open cast project
-
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో భారీ ప్రమాదం
-
‘వారసత్వం’ పునరుద్ధరించాలి
► ఎస్ఎస్ఏ సదస్సులో వక్తల డిమాండ్ ► జాప్యంతో ఇప్పటికే రెండేళ్ల సర్వీసు నష్టం ► వేల మంది కార్మికులకు అన్యాయం శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి సన్స్ అసోసియేషన్(ఎస్ఎస్ఏ) ఏర్పాటు చేసిన సమావేశానికి సింగరేణి వ్యాప్తంగా ఉన్న గని కార్మికుల పిల్లలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావు, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకుడు హెచ్.రవీందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గని కార్మికుల ఆకాంక్షలు స్వరాష్ట్రంలో నెరవేర డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన వెంటనే వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. సర్కారు జాప్యం చేయడం వల్ల ఇప్పటికీ 8వేల మంది రెండేళ్ల సర్వీసు అర్హత కోల్పోయారని, తెలంగాణ వచ్చిన ఆనందం సింగరేణిలో లేదన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల సమయం వచ్చే సరికి మరో సారి కార్మికులను ఇదే డిమాండ్‌తో మోసం చేయాలని కార్మిక సంఘాల నాయకులు చూస్తున్నారని విమర్శించారు. కార్మికుల డిమాండ్ కొత్తదేమీ కాదని, కంపెనీ బతకాలంటే వారసత్వ ఉద్యోగాలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐక్య పోరాటాలు చేయూల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. తక్షణమే ప్రభుత్వంతోపాటు యూజమాన్యం స్పందిం చాలని డిమాండ్ చేశారు. గని కార్మికులందరికీ సొంతింటి పథకం అమలు చేయూలన్నారు. కార్మికుల పిల్లలు ఐక్యంగా ఉండి ఉద్యోగాల సాధనకు పోరాడటం హర్షణీయమని అన్నారు. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల ఏర్పాటును అడ్డుకొని సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సంతకాల కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జేఏసీ నాయకులు బాబన్న, శ్రీరాంపూర్ జేఏసీ కన్వీనర్ గోషిక మల్లేశ్, ఎస్ఎస్ఏ అధ్యక్షుడు కృష్ణకుమార్, ఉపాధ్యక్షులు సిద్ధిక్షేక్, ప్రశాంత్, జిల్లా, శ్రీరాంపూర్, సీసీసీ ఇన్చార్జీలు హేమచందర్, అనిల్‌కుమార్, శ్రీరాంపూర్, సీసీసీ ఇన్చార్జీలు సందీప్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
టీబీజీకేఎస్ ఆకర్ష్
► యూనియన్ బలోపేతంపై దృష్టి సారించిన అధిష్టానం ► భారీగా చేరనున్న ఇతర సంఘాల నాయకులు గోదావరిఖని(కరీంనగర్) : రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆకర్ష్ కొనసాగుతుండగా.. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ సైతం దృష్టి సారించింది. జూన్ 28 నాటికి గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తవుతుండగా.. ఆ లోపే యూనియన్ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో నా యకత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగం గా కంపెనీ వ్యాప్తంగా ఉన్న వివిధ ఏరియాలకు చెంది న పలు సంఘాల నాయకులను చేర్చుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణిలో జరిగిన ఉద్యమాల్లో కార్మికులను భాగస్వామ్యం చేస్తూ జేఏసీకి కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించిన మాదాసు రామ్మూర్తిని టీబీజీకేఎస్‌లోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఈయనతో పాటు శ్రీరాంపూర్ ఏరియా ఏఐటీయూసీలో కీలకంగా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన ఆరుగురు నాయకుల చేరిక సైతం దాదాపు ఖాయమైంది. ఇక కొత్తగూడెం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాలకు చెందిన రెండు ప్రాంతీయ కార్మిక సంఘాల నుంచి పలువురు నాయకులు టీబీజీకేఎస్‌లోకి రానున్నారు. ప్రస్తుతం మలేషియూలో పర్యటనలో ఉన్న యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈనెల 14న స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత అన్ని ఏరి యాల నుంచి నాయకులను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌కు పిలిపించి యూనియన్‌లో చేర్చుకునే కార్యక్రమం చేపడతామని ఓ నాయకుడు తెలిపారు. ఇదిలా ఉండగా గుర్తింపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున యూనియన్ ఎక్కడెక్కడ బలహీనం గా ఉందనే విషయమై పరిశీలించి ఆయూ ఏరియూల్లో నాయకులను మార్చే పనిలో అధిష్టానం నిమగ్నమైం ది. ఇప్పటికే పలు గనులలో ఫిట్ కార్యదర్శులను మార్పు చేశారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలోనూ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తమ్మీద ఎన్నికల నాటికి యూనియన్ బలాన్ని పెంచుకుంటూ గెలుపే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతున్నది. -
భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి
మంచిర్యాల టౌన్ : జిల్లాలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు, నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో నీటిపారుదలశాఖ, ఆర్డబ్ల్యూఎస్, ప్రాజెక్టుల ఎస్డీసీలు, సింగరేణి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పనులతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో చేపడుతున్న ప్రాజెక్ట్ పనులు, భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారమూ తక్షణమే అందించేలా చూడాలన్నారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, రోడ్లు, మురికికాలువలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. శ్రీరాంపూర్, కాసీపేట ఓసీపీల కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ భూములను వెంటనే సింగరేణి అధికారులకు అప్పగించాలని పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న చందనాపూర్, పడ్తనపల్లి గ్రామాల పునరావాస కాలనీల్లో రోడ్ల వెడల్పు, సీసీ రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారని ఈఈ కలెక్టర్‌కు నివేదించారు. సమావేశంలో మంచిర్యాల ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, ఎస్డీసీలు తిరుపతిరావు, పాండురంగం, ప్రత్యేక కలెక్టర్ సుందర్ అబ్నార్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గూడెంలో కలెక్టర్ పూజలు గూడెం(దండేపల్లి) : దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయాన్ని కలెక్టర్ జగన్మోహన్ గురువారం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వెంకటస్వామి, ఈవో పురుషోత్తమాచార్యులు కలెక్టర్‌ను సన్మానించారు. ఆలయం వద్ద వసతుల కల్పన వివరాలను ఈవో వివరించారు. కాగా, గూడెం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఘాట్‌రోడ్డు, తాగునీరు, విద్యుత్ సరఫరా కోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పుష్కరఘాట్ స్థల పరిశీలన 2015 జూలైలో జరిగే గోదావరి మహాపుష్కరాల కోసం గూడెం గోదావరి నది వద్ద నిర్మించనున్న పుష్కరఘాట్ స్థలాన్ని కలెక్టర్ జగన్మోహన్ గురువారం పరిశీలించారు. పుష్కరాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన నిధులు తక్షణమే మంజూరు చే స్తామన్నారు. ప్లాస్టిక్ కవర్లు, చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీరు కలుషితం కాకుండా చూడాలని చెప్పారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు, నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్, తహశీల్దార్ ముబిన్మైమద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ శివకృష్ణ ఉన్నారు. లక్సెట్టిపేటలో.. లక్సెట్టిపేట : లక్సెట్టిపేట శివారులోని గోదావరి నది పుష్కర ఘాట్‌ను కలెక్టర్ ఎం.జగన్మోహన్ గురువారం పరిశీలించారు. నది తీరంలో శివలింగం ఏర్పాటు చేయాలని ఎంపీపీ కట్ల చంద్రయ్య కోరగా చర్చిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి గోదావరి వరకు రోడ్డు విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, జెడ్పీటీసీ సభ్యుడు చుంచు చిన్నయ్య, ఇన్చార్జి తహశీల్దార్ ఇంతియాజ్, ఎంపీడీవో రాంప్రసాద్, ఈవోపీఆర్డీ సత్యనారాయణ ఉన్నారు. -
భగ.. భగ..
కొత్తగూడెం, న్యూస్‌లైన్: భానుడి ప్రతాపానికి జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తుండడంతో విధులకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే వేడిగాలులు ప్రారంభమవుతుండడం, మధ్యాహ్నం తీక్షణంగా ఉంటుండడంతో రహదారులు బోసిపోతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వేసవి ధాటికి తట్టుకోలేక వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోనే కొత్తగూడెం పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. శుక్రవారం 48.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు వద్ద 50 డిగ్రీలకుపైగానే ఉంటోందని కార్మికులు అంటున్నారు. ఇక పారిశ్రామిక ప్రాంతాలైన పాల్వంచలో శుక్రవారం 47డిగ్రీలు, మణుగూరులో46, ఇల్లెందులో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, భద్రాచలం, సత్తుపల్లిలో 45 డిగ్రీలు, ఖమ్మంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే మరోరెండురోజులలో ప్రారంభమయ్యే రోహిణికార్తెలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వాతావరణ మార్పులతో అనారోగ్యాలపాలు.. కాగా, జిల్లాలో రోజుకోవిధమైన వాతావరణ మార్పులతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం భారీగా కురిసిన వర్షం కారణంగా వాతావరణం చల్లబడగా... రెండు రోజులకే తిరిగి ఉష్ణోగ్రత పుంజుకుంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురికావడం, చర్మ వ్యాధులు, గొంతులో మార్పులు, ఎండ వేడి కారణంగా కళ్లకు సంబంధించిన వ్యాధులు సోకుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.