ontimitta temple
-
ఇక జాంబవ క్షేత్రంగా ఒంటిమిట్టకు ఖ్యాతి
కడప కల్చరల్ : ఒంటిమిట్ట దివ్య క్షేత్రానికి కొత్త హంగు కలగనుంది. జాంబవ ప్రతిష్టగా పేరున్న ఈ క్షేత్రంలో జాంబవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని చాలా కాలంగా భక్తులు కోరుతున్నారు. వారి వినతులకు స్పందించిన టీటీడీ అదికారులు ఇటీవలి పర్యటన సందర్భంగా ఈ మేరకు విగ్రహ ప్రతిష్ట చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రానికి తలమానికంగా, జిల్లాకు గర్వ కారణంగా నిలిచిన శ్రీమద్ ఒంటిమిట్టకు జాంబవ క్షేత్రంగా పేరుంది. ఈ ఆలయానికి అధికార హోదా దక్కేందుకు స్థానిక పరిశోధకులు ఆలయ ప్రాచీనత గురించి చెబుతూ క్షేత్ర పాలకుడిగా రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించినది జాంబవంతుడేనని స్పష్టం చేశారు. ఇందుకు పురాణ గాథలను ఉదాహరణగా చూపారు. తిరుమల క్షేత్రానికి వరాహ స్వామి, దేవునికడపకు హనుమంతుడు క్షేత్ర పాలకులు. అలాగే ఒంటిమిట్ట ఆలయానికి జాంబవంతుడు క్షేత్ర పాలకుడని స్థానిక చరిత్రకారుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్ట జాంబవ క్షేత్రమని పేర్కొనేందుకు జిల్లాలో పలు ఆధారాలు లభించాయి. సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో రోడ్డు వారగా జాంబవంతుని శిలాచిత్రం గల శాసనం లభించింది. పలు తరాలుగా తాము జాంబవంతుడిని పూజిస్తున్నామని, ఒంటిమిట్ట తిరునాలకు గ్రామ వాసులంతా తప్పక వెళతామని తెలిపారు. అంబవరంలో.. కడప నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో అంబవరం గ్రామం ఉంది. గ్రామం మధ్యలో గల చిన్న దిమ్మెపై రెండు అడుగుల జాంబవంతుని విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఒకప్పుడు ఈ స్థలంలో చిన్న రాయి ఉండేదని, దాన్నే జాంబవంతునిగా పూజించేవారమని, పెద్దల కాలం నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. తరతరాలుగా తమ గ్రామంలో జాంబవంతుని పూజలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వరుసగా రెండేళ్లుగా వర్షాలు రాకపోతే నెల రోజుల పాటు ఇంటికొక బిందె చొప్పున నీళ్లు తెచ్చి జాంబవంతుని విగ్రహాన్ని అభిషేకిస్తామని, తప్పక మంచి ఫలితం ఉంటోందని వారు వివరించారు. తాడిగొట్లలో.. కడప నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాడిగొట్ల గ్రామం ఉంది. ఊరి మధ్య విశాలమైన అరుగుపై ఆ గ్రామ ప్రజలు జాంబవంతుని విగ్రహం ఉంది. గ్రామంలో ఏ ఇంటిలోనైనా శుభ కార్యాలు జరిగితే తొలిపూజ జాంబవంతునికే నిర్వహిస్తామని తెలిపారు. వర్షాభావ పరిస్థితి ఏర్పడితే స్వామికి అభిషేకాలు చేస్తామని, తప్పక వర్షాలు కురుస్తాయన్న విశ్వాసం ఉందన్నారు. ఈ గ్రామాలే గాక చిట్వేలితోపాటు కడప నగరానికి సమీపంలోని మరికొన్ని గ్రామాలలో కూడా జాంబవంతుని విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒంటిమిట్ట క్షేత్ర పాలకుడు జాంబవంతుడు గనుక జిల్లాలోని ఆ క్షేత్రానికి సమీపంలో గల చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న గ్రామాలలో నేటికీ పూజిస్తూ ఉండడంతో.. ఒంటిమిట్ట క్షేత్రానికి జాంబవంతుని గల అనుబంధాన్ని భావితరాలకు శాశ్వతంగా తెలిపేందుకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని రామయ్య భక్తులు చిరకాలంగా కోరుతున్నారు. ఇటీవల ఆలయాన్ని పరిశీలించిన టీటీడీ అధికారులకు కూడా విన్నవించడంతో.. వావిలకొలను సుబ్బారావు తపం చేసిన శృంగిశైలంపై జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కొండపైనే తొలుత జాంబవంతుడు నివసించినట్లు కైఫీయత్తుల పరిష్కర్త, చరిత్ర పరిశోధకులు దివంగత విద్వాన్ కట్టా నరసింహులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గిరి ప్రదర్శన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం, సింహాచలంతోపాటు మరికొన్ని దివ్య క్షేత్రాలలో ఆయా దేవతామూర్తుల పూజలో భాగంగా అక్కడ గిరి ప్రదర్శన నిర్వహిస్తుండడం తెలిసిందే. అదే పద్ధతిలో ఒంటిమిట్టలోని శృంగిశైలానికి కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదిజాంబవ మఠాల పెద్దలు పలు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొండపై జాంబవంతుని ప్రతిష్ట జరిగితే ఇక్కడ కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని వారు మరోమారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, ఒంటిమిట్ట తిరునాల సందర్బంగా తాము తమ శిష్య గణాలతో కలిసి శృంగిశైలం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని గుర్తు చేశారు. మంచి నిర్ణయం తీసుకున్నట్లు హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారులను అభినందించారు. ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం -
ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తాం
