Oorantha Anukuntunnaru
-
వెనక్కి వెళ్లేది లేదు
‘‘హీరోతో పోలిస్తే ఎడిటర్ జాబ్ కొంచెం సులభం అని నా అభిప్రాయం. ఎడిటర్‌గా ఒక చోట కూర్చుని మన పని మనం చేసుకోవచ్చు. కానీ హీరోగా ఉండటం కష్టం. ప్రేక్షకులు, మీడియా ఫోకస్ అంతా నటులపైనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? మన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ గమనిస్తూనే ఉంటారు’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. ఎడిటర్ నుంచి హీరోగా మారిన నవీన్.. సీనియర్ నటుడు నరేశ్ తనయుడనే విషయం తెలిసిందే. బాలాజీ సనాల దర్శకత్వంలో నవీన్ విజయ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ– ‘‘నాకు 16ఏళ్ల వయసులో రానా వాళ్ల యాడ్ కంపెనీలో చేరాను. నా ఎడిటింగ్ స్కిల్స్ చూసి కృష్ణవంశీగారు ‘డేంజర్’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ‘రాఖీ, చందమామ’ మరికొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పని చేశాను. ఆ తర్వాత హీరోగా మారాలనుకున్నప్పుడు మా నాన్నగారు కష్టం అన్నారు. దానికి కారణం నేను చాలా లావుగా ఉండేవాణ్ణి. శ్రమించి బరువు తగ్గాను. నా కెరీర్‌కు సంబంధించిన ప్రతి విషయం నాన్నగారితో చర్చించి, ఆయన్ను ఇబ్బంది పెట్టను. కానీ నాన్న విలువైన సలహాలు ఇస్తుంటారు. మహేశ్ అన్న కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతీ సినిమా ఫంక్షన్‌కు ఆయన్ను పిలవడం కరెక్ట్ కాదు. 16 ఏళ్లకు ఎడిటింగ్ మొదలుపెట్టాను. 32 ఏళ్లకు హీరోగా మారాను. ఈ సినిమా విషయానికి వస్తే ప్రేక్షకుడి దృష్టిలో పడాలంటే టైటిల్ భిన్నంగా ఉండాలి. అందుకే ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే టైటిల్ పెట్టాం. రెండు జంటల ప్రేమ, వాళ్ల ఊరి కట్టుబాట్లకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. మళ్లీ ఎడిటింగ్ వైపు వెనక్కి వెళ్లను. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచ నలు ఉన్నాయి’’ అన్నారు. -
‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’
‘‘నేను చేసే పాత్ర నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తే చాలు. సినిమా ఒప్పుకుంటాను. పారితోషికం గురించి పెద్దగా ఆలోచించను. పదేళ్ల తర్వాత ఆ నిర్మాత అంత ఇచ్చాడు.. ఈ నిర్మాత ఇంత ఇచ్చాడు అని లెక్కలు వేసుకోను. అలా లెక్కలేసుకుని పదివేలు తక్కువయ్యాయని ‘అష్టా చమ్మా’ సినిమాను వదులుకుని ఉంటే నాకు జీవితమే ఉండేది కాదు. నేను కొన్ని సినిమాలు ఉచితంగా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్ కూడా చేశాను. అలాగని అన్నీ ఫ్రీగా చేయలేం. నాకూ ఖర్చులు ఉంటాయి’’ అన్నారు దర్శక,నటుడు, రచయిత శ్రీనివాస్ అవసరాల. నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. బాలాజీ సానల దర్శకత్వంలో శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఊరిని, కుటుంబాలను, సంప్రదాయ విలువలను గౌరవించాలనుకునే ప్రేమికుల కథ ఇది. నాది తమిళ వ్యక్తి పాత్ర. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ ఊరికి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆసక్తికరం. శ్రీనివాస్ అవసరాల ఉంటే వినోదం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం కొంతవరకు నిజమని నమ్ముతాను. కానీ నేను కూడా చెత్త సినిమాలు చేశాను. ఆడుతూపాడుతూ చేసిన ‘అష్టాచమ్మా’ పెద్ద విజయం సాధించింది. సూపర్ హిట్ సాధిస్తాయనుకున్న నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. యాక్టర్స్ అందరూ స్క్రీన్ రైటింగ్ చదువుకోవాలన్నది నా నమ్మకం. అప్పుడే కథలు వినేప్పుడు ఏయే అంశాలకు కథలు ఒప్పుకుంటున్నామో తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడిగా నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా చేస్తున్నాను. నటుడిగా ‘నాయనా రారా ఇంటికి’ (ఎన్ఆర్ఐ) సినిమా చేస్తున్నాను. ఈ సినిమా సగం పూర్తయింది. అలాగే ఓ కథ రాస్తున్నా. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు’’ అన్నారు. -
