Online Travel Company
-
మేక్ మై ట్రిప్ ‘షార్ట్ స్టేస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ ‘షార్ట్ స్టేస్’ పేరుతో దేశంలో తొలిసారిగా వినూత్న విధానాన్ని అక్టోబరులో పరిచయం చేయ బోతోంది. సాధారణంగా ఏ హోటల్‌కు వెళ్లినా గది అద్దె 24 గంటలుగా లెక్కకడతారు. షార్ట్ స్టేస్ విధానంలో 4 గంటల వ్యవధికి కూడా గది అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని తిరుపతిలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నట్టు మేక్ మై ట్రిప్ ఇండియా హోటల్స్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరిక్షిత్ చౌదరి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. పైలట్ విజయ వంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందు బాటులోకి తెస్తామని వెల్లడించారు. చార్జీ ఒక రోజుతో పోలిస్తే నాలుగు గంటలకు 20–30 శాతం ఉంటుందని చెప్పారు. కస్టమర్‌తోపాటు హోటల్ యజమానికి కూడా ఈ విధానం కలిసి వస్తుందని వివరించారు. -
హాలిడే ఐక్యూలో వాటా కొనుగోలు చేసిన మేక్మైట్రిప్
28% వాటాను రూ.95కోట్లతో కొనుగోలు న్యూఢిల్లీ : ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ హోటళ్లు, పర్యాటక అనుభవాలకు సంబంధించిన సమీక్షలు, సమాచారముండే ఆన్లైన్ పోర్టల్ హాలిడేఐక్యూలో 28 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను రూ.95 కోట్లకు కొనుగోలు చేయనున్నామని మేక్‌మైట్రిప్‌డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ దీప్ కల్రా చెప్పారు. మేక్మైట్రిప్ అందిస్తున్న పెట్టుబడులతో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తామని హాలిడేఐక్యూ వ్యవస్థాపకుడు, సీఈఓ హరి నాయర్ వివరించారు. గతంలో టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్నర్స్ల నుంచి నిధులు సమీకరించామని పేర్కొన్నారు. భారత పర్యాటకులు హోటళ్లు, పర్యాటక అనుభవాలకు సంబంధించిన సమీక్షలు పదిలక్షలకు పైగా హాలిడేఐక్యూలో ఉన్నాయి.