ఒంటిమిట్ట: టీటీడీకి అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, సకల వసతులు కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తలమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఒంటిమిట్లలో ఆలయం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయానికి బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్టలో రూ.4.60కోట్లతో వసతి సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఏడాదిలోగా మూడు అంతస్తుల కాటేజ్‌ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 22 గదులతో పాటు 700మంది భక్తులకు సరిపడా భోజనశాల ఉంటాయన్నారు. మరో నాలుగు డార్మెటరీల నిర్మాణానికి, అనుబంధ ఆలయాల్లో తెప్పోత్సవాలు నిర్వహించేందుకు, అన్నప్రసాద వితరణను ప్రవేశపెట్టేందుకు త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఒంటిమిట్టలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతియేటా శ్రీసీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు పుట్టా సుధాకర్‌యాదవ్, రమణ పాల్గొన్నారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులపై ఆగ్రహం ఒంటిమిట్టలో నూతనంగా నిర్మించనున్న వసతిగృహానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను టీటీడీ అధికారులు పూర్తిగా విస్మరించారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ పేర్లను టీటీడీ అధికారులు విస్మరించారు. దీనిపె కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులు చైర్మన్‌ను కోరారు. కోదండరాముడిని దర్శించుకున్న చదలవాడ కాటేజీ భూమిపూజకు ముందు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డిలు ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయంలో పూర్ణకుంభం, మేళతాళాలలో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చైర్మన్‌ను స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
కోదండరాముని సన్నిధిలో జిల్లా ఎస్పీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముడిని జిల్లాఎస్పీ పీహెచ్డీ రామక్రిష్ణ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్పీకి ఆలయ విశిష్టతల గురించి తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పూలమాలలు, స్వామివారి శేషవస్త్రంతో ఎస్పీని సత్కరించారు. -
కోదండరాముని సన్నిధిలో జిల్లా ఎస్పీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముడిని జిల్లాఎస్పీ పీహెచ్డీ రామక్రిష్ణ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్పీకి ఆలయ విశిష్టతల గురించి తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పూలమాలలు, స్వామివారి శేషవస్త్రంతో ఎస్పీని సత్కరించారు. -
ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు
సాక్షి, తిరుమల: వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. దానికి తక్షణమే రూ. 20 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు సోమవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. మరికొన్ని నిర్ణయాలు.. ► వైఎస్సార్ కడప జిల్లాలోని దేవుని కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల వసతి సముదాయం నిర్మాణం కోసం రూ. 5 కోట్లు కేటాయించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద తుమ్మూరులోని కరియమాణిక్యస్వామి, శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు. తిరుమలలోని రాఘవేంద్రస్వామి మఠానికి అదనపు స్థలం కేటాయించారు. స్విమ్స్ ఆస్పత్రిలో మాలిక్యులర్ బయాలజీ పరిశోధనశాల ఏర్పాటుకు రూ. 6.03 కోట్లు, డయాలసిస్ భవనంలో అదనపు గదుల నిర్మాణానికి రూ. 3.68 కోట్లతో చేపట్టిన టెండర్ పనులకు ఆమోదం తెలిపారు. ► రూ. 3.92 కోట్లతో తిరుపతిలోని కోదండ రామస్వామి సత్రం, రూ. 3.67 కోట్లతో గోవింద రాజస్వామి సత్రం అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ. 1.25 కోట్లతో విజయనగరం జిల్లా కొత్త వలసలో కల్యాణ మండపం నిర్మాణానికి అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లా కందుకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 25 లక్షలు కేటాయించారు. ► రూ. 1.06 కోట్లతో తిరుమల శ్రీవారి ఆలయానికి 1,150 పట్టువస్త్రాలు కొనుగోలు చేయనున్నారు. ► శ్రీవారి సేవా వ్యవస్థను బలోపేతం చేసేందుకు శ్రీవారి సేవా సెల్‌ను ఏర్పాటు చేశారు. ► టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 12,200, కాంట్రాక్టు కార్మికులకు రూ. 6,100 బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వరద బాధితులకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు టీటీడీ ఆరు బృందాలను పంపింది. మంగళవారం నుంచి టీటీడీ వైద్యులు తమ సేవలందించి, ఉచితంగా మందులు సరఫరా చేస్తారని చైర్మన్, ఈవో ప్రకటించారు. కాగా విచక్షణ కోటా కింద కేటాయించే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ధరలతో పాటు కల్యాణ మండపాలు, తిరుమలలోని గదుల అద్దెలు పెంచాలని టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ నిర్ణయించింది. మరోవైపు తిరుమలలో సోమవారం ఆరని తాజా లడ్డూలు పంపిణీకి సిద్ధం చేశారు. భక్తుల చేతికి అందకుండానే పొడిగా మారడంతో వాటి పంపిణీ ఆపేశారు. -
భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతాం..
కడప : కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన శనివారం శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రూ.4 కోట్లతో ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటి ధ్వజారోహణంలో పాల్గొనడం తన అదృష్టమని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.