‘ఊరంతా అనుకుంటున్నారు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
విలువలు.. బంధాలు.. వెటకారం
నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ హీరో హీరోయిన్లుగా బాలాజి సానల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘నవీన్ మంచి నటుడే కాదు బ్రిలియంట్ ఎడిటర్ కూడా. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే నాకు ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. పల్లెటూరి ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా టీమ్‌కి ఆల్ ది బెస్ట్. రాధాకృష్ణన్ మంచి సంగీతం ఇచ్చారు. నిర్మాత శ్రీహరిగారు మూడు పాటలు రాశారని తెలిసింది’’ అన్నారు. ‘‘నవీన్ మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వాడు. నేను లో ఫేజ్‌లో ఉన్నప్పుడు నాకో పిల్లర్‌లా ఉన్నాడు. మంచి సినిమా చేశారు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘ఈ సినిమా నాకు ఆశీర్వాదంలా వచ్చింది. ఒక కుటుంబంలా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు నవీన్. ‘‘నవీన్, అవసరాల ఇద్దరూ బాగా నటించారు. బాబు కెమెరా వర్క్, రాధాకృష్ణన్ సంగీతం ఓ ఆకర్షణ’’ అన్నారు బాలాజి. ‘‘నవీన్‌తో వర్క్ చేయడం హ్యాపీ. ప్రేక్షకులు మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తారు’’ అన్నారు రాధాకృష్ణన్. ‘‘మంచి సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు శ్రీహరి. ‘‘పల్లెటూరి విలువలు, బంధాలు, వెటకారం ఇలా అన్ని అంశాలను సినిమాలో వడ్డించాం’’ అన్నారు నిర్మాత పద్మనాభరెడ్డి. ‘‘బాలాజీ గొప్ప దర్శకుడు అవుతాడు’’ అన్నారు పి.ఎల్.ఎన్ రెడ్డి. -
‘ఊరంతా అనుకుంటున్నారు’ టీజర్ లాంచ్!
‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ విజయకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఊరంతా అనుకుంటున్నారు. అవసరాల శ్రీనివాస్ మరో హీరోగా నటిస్తున్నా ఈ సినిమాలో మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ హీరోయిన్స్. బాలాజీ సనాల దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాను రౌఆస్కిర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం ఏప్రిల్ 7న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ముఖ్య అతిధులుగా హాజారు కాగా... హీరో నవీన్ విజయకృష్ణ, హీరోయిన్స్ మేఘ చౌదరి, సోఫియా, దర్శకుడు బాలాజీ సనాల, సంగీత దర్శకుడు కె.ఎమ్. రాధాకృష్ణ, కెమెరామెన్ జి.ఎల్.యెన్. బాబు, నిర్మాతలు పాల్గొన్నారు. అనంతరం చిత్ర టీజర్ ని సాయి ధరమ్ తేజ్, ఇంద్రగంటి మోహనకృష్ణ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘టీజర్ చాలా బాగుంది. టీమ్ అంతా కలిసి ఒక మంచి సినిమా తీశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి. లాస్ట్ టు ఇయర్స్ గా డిఫ్రెషన్లో వున్నప్పుడు నవీన్ సపోర్ట్ చేసి ధైర్యం చెప్పాడు. ఒక బ్రదర్ లా గైడ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసాడు. అలాంటి నవీన్ ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ‘నవీన్ నాకు గత పదేళ్లుగా తెలుసు. వెరీ బ్రిలియంట్ ఎడిటర్ తను. ఈ పోస్టర్ చూడగానే నాకు అష్టాచెమ్మా గుర్తుకువచ్చింది. గ్రామీణ నేపథ్యంలో ఆ పల్లె వాసన, బంధాలు బంధుత్వాలు నేపథ్యంలో వచ్చిన సినిమాలు అన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా బాగుంటుందని టీజర్ చూడగానే అర్ధం అయింది. ఇలాంటి మంచి సినిమా తీసిన టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమా హిట్ అయి నవీన్, శ్రీనివాస్ అవసరాలకు మంచి పేరు రావాలి. నిర్మాతలు పెద్ద విజయాన్ని అందుకోవాలి’ అన్నారు. హీరో నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ.. ‘సంవత్సరం కాలంగా ఈ సినిమా చేస్తున్నాం. అందరం కలిసి ఫ్యామిలీలా కలిసి వర్క్ చేసాం. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అందర్నీ అలరిస్తుంది. కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. బాలాజీ బాగా తెరకెక్కించాడు. నిర్మాతలు మంచి క్వాలిటీతో ఈ సినిమా రూపొందించారు’ అన్నారు.