సచిన్ కుమార్ కు ఐదేళ్ల జైలు
న్యూయార్క్: అమెరికాలో ఆన్ లైన్ మోసానికి పాల్పడిన భారతీయ విద్యార్థి ఒకరు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నాడు. నిందితుడు సచిన్ కుమార్(22) స్టబ్ హబ్ వెబ్ సైట్ లో మారు పేర్లతో నకిలీ ఈవెంట్ టికెట్లు అమ్మి సొమ్ములు చేసుకున్నట్టు విచారణలో రుజువైంది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ తంపాలో ప్రీ-డెంటల్, బయాలజీ చదువుతున్న కుమార్ తన నేరాన్ని అంగీకరించాడు.
ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మడం ద్వారా అతడు 49,121 డాలర్లు దక్కించుకున్నాడు. బాధితులకు న్యాయం చేసేందుకు స్టబ్ హబ్ 172,047 డాలర్లు చేయాల్సివచ్చింది. ఈ కేసులో తెర వెనుక మరికొందరి హస్తం ఉందని, కుమార్ కేవలం పాత్రధారుడు మాత్రమేనని అతడి లాయర్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అతడిని కోర్టు దోషిగా తేల్చింది. కారు ప్రమాదంలో అతడు గాయపడడంతో అతడికి జైలు శిక్ష అమలు చేయలేదు. కోలుకున్న తర్వాత జైలు శిక్ష గురించి చెప్పనున్నారు.