్’ యాప్ ద్వారా పరీక్షిస్తోంది. నూతన యాప్‌ను ప్రయత్నించాల్సిందిగా కొద్ది మంది కస్టమర్లకు కంపెనీ ఈమెయిల్స్ పంపింది. ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులను కొనుక్కోవచ్చంటూ ఆహ్వానిస్తోంది. ఓలా స్టోర్ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు ధ్రువీకరించారు. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు తొలి ఆర్డరులో 50 శాతం డిస్కౌంట్ కూడా ఉందని సమాచారం. రూ.300 లోపు బిల్లు అయ్యే ఆర్డర్లకు డెలివరీ చార్జీ రూ.50 చెల్లించాలి. ఇక ఓలా స్టోర్ ద్వారా కిరాణా సరుకులతోపాటు పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మందులు, ఎలక్ట్రికల్ ఉపకరణాల వంటివి ఆర్డరు ఇవ్వొచ్చు. ఆహార పదార్థాలు కూడా.. ఇటీవలే ఓలా కేఫ్ సర్వీసులను సైతం కంపెనీ ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్ నుంచి యాప్ ద్వారా నచ్చిన ఫుడ్ ఆర్డరు ఇవ్వడమే తరువాయి. 20 నిమిషాల్లోనే డెలివరీ ఇస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అది కూడా నిర్దిష్ట సమయంలో ఎంపిక చేసిన ప్రాంతాలకే సర్వీసులు పరిమితం. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, కొండాపూర్లు ఇందులో ఉన్నాయి. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి ప్రత్యేక, విభిన్న ఆహార పదార్థాలను కొనుగోలు చేసి కస్టమర్లకు పంపిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది.